Monday 27 August 2012

LOVE - The Story of an innocent Girl


Written by Jyothi

ఒక అమ్మాయి జీవితంలో జరిగిన అనూహ్య  సంఘటనలు తన జీవితాన్ని ఎలా మర్చాయి ? తన వక్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకుంది అనే దానికి ప్రతిరూపం ఈ కథ.

     ఒక అమ్మాయి జీవితంలో వివిధ వయక్తిక  దశలలో ఎదురైన వివిధ  సంగటనలను ఎదుర్కోలేక అమాయకత్వంతో జీవితాన్ని ఎలా నాశనం చేసుకుందో తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవాలి  న ఆకాంక్ష. This is not a  true story. ఎవరినీ నొప్పించాలని కాదు. ఏ అమ్మాయీ ఈ కథ లోని పాత్రలా తెలివితక్కువగా ఉండకుడదు. ఒక అమ్మాయి తెలివితక్కువ తనం, అమాయకత్వం తో అందర్నీ నమ్మేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం!


13-15 సం. వయస్సు. ఇది తెలియని తనం. పక్కవాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అదే correct అనుకుంటారు. అసలు ప్రేమంటే ఏంటో కూడా తెలీదు కానీ స్నేహితులు ఎంచేప్తే అదే చేస్తారు.

16-19 వయస్సు. ఈ వయస్సులో ఎవడో ఒకడు వచ్చి I love you చెప్పగానే వాడు అందంగా ఉన్నాడా? మన స్నేహితులు చూస్తే మేచ్చుకుంటారా? అనే తప్ప అసలు అతనెవరు? ఏం చేస్తుంటాడు. సంపాదన కలవాడా? లేకపోతే జూలాయా? అని ఆలోచించరు ఈ age very dangerous. ఈ ageలో physical Attraction చాలా ఉంటుంది.

                     20 సం. తర్వాత వయస్సు. ఈ వయస్సుకోచ్చేసరికి వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. this is matured age. ఈ వయస్సులో వాళ్ళు చేస్తుంది తప్పా , ఒప్పా  అనేది అలోచించి చేస్తారు. ఈ వయస్సుకోచ్చేసరికి ఒక అమ్మాయికైనా, అబ్బాయికైనా వాళ్ళకు ఎలాంటివాళ్ళు కావాలో వాళ్ళు తెలుసుకోగలరు. ఈ వయస్సులో ఆకర్షణ తక్కువ. ఈ వయస్సులో ప్రేమ నిజమైనది. కానీ 20 సంవత్సరాలు నిండేవరకు జీవితాన్ని control లోనే ఉంచుకోవాలి. ఎటువంటి ఆకర్షణకు లోనుకాకూడదు. ఆ వయసులో మనకు తెలియకుండానే ఒక బాధ్యత, ఏ పని చేసిన అందరి గురించి అలోచించి correct అయితేనే చేస్తుంటాం.

                     కథ కన్నా ముందు మీకు ఒకటి చెప్తాను. కల్లతోచూసి ప్రేమించామనుకునే ప్రేమ కొంతకాలమే ఉంటుంది. కొత్త మురిపం అంటారు కదా అలా! కానీ మనసుతో చూసి ప్రేమించే ప్రేమ మరణాంతరం ఉంటుంది. చనిపోయాక కూడా అలాగే ఉంటుంది. అది అవతలి వ్యక్తి నుండి ఎమీ ఆశించనిది.


           జానకి. మనం చెప్పుకోబోయేది తన గురించే!

ఈ అమ్మాయి తన జీవితాన్ని 3దశలలో ఎలా మలుచుకుంది మనం చూద్దాం! పేరు : బొడ్డుపల్లి జానకి, పుట్టినరోజు 1991 మర్చి 13, తల్లి వెంకటమ్మ , తండ్రి చక్రధర్ , చెల్లి కవిత.

