Monday 24 December 2012

నేనేలేని నా నవ్వుల్లో
ఏం మిగిలింది నువ్వొదిలిన
జ్ఞాపకం తప్ప!

                            నాదేకాని చూపులో
                            ఏం కనిపించింది?
                            నీ రూపు తప్ప!
                                                   
                                                        నీతో రాని నడకలో
                                                        ఏం మిగిలింది?
                                                        నీ అడుగుల జాడ తప్ప!

                                                                                       నీకై వేచి ఉన్న వేళలో
                                                                                       ఏం నిద్ర ఇది?
                                                                                       నీ కలలు తప్ప!

-భార్గవి కులకర్ణి 
23/12/12 
మరు మల్లెల వెన్నెలలు...
పిల్లగాలి తెమ్మెరలు....
చిరుజల్లుల తోలకరులు...

మదిని మధించే మదనులు...
కనుగీటి కవ్వించే కన్నెలు..
దరహాసపు దొంతరలు..
సెలయేటి గలగలలు...
ఉప్పొంగిపోయే మదుల నదులు...
విరహాల తపనలు....
విలాసాల సౌధాలు....

ఏవీ ఎరుగని పదాల గమనం!
ఏదో చెప్పే పెదాల కవనం!

కరువులేని కలలు తప్ప ,
కదలలేని కలం తప్ప,
ఏమీతెలియని కగితమిది!
నా కవితకు ప్రాణమిది!!

-భార్గవి కులకర్ణి 
23/12/12


Wednesday 12 December 2012


ఒకరిపై మనకున్న అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఏ పని చేసినా తప్పే అనుకోవడం, దాన్ని ఎత్తిచూపడం, ఏ ప్రయత్నం చేసినా పనికిమాలిన వాళ్ళ కింద జమకట్టడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.

నీ లోని మంచి నువ్వు తెలుసుకోలేకపోయావు.
కానీ ఎదుటివారిలోని మంచితనాన్ని చూడు.
నీలో నీకె తెలియని చెడ్డవాన్ని వెతికి సంహరించు.
లేదంటే నీలోని చెడ్డతనం నిన్ను చేతకాని వాడిగా చేసి నీ అహానికి నిన్నే బలిస్తుంది.

వాళ్ళు గతం లో ఏంటి?,  చిన్నా?పెద్దా?, చదువరేనా?, కాదా?, డబ్బుందా?, లేదా? అనేది ప్రశ్నే కాదు.
వర్తమానం చూడు. భవిష్యత్తు గురించి ఆలోచించు.
గడవాల్సిన కాలం చాలా ఉంది మన కళ్ళ ముందు!


                                                                                                        ~ Bhargavi 

Sunday 2 December 2012

Value of Life

                                         



                                          అది చిమ్మ చీకటి.  అప్పుడు రాత్రి 11 అవుతుంది. పిలవటం కాదు అరచినా పలికే దిక్కే లేదు. ఆ రోడ్డుపై ఒక అమ్మాయి భయం భయంగా నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఒక జీపులో బాగా ధనవంతుల కొడుకులు బాగా పార్టీ చేసుకుని అరచుకుంటూ వస్తున్నారు. అందులో ఒకడు ఈ అమ్మాయిని చూసి జీపు ఆపమన్నాడు. ఆ అమ్మాయికి భయంవేసి తొందరగా నడుచుకుంటూ వెళ్తోంది. వాడు కూడా ఆ అమ్మాయి వెనుక నడుస్తున్నాడు. ఆ అమ్మాయి పరిగెత్తడం ప్రారంభించింది. వాడూ తన వెంట పరిగెత్తాడు. ఆ జీపులో ఉన్న మిగతా సన్నాసులు జీపు స్పీడుగా తీసుకెళ్ళి అమ్మాయి ముందు ఆపారు. అందరూ దిగి ఆ అమ్మాయి చుట్టూ నిలబడ్డారు. ఆ అమ్మాయి వెనక్కు జరుగుతూ ఉంటే వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంతలో అందులో ఒకడు ఆ అమ్మాయిని పట్టుకుని లాక్కేల్తున్నాడు. ఆ అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తోంది. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ అమ్మాయి ఆర్తనాదాలు ఎవరికీ వినబడలేదు. అందరూ కలసి అమ్మాయిని అడవిలోకి తిస్కేల్లారు. ఆ అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూనే ఉంది. ఇంతలో నో... అలా జరగడానికి వీల్లేదు అని అరుస్తూ ఒక్కసారిగా ఆ అమ్మాయి నిద్ర లేచింది. చూస్తే రాత్రి 12 అవుతోంది. ప్రక్కకు చూస్తే తన డిస్కు కనిపించింది, దాని పైన బెడ్ లాంప్, పక్కనే తన ఫోన్. అప్పుడు అర్ధమైంది తనకు అది కల అని. ఇంతకూ ఆ అమ్మాయి పేరు విరోనిక. ఆడవాళ్లకు అన్యాయం జరిగితే తనకు నచ్చదు. తన్నిప్పుడు B.tech final year. వాళ్ళకు చాలా ఆస్తి ఉంది. అమ్మాయి వ్యక్తిత్వం విషయానికి వస్తే ఆడవాళ్లకు అన్యాయం జరిగితే నచ్చదు. అబ్బాయిలు అంటే కోపం. అందరిపై కాదు. అమ్మాయిలను మోసం చేసే వాళ్ళంటే నచ్చదు. అందరితో మంచిగా ఉంటూ, అందరితో స్నేహం చేయాలనీ, స్నేహితుల ఫొటోస్, వీడియోస్ తీసుకుని జ్ఞాపకాలుగా దాచుకోవాలని తన ఆశ.

                            తనకు ఒక స్నేహితురాలు. తన పేరు విమల. విరోనిక కు విమల అంటే చాలా ఇష్టం. విమల చాలా మంచిది, పేదవాళ్ళు. విమలకు కూడా విరోనిక అంటే ఇష్టం. చాలా మంచి స్నేహితులు. ఏ వస్తువైనా చేరి సగం పంచుకుంటారు. lunch box అయినా ఇద్దరూ సగం సగం తిన్న తర్వాత మార్చుకుంటారు. పెన్నులు ఇద్దరూ ఒకేసారి కొంటారు. సగం వరకూ వాడుకున్నాక మార్చుకుంటారు.

                           విమలను ప్రేమిస్తున్నానంటూ ఒకతను 3 సంవత్సరాల నుండి వెంటపడుతున్నాడు. ఆ అబ్బాయి  ధనవంతుడు.విరోనిక కూడా ఆ అబ్బాయి అంటే ఇష్టపడదు. అందుకే  విరోనిక చెప్తుండేది విమలకి వద్దే నవ్వు వాన్ని ప్రేమించకపోవడమే correct అని చెప్పేధి. విమల కూడా ఒప్పుకున్ధి. విమలకు కూడా తెలుసు వాడు ధనవంతుడు అని, తను పేద అని అందుకే అతను ఎం చెప్పబోయినా పట్టించుకోకపోయేది. అతని పేరు సాయి. విరోనిక సాయిని తిట్టినా ఏమీ అనకపోయేవాడు. ఎందుకంటే విరోనిక వాళ్ళు చాలా ఆస్థిపరులు. ఇది ఇలా ఉండగా ఒకరోజు విరోనిక ఏదో బుక్ కోసమని లైబ్రరీకి వెళ్ళింది. విమల తన ఫ్రెండ్ విరోనిక లేకుండా తను ఒక్కతే క్లాసు లో ఉందని తెలుసుకుని ఇదే మంచి చాన్స్ అనుకుని విమల ఉండే క్లాసు కు వెళ్ళాడు సాయి. విమలా... ఈరోజు నువ్వు నాకు ఐ లవ్ యు చెప్పాలి లేకపోతే నే చచ్చిపోతా అని కత్తి తీసుకున్నాడు. విమల తలఎత్తి చూడలేదు. చెప్తావ లేదా అని బెదిరించాడు. విమల తల పైకెత్తకుండానే ప్లీజ్ అండి నన్నిలా ఉండనివ్వండి అంది. అంతేనా అంటూ సాయి తన చేయి కోసుకున్నాడు. అది చూసి విమల తట్టుకోలేకపోయింది. తన రుమాలు తీసుకుని సాయి చేతికికడధామని చేయి పట్టుకుంది. అతను చేయి వెనక్కు లాక్కుని ఐ లవ్ యు చెప్తేనే కట్టు లేదంటే వద్దు అన్నాడు. విమల ప్లీజ్ అండి అలా అనకండి అంటూ చేయి థీసుకోబోయిన్ధి. వెంటనే సాయి తన చేయి మరోసారి కోసుకున్నాడు. రక్తం బాగా పోతుంది. అది చూసి విమల సరే సరే అండి ఐ లవ్ యు అని చెప్తుండగా విరోనిక వచ్చి చూసింది. విరోనికను విమల చుడలేదు. అతనికి కట్టు కట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. సాయి చాలా ఆనందంగా ఉన్నాడు. విమల ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అని చెప్పింది. నువ్వు ఐ లవ్ యు అని చెప్పావ్‌గా ఇంకా చేయనులే అన్నాడు.

