Tuesday 12 March 2013





నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని!

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని!
మారదు లోకం! మారదు కాలమ్!
దేవుడు దిగి రానీ... ఎవ్వరు ఏమైపొనీ... 
మారదు లోకం! మారదు కాలమ్!
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి?
గొర్రెదాటు మందకి మీ జ్ఞాన భోధ దేనికి?
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం?
ఏ క్షణాన మార్చుకుంది? జిత్తుల మార్గం!
రామబాణమాపిందా రావణ కాష్టం!
కృష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం!

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైన 
అడవి నీతి మారిందా?ఎన్ని యుగాలైనా?
వేట అదే వేటు అదే! నాటి కథే అంతా !
నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింతా?
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా 
శతాబ్దాలు చదవలేదా  ఈ అరణ్య కాండ!




రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 
సినిమా : గాయం 
గానం : S.P.బాల సుబ్రహ్మణ్యం గారు 

No comments:

Post a Comment