                    ముందుగా వీళ్ళ అమ్మ గురించి తెలుసుకుందాం! అమ్మ అంటే బిడ్డ తన కడుపున తన్నినా అక్కున చేర్చుకునేది. పుట్టించిన ఆ దేవుడు కన్నా అమ్మ గొప్పది కదా! కానీ ఈమే ఒక అమ్మ ఎలా ఉండకూడదో అలా ఉంటుంది. చాలా అనుమానం. ఫోన్ పట్టుకుంటే "ఎందుకు పట్టుకున్నావే? ఎవరికీ మెసేజ్ చేస్తున్నావ్? ఎవడే వాడు? అని ప్రతీ క్షణం అనుమానిస్తుఉండేది. బహుశా ఈమె వల్లేనేమో జానకి ఏదైతే చేయకూడదు అనుకుందో అదే చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎవరైనా ఆ గది తప్ప అన్ని గదుల తలుపులూ తెరవమని చెప్పారనుకోండి. మనలో మనం ఆ  గది గురించే ఆలోచిస్తాం. దాన్ని తెరవాలని చాలా try చేస్తాం. అలాగే ఫోన్ పట్టుకోవద్దు అంటే అదే పట్టుకొవాలనిపిస్తుంది. తిక్క తిక్క పనులు చేయొద్దు అంటే అవే చేయాలనిపిస్తుంది కదా! పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రెండ్స్ లా ఉండాలి. ప్రతి అమ్మాయి తన  తల్లిదండ్రులకు ఏ విషయమైనా చెప్పుకునేలా ఉండాలి. ఎందుకంటే జీవితంలో ప్రతి సెకను చాలా విలువైనది. ఇక చక్రధర్ విషయానికొస్తే... ఏ తండ్రీ ఇలా ఉండకూడదు అనుకునేలా ఉంటాడు. ఏ కన్నతండ్రి  తన కూతురిని తిట్టకూడని విధంగా తిడతాడు. జానకి తెలివిలేనిదని రోజుకు 10సార్లయినా తిడతాడు. ఒక అమ్మాయిని నువ్వు తెలివిలేనిధానివి, నీకు ఏదీ చేతకాదు, పనికిమాలినధానివి అని రోజూ తిడితే అ అమ్మాయి నిజంగానే తెలివి లేకుండా తయారవుతుంది. ఆ అమ్మాయికి బయటి ప్రపంచం అంటే ఏంటో తెలీకుండా పెంచారు.ఎప్పుడూ బయటికి పంపేవారు కాదు. పంపితేనే కదా బయటి పరపంచం ఎలా ఉంది? ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు? మనం అవతలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి? అనేది మనకు తెలుస్తుంది. 

                    ఇక కథలోకి వెళ్తే... జానకి మామూలు విధ్యార్దే! సామాన్యంగానే చదువుతుంది. జానకి వయస్సు ఇప్పుడు 12 సంవత్సరాలు. 7వ తరగతి చదువుతోంది. జాహ్నవి వాళ్ళ మేనత్త దీపావళి రోజు నోముకు  వీళ్లను పిలిచింది. అందుకు జాహ్నవి వాళ్ళ ఊరువెళ్ళింది. జాహ్నవి వాళ్ళ అత్తకు ఇద్దరు పిల్లలు. కొడుకు జాహ్నవి కంటే 1సం. పెద్దవాడు. కూతురు సరిత. జహ్నవికి, సరితకు 3నెలలు తేడా! ఇద్దరూ ఒకే తరగతి చదువుతున్నారు. చాలా  కలిసిమెలిసి ఉంటారు.  అన్నట్టు మీకో వ్యక్తిని పరిచయం చేయాలి. ఇతనే చిన్నప్పటి నుండి  జానకిని  వేదిస్తున్న వ్యక్తి  ఇతడే సరిత  అన్న  పృథ్వి. తరచూ తన దగ్గరికి  రావడం, అదీ ఇదీ మాట్లాడటం,   జానకి ఎక్కడ  వుంటే అక్కడికి రావడం ,తనను విసిగించడం  చేస్తాడు .జానకికి  అది  నచ్చదు.ఉదాహరణకి జానూ తనని సైకిల్  నేర్పమంటే  పృథ్వీ  నా  ముందు  కూర్చుంటే  నేర్పిస్తా  లేక  పొతే  లేదు  అనే వాడు. ఎవరినా  నేర్పించమంటే  తను దిగి  నేర్చుకునే  వ్యక్తిని కూర్చోపెట్టి  నేర్పిస్తారు  కానీ  ఇతను  అలాకాదు  ఇలా  చాల  సతాయించేవాడు.అన్నట్లు  వీడు చడువుటలేడు.తనకు వంటబట్టలే  తనకి  అందుకే  తన తండ్రి  చదివించలేదు . అందుకని పృథ్వీ  బట్టల దుకాణంలో  పని  చేసేవాడు. జానకి , సరిత  చాలా కలిసి  మెలిసి  ఆడుకునేవారు. ఈవిదంగా జానకి 7వ తరగతి పూర్తి  చేసింది.
                               
                                      జానకి  8వ తరగతికి  వచ్చింది