                        ఆ తెల్లారి విమల విరోనికను కలిసింది. విరోనిక అలా ఎలా నమ్మావ్ విమలా అంది. విమల విరోనిక తో ఎం చేయాలో తెలియలేదు అతను నాకోసం రక్తం చిందించాడు అతను మంచివాడే అంది. విరోనిక కు నమ్మకం లేకపోయినా తన స్నేహితురాలి సంతోషం ముఖ్యం అనుకుని పట్టించుకోలేదు కానీ ప్రతిరోజూ జాగ్రత్త చెప్తుండేది. ఓరోజు సాయి తన పుట్టినరోజు సందర్భంగా విమలను తన ఇంటికి పిలిచాడు. విమల నేను రాను, ఏమీ అనుకోవద్దు అని చెప్పిన్ధి. సాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నేనేదో అడిగానని ఊరికే చెప్పావా?
లేకపోతే ఏంటి? నాతో బైక్ మీద రమ్మంటే రావు, కాంటిన్ కు రమ్మంటే రావు అన్నాడు. విమల వెంటనే ఒప్పుకుంది. కానీ ఈ విషయం విరోనికకు చెప్పకూడదు అన్నాడు. విమల ఎందుకని అడిగింది. రేపు మా ఫ్యామిలీ ఇంకా నువ్వు మాత్రమే ఉండాలి అలాగే రేపు మన పెళ్లి గురించి చెప్పేద్ధామనుకుంటున్నా మధ్యలో మీ విరోనిక ఎందుకు? తను ఎమైనా అంటే మావాళ్ళతో ఎలా? అసలే నేనంటే పడదు తనకు అన్నాడు సాయి. విమల సరే అంది. తెల్లారి క్లాసు కు వచ్చారు ఇద్దరూ. ఎప్పటిలాగే క్లాసు లు అవ్వగానే విరోనిక విమలను వాల్ల ఇంటి దగ్గర దించడానికి వెళ్దామని పిలిచింది. కానీ విమల ఈరోజు మా నాన్న వస్తానన్నాడు నన్ను తీస్కేల్లడానికి, నువ్వెల్లిపో అంది విరోనికతో. అప్పుడు విరోనిక ఇధేన్తే కొత్తగా అన్ధి. పండుగ వస్తుందిగా... కొత్త బట్టలు కొనడానికి తీసుకు వెళ్తా అన్నాదు మా నాన్న అంది విమల. సరేలే మీ నాన్న వచ్చేదాకా నేనిక్కడే ఉంటా అంది విరోనిక ఇదంతా సాయి గమనిస్తూనే ఉన్నాడు. విరోనిక ఎప్పుడు వెళ్ళిపోతుందా విమల ను తను ఎప్పుడు తీసుకెళ్ధామా అని ఎదురు చూస్తున్నాడు. విమల నువ్ వెళ్ళవే మా నాన్న వస్తూనే ఉంటాడు నువ్వింక వెళ్ళు అంది విరోనికతో. విరోనిక సరేనని బయల్దేరింది అయినా తన మనసులో ఏదో చెడు జరగబోతోందని అనుకుంటూ వెళ్ళింది.

                             సాయి విమల ను తన బైక్ పై గెస్ట్ హౌస్ కు తీసుకెళ్ళాడు. ఇద్దరు లోపలికెళ్ళగానే విమల మీ అమ్మానాన్న ఎక్కడ అని అడిగింది. వాళ్ళు కొంచం బిజీ కధా ఆఫీస్ పనులతో వస్తుంటారు నువ్వు కూర్చో అని జ్యూస్ తీస్కొస్తానని వెళ్తుండగా ఇప్పుడెం వద్దులే అంది. అలా కాదంటూ మత్తుమందు కలిపిన జ్యూస్ తెచ్చి విమలకు ఇచ్చాడు. సగం తాగింది. కాసేపటి తర్వాత కళ్ళు తిరుగుతున్నాయంది. సాయి తనని బెడ్ రూమ్ కు తీస్కెళ్ళాడు. విమల మత్తులో కూడా వదలమని తిడుతోంది. కళ్ళు తెరచి చూస్తే టైం 8అవుతుంది. వెంటనే లేచి ఎందుకింత పని చేసావ్? పెళ్లి గురించి మాట్లాడుతానని చెప్పి ఇలా చేస్త్థావా అని తిడుతుంది. సాయి "నీ మీద మోజుపడ్డా... అందుకే నీను ప్రేమిస్తున్నాననే నాటకం ఆదాను. నిన్ను నమ్మించి మోసం చేసా" అన్నాడు. విమల ఇదంతా ఇప్పుడే నా ఫ్రెండ్ విరోనికకు చెప్పేస్తానని వెళ్తుంటే ఆపి ఒకసారి ఇటు చూడమన్నాడు. తన మొబైల్ లో తీసిన వీడియో చూపించి "ఈ విషయం ఎవరితో చెప్పినా ఈ వీడియో అందరికి mms పంపుతా! దాంతో మీ అమ్మా నాన్నా ఉరేసుకుంటారు" అని బెదిరించాడు. ఇంటి వరకూ ఏడుస్తూనే వెళ్ళి కళ్ళు తుడుచుకుని ఇంట్లోకెల్తుంది. ఇంతసేపు ఎక్కడికెళ్లావని అడుగుతాడు వాల్ల నాన్న. "విరోనిక వాళ్ళింట్లో ఉన్నా నాన్నా! ఇద్దరం కంబైండ్ స్టడీస్ చేసాం ఇంతసేపు" అని చెప్పి లోపలికెల్తుంది.
రోజూలాగానే తెల్లారి కాలేజీకి రాగానే విరోనిక పలకరించింది. సమాధానం లేదు. తను ఎప్పట్లాలేదు. ఏమైందే అలా ఉన్నావంది విరోనిక. "ఏంలేదే మామూలుగానే ఉన్నా! నీకెప్పుడూ అనుమానాలే అంది.
అంతలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. విమల సరిగ్గా చదవటంలేదు, ఎందుకలా ఉంటుందో విరోనికకు ఏం అర్థంకాలేదు. విమలను పిలిచి ఓరోజు బాగా చదువు. నువ్ చదివి మీ అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలిగా అంది. విమలకు ఎం చేయాలో అర్థం కాలేదు. విరోనికకు చెప్పాలనుకున్నా కూడా వాడు వీడియోస్ అందరికి పంపిస్తాడేమో అనే భయం తనని ఆపేసింది. ఎం చేయాలో అర్థం కాలేదు. అలా వాడు చెప్పినట్లు చేయలేక తనకు చావే గతి అనుకుని లెటర్ రాసిపెట్టి ఉరేసుకుంది. విరోనికకు ఈ విషయం తెలిసి బాధపడుతూ వెంటనే వచ్చింది. తనచేతిలో ఉన్న లెటర్ తెరచి చూసింది.

" ప్రియమైన అమ్మానాన్నలకు....
      క్షమించండి...!! నేను బాగా చదివి మిమ్మల్ని బాగా చూసుకుందామనుకున్నాను. కానీ నేను చేసిన ఒక తప్పు వల్ల ఈపని చేయాల్సివచ్చింది. తమ్ముడిని బాగా చదివించండి. వాడికి నా ఆశిస్సులు!
  విరోనికా...!! నువ్వు చెప్పింది నిజమే! సాయి  మంచోడు  కాడు. ఆరోజు మా నాన్న వచ్చి తీస్కెల్తారని అబద్ధం చెప్పాను. సాయి మా పెళ్లి విషయం గురించి తన పేరెంట్స్‌తో  మాట్లాడిస్తానని గెస్ట్ హౌస్‌కు తీస్కెళ్ళాడు. జ్యూస్‌లో మత్తు మందు కలిపి నన్ను వశపరచుకున్నాడు. అదంతా వీడియో తీసి, తన ఫ్రెండ్స్ కోరిక తీర్చకుంటే అందరికీ ఆ వీడియో చూపిస్తానని బెదిరించాడు. అందుకే మళ్ళి ఇంకో తప్పు చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. తరతరాలుగా ఆడదానికి ఇదే ఆనవాయితీగా జరుగుతోంది. శీలం అనేది ఆడదానికి మాత్రమేనా? మగాడికి లేదా? ఒకబ్బాయి ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనమ్ చేసినా వాడి శీలం పోయిందని ఎవరూ అనరు. పైగా వాడు మగాడు అని అంటారు . అదే ఒక ఆడది మగాడి క్రూరత్వం  వల్ల తన శీలం కోల్పోతే ఆ అమ్మాయి చెడిపోయిందని,  సూటిపోటి మాటలతో హింసిస్తారు. ఇంతేనా...? ఈ మనుషులు మారరా? కాలమ్ మారదా? ఆడవాళ్లు ఇలా బలికావాల్సిందేనా?? వాడికి శిక్షపడేలా చేసి నా ఆత్మకైనా శాంతి కలిగించు ఇదే నీ బెస్ట్ ఫ్రెండు గా నా చివరి కోరిక....."
                                               
ఇట్లు
మీ విమల

అది చదివిన విరోనిక చాలా బాధపడింది. సాయిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి.కాని  వాళ్ళ నాన్న ఆస్తిపరుడు  కావడంవల్ల తనకి  అతిధి మర్యాదలు చేసి  పంపారు . విరోనికకు  చేయాలో అర్ధం  కాలే  వాడికి  శిక్ష  పడాలంటే  సాక్ష్యం  కావాలి.  ఇంతలో  కేసు  కోర్టుకి  వచ్చింది. విరోనిక  సాక్ష్యాలను చూపి  సాయికి జీవిత ఖైదు వేసేలా చేసింది. సాక్ష్యం  ఎలా  సంపాదించిందంటే  సాయి డైలీ  వెళ్ళే  పబ్బులో  తను డ్రింక్ చేసే  రూం లో తన ఫ్రెండ్స్ తో విమల ప్రేమించడం, మోసంచేయడం,వీడియో తీయడం ,బెదిరించడం ,అంతేకాక  విమలతో మీరుకూడా  ఎంజాయ్ చేయిస్తానని చెప్పడం అక్కడ వున్నా కెమెరాలో రికార్డు  అయింది . ఆ  ఆధారాన్ని తన పలుకుబడితో సంపాదించి కోర్టులో ఇచ్చి శిక్ష పడేలా  చేసింది .
              విరోనిక  మనస్సు  శాంతించలే  ఇలా ఎంత మంది  అమ్మాయిలు  సాయి లాంటి దుర్మార్గుల  చేతిలో  పడి  బలైపోతున్నారో?నా  ఫ్రెండ్  ల మరో అమ్మాయి బలి కాకూడదు కానీ ఎం చేయాలి?ఎలా ఇ  అనర్దాలు ఆపాలి అని ఆలోచించగా  తనకి ఒక ఐడియా  వచ్చింది . అనుకుందే  తడువుగా  రాత్రి పగలు తేడా  లేకుండా సంవత్సరం కష్టపడి స్పూర్తి అనే ఆర్గనైజేషన్ వాళ్ళ నాన్న సహాయం తో కట్టించింది. కానీ తను ముందే చెప్పింది ఆర్గనైజేషన్ కు అయిన ఖర్చు తన జీతంతో తీర్చేస్తానని చెప్పింది.
                   తెల్లారి  ఆర్గనైజేషన్ ముక్య  ఉద్దేశం  అందరికి తెలియచేయడానికి విరోనిక న్యూస్ పేపర్లో ఇచ్చిన ప్రకటనను వాళ్ళ నాన్నకు చూపించింది .
                    "స్పూర్తి   ఆర్గనైజేషన్"
                                  'జీవితంఫై  ఆశ వదులోకోకండి'
                     ఈ  సంస్థ యొక్క ముక్య ఉద్దేశం  ఎ  అమ్మాయికయిన ఆత్మహత్యా  చేసుకోవాలనే  ఆలోచన వచ్చినపుడు ఈ  ఆర్గనైజేషన్ కు కాల్ చేస్తే ఆ అమ్మాయి సమస్యకి పరిష్కారం  చూపించి తనకు బ్రతకకలిగే ధైర్యాన్ని,సామర్ద్యాన్ని,పుణ్యాని పెంచటమే!
                   మీరు చేయవలిససిందల్ల స్పూర్తి. కామ్ లో  రిజిస్టర్  చేసుకొని  వీడియో కాల్ చేసి  మీ సమస్యకు  మా సహాయం పొందవచ్చు . లేదా  మా టోల్ ఫ్రీ నంబర్‌కు#####కు  కాల్  చేయొచ్చు.
నోట్:మీ వివరాలు  రహస్యముగా ఉంచబడును .
   నాన్న  ప్రస్తుతానికి జాబు మానేసి ఆర్గనైజేషన్ బాధ్యత  తీసుకోని  తర్వాత  ఎవరికైన అప్పగించి  జాబు కి
వెళ్తానని చెప్పింది.
     విరోనిక  ఆర్గనైజేషన్‌లో కరాటే ,ధ్యానం ,యోగ ,టైలరింగ్ వర్క్స్ ,హ్యాండ్ వర్క్స్  కోసం  లేడీ ట్రైనర్స్ ని
నియమించింది. వీళ్ళంతా  కుటుంబ బాధ్యతలు  తీర్చుకొని  తమను పోషించడం ఇష్టం  లేని కొడుకుల  మీద ఆదారపడకూడదని ,స్వశక్తితో  జీవించాలని వచ్చేసిన తల్లులు . వీళ్ళు  డబ్బు కోసం కాకుండా అక్కడికి వచ్చే అమ్మాయిల జీవితాల్ని మనస్పూర్తిగా ,అంకిత బావంతో తీర్చిదిద్దడానికి శ్రమిస్తున్నారు .
              ఆరోజు  శుక్రవారం  రాత్రి 9 అయ్యింది  విరోనిక ఇంటికి వెళ్ళడానికి బయల్దేరింది . ఇంతలో పసిపాప  ఏడ్చినా శబ్దం వినిపించింది చుట్టూ  తిరిగి  చూస్తే ఎవరులేరు  అటుపక్కనే ఒక పసి పాప తనకి అర్దమైంది  ఎవరో చేసిన పాపానికి  ప్రతిఫలంగా  పుట్టిన ఈ పాపను వదిలించుకోవడానికి  ఇక్కడ వదిలి వెళ్లిందని  కానీ తనను ఎ మృగం  ఇంతవరకు తీసుకొచ్చాడో అని అనుకుంది.విరోనిక చాల సంతోషించింది అ పాపా చాల ముద్దుగా వుంది తన చిన్ని చిన్ని కళ్ళు ,ముక్కు,పెదాలు  చాల చాల నచ్చేశాయి .  పెద్దలు అంటారు కా చిన్న పిల్లలు దేవుడితో సమానం అని !విరోనిక అ పాపని దేవుడిచ్చిన వరంగా బావించింది . ఆ  పాపని తనతో పాటు  ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించి  పాలు తాపి పడుకోపెట్టింది . విరోనిక తన ప్రక్కనే కూర్చొని  ల్యాబ్ టాప్ ఓపెన్ చేసింది .
         వీడియో కాల్  వస్తే ఓపెన్ చేసింది అందులో ఒక అమ్మాయి  వెక్కి వెక్కి ఏడుస్తూ ,తనకు బ్రతకాలని లేదు ,ఆత్మహత్య చేసుకోవాలన్ కున్నానని  చెప్పింది  వెంటనే విరోనిక కూల్ కూల్ అని ని ప్రాబ్లం ఏంటి చెప్పు ఫ్రెండ్ అంది.న పేరు కావ్య  నాది  కూడా ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయి కథ వాడు నే పెళ్లి చేసుకోమంటే ఎ ప్రేమ,దోమ,నా  లైఫ్ లోనే లేవు ఒక ఆమ్మాయిని  చూసామ ,నచ్చిందా ,వాడుకున్నామ,వదిలేసామ  అంతే డియర్ అన్నాడు. నా  ఫై ఎన్నో ఆశలు పెట్టుకున్నా  మా అమ్మ నాన్నలకి  ఎ విషయం ఎలా చెప్పగలను ?అందుకే చనిపోవాలనుకున్న అని అంది. అప్పుడు విరోనిక  ఈ మాత్రానికి చనిపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్  నువ్వు నిచ్చింతగా వుండు అని అంది.
          తెల్లారి కావ్య చిననాటి  స్నేహితిరాలిగా విరోనిక వాళ్ళ ఇంటికి వెళ్లి తన అక్క  పెళ్లి అని చెప్పి కావ్యను 3డేస్ తనతో తీసుకెళ్తానని వాళ్ళ తల్లితండ్రుల్ని బ్రతిమిలాడి ఒప్పించింది.

     ఆర్గనైజేషన్ కు వెళ్ళగానే కావ్య అక్కడున్న ప్రతి నీతివాక్యం చదివింది. అవన్నీ జీవిత విలువలకు సంబంధించి ఉండడంతో తనను చాలా ప్రభావితం చేసాయి. అందులో ఒకటి తనను చాలా ఆకర్షించింది "శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు. మనసుకు సంబంధించింది. మన మనసు పవిత్రం గా ఉంటె మనం పవిత్రంగానే ఉంటాం." మొదట కావ్యను మెడిటేషన్ టీచర్‌కు పరిచయం చేసింది. తన మనసు ప్రశాంతంగా ఉండేలా చేయమని చెప్పి కావ్యతో బయటికెల్లొస్తానని చెప్పి వెళ్ళింది.

          విరోనిక స్కూటీ దారిలో ఏదో ట్రబుల్ వచ్చి ఆగిపోయింది, దాంతో ఒక కాలనీలోనడుచుకుంటూ వెళ్తుండగా ఒకతను తన భార్యతో కలిసి ముసలావిడని మెట్లపైనుండి తోసేస్తుంటే చూసి కిందపడకుండా పట్టుకుంది. "మీకు సభ్యత తెలుసా? ఎందుకిలా తోసేస్తున్నారు?" అని అంది.
 అప్పుడు అతను " ఏవమ్మా... నీకెందుకు ఇది మా ఇంటి విషయం, ఆ ముసలిదానికి తిండి పెట్టడమే ఎక్కువ అనుకుంటే, మందులు కావాలంటుంది." అన్నాడు. అంతలో అతని కొడుకు "నానమ్మా! వెల్లొధ్ధు" అని ఆ ముసలావిడను పట్టుకున్నాడు. వెంటనే తన కొడుకును లాగి "అది రోగిష్టిది ముట్టుకోకు అన్నాడు."

విరోనిక "నీకేమైనా మానవత్వం ఉందా? తను నిన్ను నవ మాసాలు మోసి కంది అప్పుడు ఆమె కూడా నిన్నిలాగే వద్దు అనుకుంటే తనకు ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు." అంది
అతని భార్య " నీతులు బాగానే వల్లిస్తున్నావు. మోసే వాడికి తెలుస్తుంది భారం, చూసేవాడికి కాదు. నీకంత జాలిగా ఉంటె నువ్వే తీస్కెల్లు." అంది.
విరోనిక "అది నువ్వు చెప్పే అవసరంలేదు. నాకు తెలుసు అంటూ, గుర్తుపెట్టుకో నీకూ ఒక కొడుకున్నాడు. రేపటినాడు నీకూ ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు, అప్పుడర్థమౌతుంది నువ్వెంత పెద్ద తప్పు చేసావో" అని చెప్పి అక్కడి నుండి ఆ ముసలావిడను ఆర్గనైజేషన్‌కు తీసుకొచ్చింది.  "అమ్మా...! ఇప్పటినుండి ఇదే మన ఇల్లు బావుందా" అని అడిగింది.
ముసలావిడ " నీకెన్ధుకమ్మా శ్రమ నేనెలాగో బ్రతికేస్తాలే" అంది
 "ఇందులో శ్రమేంలేదు. ఈ ఇంటికి ఒక అమ్మ కావాలి, అది నువ్వే కావాలి. నీకంతగా ఊరికే ఉండటం ఇష్టంలేకపోతే చిన్న చిన్న పనులు చేయి. దాంతో నీకు కాలక్షేపంగా ఉంటుంది." అంది.
ఆవిడ సరే అంది. ఈ మాటలు విని అందరూ సంతోషించారు.
ఒకరోజు విరోనిక కాన్సెప్ట్ నచ్చి ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఫోన్ చేసి ఎప్పుడైనా ఆమె అవసరం ఉంటె ఫోన్ చేయమని డబ్బు తీసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తానని చెప్పింది.

       తెల్లారి విరోనిక కావ్యను అడిగి తనను మోసం చేసిన వాది అడ్రస్ తీసుకుంది. అతన్ని ఒకరోజంతా గమనించి, బలహీనతలను, ఎవరితో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలుసుకుంది. వాళ్ళమ్మ అంటే భయమని కూడా తెలుసుకుంది.
కావ్యతో విరోనిక ఇప్పుడెలా ఉంది అని అడిగింది. ఫైన్ అంది. అయినా తన మనసులో ఏదో మూల తను చేసింది తప్పు అనే భావన ఉందని గమనించి సైకాలజిస్ట్ జాహ్నవికి  కాల్ చేయాలనుకుంది. ఇంతలో విరోనికకు ఫోన్ కాల్ వచ్చింది.
  "హలో! నా పేరు నిత్య. నేనొక వ్యభిచారిణిని అంది. కానీ నాకిలా బ్రతకడం ఇష్టంలేదు, నాలాంటివాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మమ్మల్ని చిన్నప్పుడే డబ్బులకోసం వీళ్ళకు అమ్మేసారు, మాతో ఈ పని  బలవంతంగా చేయిస్తున్నారు మమ్మల్ని కాపాడండి" అని ఏడుస్తోంది
విరోనిక "అలాగే నిత్య... మీ అడ్రస్ చెప్పండి, నేను మిమ్మల్ని ఈరోజే విడిపిస్తాను, డోంట్ వర్రీ!" అని అడ్రెస్స్ తీసుకుని ఫోన్ పెట్టేసింది. వెంటనే వాల్ల నాన్న ఫ్రెండ్ DGP కి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. DGP తో పాటు వెళ్లి నిత్యను, తనతో ఉన్నవాళ్ళను విడిపించి ఆ ముఠా వాళ్ళను అరెస్ట్ చేయించింది  నిత్య వాళ్ళను తనతోపాటు ఆర్గనైజేషన్ కు తీస్కొచ్చింది. దాదాపు 30మంది అందరూ 16 నుండి 30 యేళ్ళలోపు వాళ్ళే! అందులో ఎవరి చదువుకు తగ్గట్టు వాళ్ళకు ఉద్యోగం ఇప్పించాలనుకుంది. అందరిని ఫ్రెషప్ అయ్యి రమ్మంది. అందరు సంతోషంగా థాంక్స్ చెప్పి వెళ్లారు. కావ్య, విరోనిక పాపతో ఆడుకుంటున్నారు.  పాపకు లక్కీ అని పేరు పెట్టారు. చాలావరకు కావ్య తన గతాన్ని మరిచిపోయింది.  జాహ్నవి కి విరోనిక కాల్ చేసింది. వెంటనే ఆమె వచ్చింది.
విరోనిక కావ్యతో తను నీ భయాన్ని, తప్పు చేసాననే బాధను తుడిచేసి నీకు ధైర్యాన్ని పెంచుతుంది అని చెప్పి జాహ్నవి దగ్గరకు పంపించింది.
విరోనిక లక్కీ థో ఆడుకుంటుండగా నిత్య వాల్లు స్నానం చేసి వచ్చారు. అందర్ని కరాఠే' టీచర్ దగ్గరికి తీస్కెల్లి అందరికీ నేర్పించమని చెప్పింది. తన ఉద్దేశ్యం ఏమిటంటే ఎటువంటి పరిస్థితిలో అయినా ప్రతి అమ్మాయి తనను తను కాపాడుకోగలిగి ఉండాలని! కావ్య కౌన్సిలింగ్ అవ్వగానే జాహ్నవి వెళ్లిపోయింది. కావ్యతో ఇంకా తప్పు చేసాననే బాధ నీలో ఉందా అని అడిగింది.
కావ్య "లేధు. నా జీవితాన్ని నేను కాపాడుకోగలను అనే నమ్మకం నాకు కలిగింది" అంది.
" అసలు నువ్వే తప్పు చేయలేదు. నీ ప్రమేయం లేకుండా జరిగినది నీ తప్పు కాదు."
"అది నాకిప్పుడే అర్థమైంది" అంది కావ్య
విరోనిక "ఇప్పుడు నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? చెప్పు. నేను ఒప్పిస్తాను" అంది.ఎలా అని అడిగింది కావ్య
"అతనికి వాళ్ళ అమ్మంటే భయం. ఈ విషయం చెప్తానని బెదిరిస్తే ఎమైనా చేస్తాడు." అంది విరోనిక.
" వాడు నాకు వద్దు. వాడి దృష్టిలో ప్రేమ అంటే రెండు హృదయాల మధ్య సంబంధం కాదు. రెండు శరీరాల మధ్య సంబంధం." " ఇప్పుడు నేను చదివి మంచి జాబు చేస్తూ మా అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని ఉంది. ఆ తరువాత వాళ్ళకు నచ్చిన అబ్బాయికి నా గతం గురించి చెప్పి అతనికి అభ్యంతరం లేకపోతే పెళ్లి లేదంటే ఇలాగే ఉంటాను " అంది కావ్య.
 " ఇప్పుడు నువ్వు సంతోషం గా ఉన్నావు కధా" అంది విరోనిక
"నేను చాలా బావున్నాను. ఇక నేను రేపు వెళ్తాను. మా అమ్మానాన్న ఎదురు చూస్తూ ఉంటారు నాకోసం"
" నేనిక్కడికొచ్చాక ఈ ప్రశాంత వాతావరణం, ఇక్కడి మనుషులు, ప్రత్యేకంగా నువ్వు చాలా నచ్చాయ్ నాకు. నిన్ను చూశక నాకూ నా వంతు సహాయం చేయాలనిపిస్తుంది. నాకు  నా జీతంలో సగం ప్రతి నెలా ఆర్గనైజేషన్ కు ఇస్తాను"
విరోనిక "థాంక్యు ఫ్రెండ్ "అంది

"విరోనికా! నన్ను మర్చిపోకు. ఇప్పటి నుండి మనం మంచి ఫ్రెండ్స్. నేను రోజూ ఫోన్ చేసి నిన్ను విసిగిస్తానులే నన్ను మర్చిపోకుండా" అంది కావ్య.
ఇంతలో అమ్మ భోజనం రెడీ అని పిలిచిన్ధి. అందరు కలిసి బోంచేసారు.
తెల్లారి అందరికీ bye చెప్పి కావ్య వెళ్లిపోయింది.

ఇంతలో విరోనిక కు ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే ఐ లవ్ యు అని చెప్తున్నారు. అది తప్పించి ఎమీ మాట్లాడట్లేరు. విరోనిక ఇడియట్ అని తిట్టి కట్ చేసింది. నిత్య, తన స్నేహితురాళ్ళలో చదువుకున్న వాళ్ళకు, వాళ్ళ చదువుకు తగ్గ జాబు ఇప్పించింది. చదువుకోని వాళ్ళకు టైలరింగ్, హ్యాండ్ వర్క్స్ నేర్పించమని ట్రైనర్స్ కు చెప్పింది.

         విరోనికకు కాల్ వస్తే లిఫ్ట్ చేసింది న పేరు జానకి అండీ  నాదో విచిత్రమైన సమస్య బహుశ అది మీరు కూడా తీర్చలేరోమో?నాకు 18సం.. నాకు  తెలిసింది నాలో లోపం వుందని నే పెళ్ళికి పనికి రాననని నే  కాదని కానీ అది ఎలా జరిగిందో నాకు తెలిదు మా ఇంట్లో వాళ్ళు నను ఒక మనిషి లాగా కూడా చూడట్లే నను ఎయిడ్స్ పేషెంట్ కన్నా హీనంగా చూస్తున్నారు వాళ్ళ సూటిపోటి మాటలతో  చాల హింసిస్తున్నారు . అందుకే నే చని పొవలనుకున్తున్నా ?న సొల్యూషన్ కరెక్ట్ కదా అంది అని అంది!అపుడు విరోనిక తప్పు పెళ్ళికి పనికిరాకపోతే చనిపోవాల ?లైఫ్ లో పెళ్లి ఒక పార్ట్ మాత్రమే ఫ్రెండ్  పెళ్ళే లైఫ్ కాదు నువ్వు ఇక్కడికి రా అపుడు చని పోవాలనిపిస్తే నే అడ్డు చెప్పా అని అంది . జానకి సరే అంది . జానకి   ఆర్గనైజేషన్‌కి రాగానే విరోనిక లోపలికి  తీసుకెళ్ళి దేవుడు చేసిన తప్పుకి నువ్వు బలి కావాల్సిన అవసరం లేదు. ఇంతకి నువ్వు ఎం కావాలన్కున్నావ్ అనివిరోనిక  అంది లాయర్ కానీ నే ఇంటర్ వరకే చదివా ఆతర్వాత మా అమ్మ వాళ్ళు చదివించలే నాలో లోపం వుందని. అయితే నువ్వు బాగా చదివి ని కల నెరవేర్చుకొని ని లోపం ని లైఫ్ కి అడ్డు కాదని నిరూపించాలి అని విరోనిక అంది.ఇక్కడ ననీకు ని ఆశయానికి అడ్డు చెప్పే వాలు లేరు నువ్వు మెడిటేషన్ టీచర్ దగ్గరికి వెళ్ళు సరే అని జానకి అంది. ఇలా రోజులు గడిచాయి  ది . ఆ చదువురా ని అమ్మాయిలు కుట్టడంలో పర్ఫెక్ట్ అయ్యారు వాళ్ళ కోసం విరోనిక ఒక  స్టిచింగ్ షాప్  ఆర్గనైజేషన్ లో పెట్టింది.వాళ్ళు కొత్త రకం వర్క్స్ తో అందరిని ఆకర్షించేవారు దాంతో వాళ్ళ వ్యాపారం చాల బాగా నడిచేది.దాదాపు నెలకు 30000-40000 సంపాదించేవారు . ఆ డబ్బు అంత బీరువాలో పెట్టె వారు అది ఎవరికి అవసరం వున్నా తీసుకోవచ్చు . జానకి ఇప్పుడు చాల మారిపోయింది తన ఆత్మవిశ్వాసం పెరిగింది. తనే స్వయంగా పార్ట్ టైం జాబు చేసుకుంటూ చదువుతుంది.
                విరోనిక  జాబుకి వెళ్తుంది తన జాబు సమయం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3వరకే ఆతర్వాత
 ఆర్గనైజేషన్‌కి వచ్చి చూసుకుంటుంది అప్పటి దాక లక్కీని అమ్మకి ఇచ్చి వెళ్తుంది.ఉదయం 10 అవతుంది విరోనిక స్కూటీ ఫై ఆఫీసుకి వెళ్తుంది ఇంతలో తన స్కోత్య్కి ఒక అబ్బాయి అడ్డు వస్తే విరోనిక బ్రేక్ వేసింది నీకు బుద్ది లేదా చావడానికి నా బండే దొరికిందా అని తిడుతూనే వుంది అ అబ్బాయి నే నిన్ను ప్రేస్తున్న అని అన్నాడు ఎయ్ నీకు ఎమన్నా పిచ్చా  ఎస్ నీ పిచ్చోడిని అయ్యా అని అన్నాడు ఆహా లవ్ యట్ ఫస్ట్ సైట్ ఆ అని అంది ఎస్ కానీ ఇప్పుడు కాదు ఆరోజు ఆ ముసలావిడ విషయంలో మీ ధైర్యం,సహాయం నాకు చాల నచ్చేసి ఫిదా అయిపోయా అని అన్నాడు.విరోనిక నాకు మాత్రం నిన్ను చూస్తే అసహ్యంగా వుంది అని స్కూటీ ఫై వెళ్ళింది . ఆఫీసులో పని చేస్తూ వుండగా తనకు కావ్య కాల్ చే  ఈరోజు నా  బర్త్‌డే  అని చెప్పింది. హ్యాపీ బర్త్ డే కావ్య అని విరోనిక అంది. ఈరోజు నేను 3తర్వాతికి మీ ఆఫీసుకి వస్థా  మనమిద్దరం కలిసి  ఆర్గనైజేషన్‌కి వెళ్దాం అని కావ్య అంటే సరే అని విరోనిక అంది. విరోనిక వెంటనే అమ్మకి కాల్ చేసి గులా బ్జమూన్ చేయమంది . 3అయింది కావ్య విరోనిక ఆఫీసుకి వచ్చింది ఇద్దరు కలిసి ఫస్ట్ కాఫీ షాప్ కి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేసారు బేరర్ తీసుకొచ్చాడు కానీ విరోనిక కప్ లో ఆర్గనైజేషన్‌కి  లవ్ సింబల్ వుంది అది చూసి బేరర్ని అడిగితె తను అబ్బాయిని చూపించాడు విరోనిక ఎ మిస్టర్ ఉదయం ఏదో పాపం అని వదిలేస్తే రేచ్చిపోతున్నావ్ వాళ్ళు ఎలా వుంది అని అంది అప్పుడు వాడు మిమ్మల్ని ప్రేమించేంత ,మరిచిపోలేనంతగా  వుంది అని చెప్పాడు . నోరు ముస్కో నాకు ప్రేమ అంటే నచ్చాడు అని చెప్పి కావ్యాని తీసుకెళ్ళి బయటికి వచ్చేసింది . విరోనిక వీడు న మూడ్  మొత్తం కరం చేసాడు అంటే కావ్య పద షాప్‌కి వెళ్లి లక్కీ కి ఒక గౌన్ తీసుకేల్డం అని అంది నా  గుర్తుగా . ఇద్దరు కలిసి షాప్‌కి వెళ్లి గౌన్ తీసుకొని  ఆర్గనైజేషన్  కి వచ్చారు రాగానే అక్కడ కేకు ,గులబ్జమూన్ రెడీ గ వుంచి అందరు ఎదురు చూస్తున్నారు. కావ్య చూసి చాల సంతోషించి కేకు కట్ చేసింది విరోనికకి ఫొటోస్ అంటే ఇష్టంకా ఇలాంటి మెమొరిస్నీ జీవితాంతం బందిచేవి ఫొటోసే కదా! అవన్నీ ఫొటోస్ తీసింది లక్కీ కి  ఆ  కొత్త గౌను వేసి ఫొటోస్ తీసారు. ఇలా ఆరోజు రాత్రి చాలా ఎంజాయ్ చేసారు. విరోనిక కావ్యాని ఇంట్లో వదిలేసి స్కూటీ ఫై తిరిగి వెళ్తుండగా ఏదో ట్రబుల్ వచ్చి ఆగిపోతే నడచుకుంటూ వెళ్తుంది . విరోనికకి తనని ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించింది ఎవరో నీడ తనఫై  వాలితే తను వెనక్కి చూస్తే  వాడె ఎ నీకు ఎ పని లేదా ఎప్పుడు నా వేబడే తిరుగుతుంటావా అని అంటే అలా  ఎం కాదండీ  నే జాబు చేస్తున్నా . అదే ఇప్పుడు టైం 10అయింది అమ్మాయి ఒక్కతే వెళ్తుంది తోడుగా వస్తున్నా అని అన్నాడు ఎ అమ్మాయి రోడ్ ఫై రాత్రి  ఒక్కటే వెళ్ళకూడదా అబ్బాయి లే వెల్లాల అని అంది . అది కాదoడి  బయపద్తున్నరేమోనని నాకేం బయం నే కరాటేలో బ్లాక్ బెల్ట్ అని చెప్పింది మిరే నాకు తోడుగా రండి అని అన్నాడు. అతను మీ పేరేంటి అని అడిగితే  మీకు ఎందుకు అని విరోనిక అంది . ఊరికనే అండి అని అన్నాడు ఊరికే ఎవరికి పడితే   వాళ్ళకి చెప్పే అలవాటు లేదు. ఆటను న పేరు రాధాకృష్ణ అని అంటే అయితే నాకేంటండి అని అంది ఇంతలో వాళ్ళ  ఆర్గనైజేషన్ వచ్చింది ఆర్కే చూసి తిను ఇందులో కి ఎందుకు వెళ్తుంది అనుకున్నాడు. విరోనిక ఓపెన్ చేస్తే రాట్లే  తను అమ్మకి ఫోన్ చేస్తే తను వచ్చి తీసింది నువ్వు వెళ్ళు విరోనిక నే తలం వెస్ట అని అంది విరోనిక లోపలికి వెళ్ళింది ఆర్కే కి తను తెలుసు తనని అడిగితె మొత్తం చెప్పింది అప్పడు రాధా పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని నిచ్చయిoచుకున్నాడు. రాధా సరే అమ్మ నే వేల్లోస్త అని చెప్పాడు మంచిది బాబు అని అంది.
     విరోనిక బైక్ ఫై వెళ్తుంటే విమల బ్రదర్ అర్జున్ కనిపించదు పని చేస్తూ ఏందీ అర్జున్ చదు వుకోవట్లేదా? ని పోలీస్ కావాలన్నా యాoబిశన్ ఏమైoది?  అని అడిగితె అక్క లైఫ్ కొన్నిoటిని కాపాడుకోవాలంటే కొన్ని వదులుకోవాలి అని అన్నాడు?అం కుల్ ,ఆంటీ ఎలా వున్నారు అని అడిగితే నాన్నకి పక్షవాతం వచ్చింది దాంతో నేను సంపాదించాల్సి వస్తుంది నా  చదువు ఆగిపోయింది.విరోనిక తనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లారు . ఆంటీ ,అం కుల్ని పలకరించి నే అర్జున్‌ని చదివిస్తా  తన చదువు కర్చు నాది అని అంటే వద్దక్కా నే నే మా అమ్మ నాన్నని చూసుకోవాలి అంటే సరే తమ్ముడు జాబు చేసుకుంటూనే చదువు అంట ఇష్టం లేకపోతె నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యాక న డబ్బు ఇచ్చేడువులే నీకు అంట ఇబ్బంది గా వుంటే అని అంది సరే అని ఒప్పుకున్నారు.అక్కడి నుంచి ఆఫీసుకి వెళ్ళింది విరోనిక జీతం నెలకి 50000 అ డబ్బు ప్రతి నెల తన డాడ్ అకౌంట్ లో వేస్తుంది ఆ ఆర్గనైజేషన్ అయిన అప్పు తీర్చాలి కదా అందుకని. నెల వరకల్ల అ బీర్వాలో50000 ఉంటాయి . విరోనిక నెలకు కావాల్సిన సామాన్  తేగా  మిగిలిన డబ్బుని  బీర్వాలో పెడుతుంది . తన జీతంలో అర్జున్ చదువుకోసం 10000 అర్జున్ అకౌంట్  లో వేయగా 40000 తన డాడ్ అకౌంట్ లో వేస్తుంది .ఒక వేల  ఆర్గనైజేషన్ లో ఎం పని లేకపోతె ఆఫీసులో అదనపు పని చేస్తుంది డబ్బు కోసం .
         ఇలా కొన్ని నెలలు గడిచాయి విరోనిక ఇంటికి వెళ్ళ డమే మానేసింది దాంతో వాళ్ళ నాన్న తనని చాల మిస్ అవుతున్నాడు. నన్ను  ఆకరికి నా బర్త్‌డేని  ని కూడా ప్రతి ఇయర్ తనే నాకు మొదటి విషెస్ చెప్పేది . విరోనికకి తన తల్లి చిన్నపుడే చనిపొఇన్ది అప్పటి నుండి తన నాన్నే తనకి ఫ్రెండ్,సహచరుడు ,అమ్మ  అన్ని తనే అందుకే విరోనికకి తన డాడ్ అంటే చాల ఇష్టం . అప్పుడు టైం రాత్రి 11:50 అవ్తుంది తెల్లారితే తన బర్త్ డే మొదటి విషెస్ తన కూతురితో చెప్పించు కోవాలని ఆర్గనైజేషన్ కి వెళ్ళాడు . గేటు కి లాక్ వుంది వెంటనే  ఫోన్ చేస్తే తను వచ్చి లాక్ తీసింది. వెంటనే విరోనిక రూమ్‌కి వెళ్ళాడు చుట్టూ చూస్తే  అన్నివాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ ప్రతి ఫోటో ఫై ఐ మిస్ యు నాన్న అని రాసి వుంది. అది చూశి విరోనిక వాళ్ళ నాన్న చాల సంతోషించాడు. విరోనికను లేపాడు చూసి షాక్ అయ్యి నాన్న మీరు ఇక్కడ ఎప్పుడు ఎల్లా వచ్చారు అని అంది అప్పుడు వాళ్ళ నాన్న నువ్వు నన్ను ,న బర్త్ డే ని మరిచిపోయావ్   నే అలిగా ని మిద అని అంటే సారీ నాన్న & పుట్టిన రోజు శుభాకాంక్షలు  అలగకు కావాలంటే శిక్షించు అని అంది అప్పుడు వాళ్ళ నాన్న ఒకే ఈరోజు మొత్తం నువ్వు నాతోనే వుండాలి అంటే సరే అని విరోనిక అంది. ఇద్దరు కలిసి చాల ప్రదేశాలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసారు.  విరు నాన్న ప్రకాష్ సంతోషంగా ఫీల్ అయ్యాడు.
         విరోనిక ఆఫీసుకి స్కూటీ జానకి తీసుకెళ్లడం తో ఆటో కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలో రక్ తన బైక్ ఫై వస్తు తనని చూసి బైక్ ఆపి డ్రాప్ చేస్తా అన్నాడు.ఎమ్ అవసరం లేదు మీరు వెళ్ళండి అని అంది అప్పుడు అతను "మీరు  సహాయం చేస్తే చాలదు అప్పడప్పుడు అవతలి వాళ్ళు సహాయం చేస్తానంటే వద్దు అనడం  పద్ధతి కాదు" అని అంటే విరోనిక వీడు నన్ను చాల విసిగిస్తున్నాడు వీడు చనిపోతే నరకానికి వెళ్ళేటట్లు చేయి స్వామి అని మనసులో అనుకుంటూ బైక్ ఎక్కిoది. ఇద్దరు బైక్ ఫై వెళ్తుండగా ఆర్కే విరోనికకి ఐ లవ్ యు అని చెప్పాడు అప్పుడు విరోనిక  అయితే ఏంటి ?అయిన నాకీ ప్రేమ,గీమల ఫై నమ్మకం లేదు . కనుక నువ్వు వేరే అమ్మిని వెతుక్కో అని అంటే ఆర్కే సమస్యే లేదు నువ్వు నన్ను ప్రేమించాక పొయిన ,పెళ్లి చేసుకోక పో యిన పారలేదు నిన్ను ఇలాగె చూసుకుంటూ బతికేస్తా  ఆహా నీ ఇ  బారి డైలాగ్ సూపర్ మూవీస్ లో అయితే హిట్ అయ్యేదేమో ఇక అపు నా  ఆఫీసు వచ్చింది అని  అంటే ఆర్కే ఆపాడు థాంక్స్ న బైక్ ఎక్కినందుకు అన్థొధమ్మా అని ఆఫీసు లోపలి వెళ్ళింది . బోజన వేళలో విరోనిక కు కావ్య కాల చేసి నా పెళ్లి సెటిల్ అయ్యింది అతనికి న గతం గురించి ,నే డొనేట్ చేసే మనీ గురించి చెప్తే ఒప్పుకున్నాడు ,మ్యారేజ్ వచ్చే సండే నువ్వు తప్పక రా వాళి అని అంది  విరోనిక సరే  వస్తాను అoది.
                    విరోనిక ఎక్కడ వుంటే అక్కడికి వచ్చి ఐ లవ్ యు చెప్తుండే  వాడు  చాల ఇరిటేట్ చేసేవాడు తన ఇష్టమైన హీరో మహేష్ మూవీ కేల్తే అక్కడ మూవీ మద్యలో ఆపించి విరోనిక గారు ఐ లవ్ యు అని స్క్రీన్  వచ్చి చెప్పాడు అప్పుడు విరోనిక సచ్చినోడ నన్ను ఎందుకు ఇలా వేదిస్తున్నావ్ అని అంటే ఆర్కే ఒకే చెప్తే అయిపోతది కా అన్నాడు. విరోనిక అని వేల్లిపాయింది .
           ఈరోజు సండే కావ్య మ్యారేజ్ విరోనిక తనకి ఇష్టమైన స్కై బ్లూ  మరియు లైట్ పింక్ కలర్ సారీలో పెళ్లి  మండపం లోకి అడుగు పెడ్తుంటే పైనుంచి చూసిన ఆర్కే ఫిదా అయ్యి దేవుడా ఇంత అందమా ఐఆమ్ లక్కీ అని    అనుకుంటూ కింద పడిపోయాడు. పెళ్ళికొడుకు ప్రనీత్ వచ్చి ఎం అయిందిరా అల పడిపోయావ్ అని అంటే ఇప్పుడే న అతిలోక సుందరిని చూశా అని అన్నాడు. సరే పద నాకోసం కింద అందరు వెయిట్ చేస్తున్నారు అని చెప్తె ఇద్దరు కలిసి కిందకు వచ్చారు.విరోనిక అటు చూడగానే ఆర్కే పేస్ కనిపించింది వెంటనే దొంగ రాస్కెల్ ఇక్కడికి దాపరించావా  నన్ను వదలవ అని తిడుతుంటే ఇంతలో ప్రనీత్  వచ్చి మేడం తను నా  బెస్ట్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ పెళ్ళికి తను రావొద్దు అనటానికి మీరెవరు అని అన్నాడు స్వారీ మీరేనా పెళ్ళికొడుకు స్వారీ అని కావ్య దగ్గరికి వెళ్ళింది. ఆర్కే ప్రనీత్కి తనేరా  నా హీరొయిన్ అని అంటే విరోనిక కోపంగా తిరిగి చూసింది.వాడు బ్లూ జీన్స్ , పింక్ షర్ట్  వేసుకున్నాడు విరోనిక అప్పుడే వీడికి న ఇష్టమైన కలర్స్ కూడా తెలిసాయ అనుకుoది . కావ్య ప్రనీట్ల పెళ్లి జరిగిపోయింది అందరు  భోజనం చేస్తున్నారు విరోనికకు వాడి ముకం చూసి తినబుద్దికాక సగంలోనే వదిలేసింది . అ భోజనం ఆర్కే తిన్నాడు అది చుసిన కావ్య చాలా సంతోషించింది.విరోనిక పడుకుంది అక్కడనే కావ్య ఉండమంది అప్పుడు టైం రాత్రి11 అవుతుంది తెల్లారితే తన బర్త్‌డే ఎప్పటి లాగే తన నాన్న ఫస్ట్ విశెస్ చెప్పాలని  ఆర్గనైజేషన్ కి వెళ్తే తను పెళ్ళికి వెళ్లిందని తెలిసి అక్కడికి వెళ్ళాడు తొందరగా టైం అయిపోతుందని  మెట్లు ఎక్కి విరోనిక రూం దగ్గరికి వెళ్ళాడు  డోర్ ఓపెన్ చేయగానే రాధా వీరుని లేపాడు విరు చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని తిడ్తూనే వుంది అప్పుడు రాధా హ్యాపీ బర్త్ డే హీరొయిన్ అని అన్నాడు విరోనిక థాంక్స్ అని చెప్పింది  రాధా తన కళ్ళు మూసుకోమని చెప్పి తనని మెడ ఫై కి తీసుకెళ్ళాడు. అక్క కేక్ విత్ ఫుల్ మూన్ లైట్ లో కేకు కట్ చేసింది విరు రాధా కి కేకు  ఇయ్యబోతుంటే ఫస్ట్ మీ అమ్మకి అని అన్నాడు విరుకి అర్ధం కాలే ఏంటి అలా  చూస్తున్నావ్ మీ అమ్మ గారు ఫై నుంచి నిన్ను చూస్తూనే వుంటారు అని అంటే విరు ఆకాశంలో వున్నా తన అమ్మకి చ్పించింది అ పీస్ ను రాధా తనకి తినిపించాడు అ తర్వాత విరు రాధా కి తిన్పించింది. రాధా విరుతో నే నీ ముకంలో సంతోషం చూడాలని నీకు  తెచ్చాఎందుకంటే నువ్వు ఎప్పుడు నన్ను తిడుతూనే వుంటావ్ కా అందుకొని   కనీసం ఎ గిఫ్ట్ చూసైనా నువ్వు సంతోశిస్తావని నా ఆశ  అని అన్నాడు . విరోనిక గిఫ్ట్ ఓపెన్ చేసింది అందులో తన ప్రతి బర్త్‌డే ఫోటోలో  విరు అమ్మ తన పక్కనే వున్నట్లు వుంది అది చూసి  విరు ముకం సంతోషంతో వెలిగిపాయింది అప్పుడు రాధా నా ఈ ప్రయత్నం ఫలించింది కానీ అందులో లాస్ట్ ఫోటో చూసి నన్ను తిట్టకు అని అన్నాడు విరోనిక సరేలే ఇక నువ్వు వెళ్ళుకాల్ చేయాలి  మా నాన్నకి  అని అంది రాధా వెళ్ళాడు.విరోనిక  రూమ్ కి వెళ్ళే  సరికి ఆతను లోపలే  వున్నాడు. మై క్యూట్ డాటర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పాడు . థాంక్యు డాడ్ అని అంది.ని పుట్టిన రోజు నాకు ని నుంచి ఒక కానుక కావాలి దానికి నువ్వు ఎస్ అనాలి నో అని అంటే నే ఎప్పుడు నీతో మాట్లాడ? అని అన్నాడు.విరొనిక అలా  అనకు నాన్న నీసంతోషం  కంటే నాకు ఇంకేం ఎక్కువ కాదు సరేనా అని అంది. ఏంటో చెప్పండి డాడ్ అని అంది రేపు గుడికి రా అక్కడ దేవుని సాక్షిగా అడుగుతా నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఒకే డాడ్ నే వస్తా?
                 తెల్లారింది !విరోనిక రెడీ అయ్యి గుడికి వెళ్ళింది అక్కడ తన డాడ్ వెయిట్ చేస్తున్నాడు ఇద్దరు దర్శనం చేసుకున్నారు అయ్యాక విరోనికకు ఓక అబ్బాయిని   చూపించి పెళ్లి చేసుకో మన్నాడు ! షాక్ అయ్యింది అతను రాధా నాన్న ....... అవునమ్మా తనే నిని రాత్రి మీ ఇద్దరి మద్య జరిగిందంతా  చూసా  తన ప్రేమలో నాకు మీ అమ్మ బ్రతికి వుంటే ఎంత ప్రేమగా  చూసుకునేదో  అంత ప్రేమ నాకు కనిపించింది అని చెప్పి నా ఈ కోరిక తీరుస్తావా అని అడిగితె సరే నాన్న అని విరోనిక అంది రాధా చాలా  సంతోషించాడు. వెంటనే విరోనిక కోరిక ప్రకారం రిజిస్టర్  ఆఫీసులో పెళ్లి చేసాడు.
                   వాళ్ళిద్దరి మొదటి రాత్రి రాధా విరోనికను ముట్టుకొబోయాడు  విరోనిక అగు నే నిన్ను ప్రేమించలే మా డాడ్ కోరిక  తీర్చడం కోసం చేసుకున్న నిన్నే ఎందుకంటే నువ్వే అన్నావ్ కా నా సంతోషమే ముక్యం అని రేపటి నాడు నే విడాకులు అడిగిన న సంతోషం కోసం ఇస్తావని. అప్పుడు రాధా నా ఫై నమ్మకం కలగాలంటే ఎం చేయాలి ?అని అడిగితే విరోనిక నువ్వు నన్ను కొన్ని నెలలు లేక  ఇయర్ కి  నీ ప్రేమ తగ్గొచ్చు ,మరిచిపోవచ్చు  దాని అర్ధం ఏమిటంటే నువ్వు నిరుపిo చాల్సినధల్ల   నువ్వు నన్ను నా శరీరం చూసి  కాకుండా నా మనసు చూసి ప్రేమించావని నాకు నమ్మకం కలిగించాలి ఇంకా వివరంగా అంటే నాకు 20ఇయర్స్ వున్నపుడు ని ప్రేమ ఎలా వుందో అలాగే నాకు 60వచ్చిన అలాగే వుండాలి అంతే . సరే నే నిరూపిస్తా  అని అన్నాడు  నువ్వు నన్ను నీ ఫ్రెండ్ గ ఒప్పుకోవాలి  ని సంతోషాలు ,బాధలు అన్ని నాతో షేర్ చేసుకోవాలి అని అన్నాడు సరే అని విరోనిక అంది. కానీ నేను మాత్రం ప్రతిరోజూ  ఆర్గనైజేషన్ కు, ఆఫీసు కు వెళ్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు ఈ ఇంటికి వస్తాను. ఇదంతా మా నాన్న కు తెలియకూడదు అంది. ఆర్ కే సరే అని చెప్పి ఇద్దరూ వేరు వేరు గదుల్లో పడుకున్నారు. తెల్లారి ఆర్గనైజేషన్‌కు వెళ్ళింది. ఆర్ కే కాల్ చేసి మధ్యాహ్నం భోజనం తీసుకురావా లా? అని అడిగితే వద్దు, కాంటిన్ లో తినేస్తాను అంది. రాత్రి వచ్చేట్లయితే నాకు కాల్ చేయి, నేను వచ్చి తీసుకేల్తాను అన్నాడు.
ఇంతలో విరోనిక వాల్ల నాన్న ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాను నీ చేతి వంట తినాలని ఉంది అన్నాడు. వెంటనే విరోనిక ఆర్ కె కు కాల్ చేసింది. ఆర్ కె వచ్చి విరోనిక ను ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడే విరోనిక నాన్న కూడా వచ్చేసారు.
" అమ్మా! విరూ... వంటేమ్ చేసావ్?"
విరోనిక కు ఎం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు ఆర్ కె " విరు ఈరోజు సాంబార్ చేసింది. మీరు ముందే చెప్తే చాలా రకాల వంటలు చేసేది. సారీ మామయ్యా!" అన్నాడు.
విరోనిక ఆర్ కె వైపు ఆశ్చర్యం గా చూస్తూ నేనేం చేయకపోయినా చేసానని  చెప్తున్నాడు అనుకుంది.
ఆర్ కె " వెళ్ళు డార్లింగ్. వడ్డించు. తిందాం అన్నాడు. విరోనిక ఎలా తీసుకురావాల అని ఆలోచిస్తూ లోపలికెళ్ళి చూసేసరికి అన్నీ రెడీ గా ఉన్నాయి. తీసుకుని వచ్చి వడ్డించింది.
విరోనిక వాళ్ళ నాన్న ఈరోజు నేనిక్కడే ఉంటాను అన్నాడు. సరే అని వాల్ల నాన్న కోసం విరోనిక, ఆర్ కె ఒకే గదిలో పడుకోవడానికి వెళ్తున్నారు. విరోనిక డోర్ ఓపెన్ చేయగానే ఆ గదిలో అన్నీ తన చిన్ననాటి నుండి పెళ్లి వరకూ తీసుకున్న ఫొటోస్ అన్నీ ఉన్నాయ్. విరోనిక ఆర్ కెతో "గుడ్ గుడ్ బానే కలెక్ట్ చేసావ్" అంది. ఆర్ కె నువ్వెలాగూ నా పక్కన ఉండవు కధా అందుకే ఇవి నా బెడ్ రూమ్ లో దాచుకున్నాను. నేను లేవగానే మొదట చూసేది, పడుకోబోయే ముందు చివరగా చూసేది నీ ఫోటో అయ్యి ఉండాలి. ఇవన్నీ నీ, నా స్వీట్ మెమొరీస్ అన్నాడు. విరోనిక " అది సరే కాని నేను వస్తానని చెప్పలేదు. నాన్న వస్తున్నారని హటాత్తుగా చెప్పాను, ఇవన్నీ ఎలా రెడీ చేసావ్" అని అడిగింది. ఆర్ కె నువ్వొకవేళ వస్తే పస్తు ఉంచలేను. అందుకే మనిద్దరి కోసం చేసాను. మామయ్య వస్తున్నారని కొంచం ముందు తెలిస్తే నాకు తెలిసిన వెరైటీస్ చేసేవాడిని."

విరోనిక " ఒహ్హ్  ఓకే! నిజం చెప్పాలంటే ప్రేమంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ కాలమ్ ప్రేమ వేర, ఒకప్పుడు ప్రేమ అంటే నమ్మకం, పవిత్రత, పెళ్ళినాటి ప్రమాణాలను చనిపోయే వరకూ పాటించేవారు. నాకు అటువంటి బంధం అంటే ఇష్టం. తనువు, మనసు ఒకరికి అర్పించుకునేదే ప్రేమ, అదే పెళ్లి పరమార్థం! మా నాన్న ఉదాహరణ ఆ విషయంలో...
ఇప్పుడు ఇంట్లో బార్య ఉండి కూడా చాలా మంది తప్పులు చేస్తున్నారు. నాకు తెలిసి రోజు కు పదైనా అమ్మాయిలపై ఆసిడ్ దాడులు, అత్యాచారాలు చూస్తున్నాం. ఎందుకో అమ్మాయిలకే ఇలాంటి శిక్షలు? అసలు నాకు తెలియక అడుగుతా... ఆడదానికే శీలం విలువ ఉంటుందా? మగాడికి లేదా? ఎక్కడైనా అమ్మాయి చెడిపోయింది అని విన్నాం కానీ అబ్బాయి చెడిపోయాడని విన్నామా?ఏం... ఆడదాన్ని చెరిపిన ఆ మగాడు చెడిపోయినట్టు కాదా? ఎందుకీ భేదం? ఆర్ కె నాకు చెప్పు" అంది
" అందరు మగాళ్ళు ఇలా చేయరు కధా! ఇలానే  ఉంటె లోకంలో బార్యా బర్తల సంబంధానికి విలువ ఉండేది కాదు. "
విరోనిక అవునంది.
" ఎవరైతే తన బార్య ను నిజంగా ప్రేమిస్తారో  వాళ్ళు తన బార్య ఎంత పవితరంగా ఉండాలనుకుంటున్నారో తానూ అంతే పవిత్రంగా ఉన్దాలనుకుంటాడు." అన్నాడు ఆర్ కె.
" సరే ఓకే కూల్! ఈ విషయం వదిలేధ్ధామ్"
ఇద్దరూ నిద్రపోయారు.
తెల్లారి ఇద్దరు ఆఫీసు కు రెడీ అవుతుండగా వీడియొ కాల్ వచ్చింది.
అందులో జయ్ అనే అబ్బాయి " నేను లవ్ ఫెయిల్యూర్! నేను ఒకమ్మాయి 3 సంవత్సరాలు ప్రేమించుకున్నాం! మది మధ్యతరగతి కుటుంబం. మా అమ్మానాన్న చదువుకోసం పంపిన డబ్బుతో తనకు ఎన్నో గిఫ్ట్‌లు కొనిచ్చాను, బాగా పార్కులకు, సినిమాలకు తిరిగామ్. తీరా ఇప్పుడు తనకు డబ్బున్న సంబంధం రాగానే నన్ను వద్దంటుంది. మరి మన ప్రేమ? అంటే లైట్ తీస్కో అంది. నేను తనను సిన్సియర్ గా ప్రేమించా తను లేకుండా బ్రథకలేను. అందుకే చనిపోదామనుకున్నా! మీకెందుకు కాల్ చేసానంటే ప్రేమ పేరు థో అమ్మాయిలు మాత్రమేకాదు అబ్బాయిలు కూడా బలవుతున్నారు అని చెప్పడానికి.
విరోనిక గారూ... అసలు ఇలాంటి  మాలాంటి వాళ్ళు బహుమతులివ్వడానికి, తిరగడానికి కావాలి. పెళ్ళికి మాత్రమ్ పనికిరామా?" అన్నాడు
ఆర్ కె "కూల్ బ్రదర్! మనిద్దరం ఓసారి కలుధ్ధామా?" అన్నాడు
జయ్" మీరెవరు?"
" నేను విరోనిక భర్తను"
" ఓకే సర్ కలుధ్ధామ్. నా ఫోన్ నంబర్ తీసుకోండి" అని ఇచ్చాడు.
విరోనిక " అబ్బాయిల్లో కూదా అమ్మాయిల్ని ఇంతగా ప్రేమిచేవాల్లు ఉంటారా" అంది
ఆర్ కె " చూసావా? మగాళ్ళ వల్లే కాధు. ఆడవాళ్ళ వాళ్ళ కూడా చాలా మంది బలయిపోతున్నారు"
విరోనిక "నాకిప్పుడు ఒకటి అర్థమైంది. అబ్బాయి నిజంగా ప్రేమిస్తే అమ్మాయి టైంపాస్. అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అబ్బాయి టైంపాస్. ఒక 10% మంది ప్రేమ ను పెళ్లి వరకూ తీసుకొస్తారు. మిగిలిన 90% మంది ఇలా బలైపోతున్నవాల్లే."

ఆర్ కె" అవును. ఆ 10% లో నువ్వు నేను కూదా ఉన్నాం. " అన్నాడు.
విరోనిక నే ఆఫీసుకి వెళ్తున్నా అంటే ముందు టిఫిన్ చేసి వెళ్ళు నీ కోసం నీకు ఇష్టమైన ఇడ్లీ చేశా అంటే విరోనిక నాకు టైం లేదు అంది
ఆర్ కె ప్లేట్ లో తీసుకొచ్చి విరోనిక కు  తినిపించాడు. విరోనిక ఆఫీసు కు వెళ్ళింది.
ఆర్ కె ఫ్రెండ్స్ ఇంటికొచ్చి తన మ్యారేజ్ పార్టి అడిగితే ఆఫీసు అయ్యాక ఇస్తానని చెప్పి ఆఫీసు కు వెళ్లారు.

విరోనిక కు  చేసి ఎలా చూసుకున్తున్నావు ఆర్ కె ను అని అడిగింది.
విరోనిక ఏంటి నన్ను ఎలా చూసుకుంటున్నాడు అని అడుగుతావనుకుంటే నువ్వేమో ఆర్ కె గురించి అడుగుతున్నావ్ అంది.
కావ్య "నాకు తెలుసు. ఆర్ కె నిన్ను  చూసుకుంటాడు. అందుకే ఆర్ కె గురించి అడుగుతున్నాను" అంది
విరోనిక " నిజమే! నేనింతవరకూ ప్రేమగా కూడా మాట్లాడలేదు. ఇకనైనా మాట్లాడాలి అంది.
త్వరగా ఇంటికెళ్ళిపోదామని మద్యాహ్నం 3 అయ్యేసరికి విరోనిక ఆర్గనైజేషన్ కు వెళ్ళింది.
ఆర్ కె ఫ్రెండ్స్ పార్టి లో తనను తాగమని బలవంతం చేస్తే తాగాల్సివచ్చింది.
రాత్రి 9 కి విరోనిక ఇంటికి వచ్చి ఆర్ కె కోసం భోజనం  తయారు చేసింది.
10 అయ్యాక ఆర్ కె వచ్చాడు. తన వాలకం చూసి విరోనిక తాగొచ్చావా అంది. ఆర్ కె అవును, తాగాను, అన్నాడు
విరోనిక సిగ్గు లేదా ఆ మాట అనడానికి అంది.
ఆర్ కె " సిగ్గెందుకు? నోరుంటే చాలు తాగడానికి! అయినా నువ్వెవరు? నీకేం అధికారం ఉందని అడుగుతున్నావ్ ?"
విరోనిక " నేను నీ బార్యను రా"
ఆర్ కె " ఒహ్హ్ నే మర్చిపోయా! అసలు నీ ప్రాబ్లం ఏంటే? నీ మీద నాకు ప్రేమ లేదా? ఎలా తెలుసు నీకు? ఎలా నిరూపించుకోవాలి? చూడు నా కళ్ళల్లోకి. ప్రేమ కనిపించటం లేదా? ఈ కళ్ళు ని మనసు ను చూస్తున్నాయి. నువ్వు నాతో ప్రేమగా ఉంటె చాలు. ఇంకేం వద్దు. అయినా ఏం చూసుకుని  పొగరు కలర్ ఆ? హైటా?"
విరోనిక సచ్చినోడా! ఇంత కోపం  పెట్టుకున్నావా నీ మనసులో అని బయటకు గెంటేసి తలుపులేసింది.
తెల్లారి 8 గంటలైన ఆర్ కె లేవలేదు. ఫోన్ రింగవుతుంటే లేచి  లిఫ్ట్ చేసి మాట్లాడాడు. అప్పటికే 12 మిస్ కాల్స్ ఉన్నాయి.
తనకు రాత్రి జరిగిందంత గుర్తొచ్చింది. సారీ విరోనికా... నేను కావాలని తాగలేదు వాల్లే బలవంతం చేసారు. తలుపు తెరువు దయచేసి అన్నాడు.
విరోనిక తలుపు తిసి విసురుగా లోపలికి వెళ్ళింది. ఆర్ కె తనతో థిసుకెల్లాదానికి ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ విరూ నువ్వు నాకో సహాయం చేయాలి. నువ్వు నాతో ఓ చోటికి రావాలి లేకపోతే నా పరువు పోతుంది అన్నాడు.
విరోనిక " నాకు ఇష్టం ఉండదని తెలిసి కూదా రాత్రి తాగొచ్చావ్ పైగా నా మీద ఎంత ప్రేమ ఉందో చూపించావ్. నేను చచ్చినా రాను " అన్ధి.
ఆర్ కె కు ఎం చేయాలో తోచక కళ్ళు పట్టేసుకున్నాడు.
విరోనిక " వదులురా వదులు" అంది
" నువ్వొస్థానన్తేనే వదులుతాను"
" నీకు సిగ్గు లేదురా"
"నీ దగ్గర నాకు సిగ్గేంటి విరూ...!"
"వస్తాలే! వదులు "
 విరోనిక ను రెడీ అవ్వమని చెప్పి తను రెడీ అయ్యి ఎదురు చూస్తున్నాడు. విరోనిక పింక్ సారీ లో వచ్చింది. ఆర్ కె చూసి విరు ఐ లవ్ యూ అన్నాడు. విరోనిక ఇలా ఎన్ని సార్లు చెప్థావన్తే నేను చనిపోయే వరకూ చెప్తాను అన్నాడు.
ఇద్దరూ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ ఆర్ కె విరోనిక ను కొంతమంది కి పరిచయం చేసారు. విరోనిక వాళ్ళతో మాట్లాడుతుండగా కొందరు ఆర్ కె ను లాక్కెళ్ళి మందు ఇచ్చి తాగమన్నారు. ఆర్ కె తాగనన్నాడు. అప్పుడు వాళ్ళు "నీ బార్య కు ఇప్పటి నుండే బయపడుతున్నావా? నిన్ను అంత కంట్రోల్ లో ఉంచిందా? " అన్నారు,
ఆర్ కె " నా బార్య అంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ. ప్రాణం ఉంటేనే కధా తాగగలుగుతామ్. నా ప్రాణమే తన దగ్గరుంది. అందుకు నేను తాగలేను. నా బార్యకు ఏదిశ్తమో నాకదే ఇష్టం
తనకు ఇష్టం లేనిదీ నాకూ ఇష్టముండదు. చివరికి నేనైనా తనకు ఇష్టం లేకపోతే నాకు నేనే ఇష్టం ఉండను. చనిపోతాను. బార్యన్తే భర్తను భరించేలా ఉండకుడదు, ప్రేమించేలా ఉండాలి. అలా ఉండాలంటే మొదట  మనం వాళ్ళను ప్రేమించాలి. పెద్దలు అంటారు కదా "give respect and take respect" అని అలాగే "Give Love and Take mora love" ఇదంతా మీ దృష్టిలో బార్య కు బయపడటం అనుకుంటే అది మీ మూర్ఖత్వం. కానీ నా దృష్టిలో ఇది నా బార్యపై నాకున్న ప్రేమ, గౌరవం." అని చెప్పి తన నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా విరోనిక వింది. నిజానికి తనకు ఉదయం కాల్ చేసింది ఆర్ కె నాన్న గారు. విరోనిక చూసేసరికి ఆర్ కె అక్కడ లేడు. విరోనిక తనను వెతుక్కుంటూ వస్తుంటే ఒక గదిలో ఆర్ కె ఎవరితోనో మాట్లాడుతున్నాడు. విరోనిక చూసిఒ వెళ్లిపోతుంటే విరు అనే పిలుపు వినపడి ఆగింది.
ఆర్ కె వాల్ల నాన్నతో  "నేను మీకు చెప్పినట్టుగా  నా డబ్బు ను చూసి కాకుండా నన్ను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఆర్ కె నాన్న సరే మన ఇంటికి  వెళ్దామ్  అన్నాడు.
ఆర్ కె సారీ నాన్న. నిజానికి విరు కు నా గురించి ఏమీ తెలియదు. తన ఆశయం గురించి కూదా చెప్పాడు. నిజానికి విరు ను చూసాక జీవితం లో ఏదో మంచి పని, సహాయం  చేయాలి అనిపించింది. విరు ఇంకా నన్ను ప్రేమించలేదు డాడ్. మీరు అన్నట్లుగా తను నా గురించి తెలుసుకుని నన్ను పెళ్లి చేసుకున్నట్లయితే తను నన్ను ఇష్ట పడేది కదా. కానీ నన్ను పెళ్లి మాత్రమే చేసుకున్ధి. ప్రేమించడం లేదు. నాకు బాధ గా ఉంది విరు నా ప్రేమ ను అర్థం చేసుకోనందుకు. అలాగే భయం గా ఉంది ఎప్పటికైనా అర్థం చేసుకుంటుందో లేదో అని.
"నీ కోసం  ఎంతో మంది క్యూ కడతారు అందులో నీకిశ్తమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకో "
మీరు  చూపించిన వాళ్ళెవరైనా నా కల్లకే నచ్చుతారేమో?! తను మాత్రం నా మనసు కు నచ్చింది.
కళ్ళు మర్చిపోతాయి కానీ మనసు మర్చిపోలేదుగా... "
వాల్ల నాన్న All the best చెప్పాడు.
విరోనిక, ఆర్ కె ఇద్దరు ఇంటికి చేరుకున్నారు.
విరోనిక తన గదిలో కూర్చుని ఆర్ కె గురించి ఆలోచిస్తుంది. ఆర్ కె అంత ఆస్థి ఉండి కూడా లేనివాడిలా బ్రతికాడు.
అంతేకాక బార్య పై తనకున్న గౌరవo తనను బాగా ప్రభావితం చేసింది.
ఆర్ కె జయ ఇద్దరు ట్యాంక్ బండ్ దగ్గర కలుసుకున్నారు. వాళ్ళు అలా మాట్లాడుతూ వెళ్తుంటే  ఒకబ్బాయి ఆత్మ హత్యా చేసుకోవడానికి దూకబోతుండగా జయ్ ఆపి ఏమైయిందని అడిగాడు. నేను 10త్ ఫెయిలయ్యాను. ఇంట్లో చెప్పడానికి బయపడి చనిపోతున్నాను అన్నాడు.
వెంటనే జయ్ "పిచ్చోడా! ఇంత చిన్న విషయానికి చనిపోవాలా? ఈసారి ఫస్టు క్లాసు తెచ్చుకుంటానని నమ్మకం గా చెప్పు. అప్పుడు ఎం అనరు" అని' ఆ అబ్బాయికి సర్ది చెప్పి పంపించేసాడు.
ఆర్ కె జయ్ తో అతనికి అంత చెప్తున్నావ్. మరి నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావ్. అన్నాడు.
జయ్ అతని సమస్య వేరు, నా సమస్య వేరు. అయినా అతనికి మరో అవకాశం ఉంది. నాకు లేదు కధా! అన్నాడు.
నిన్ను వద్దన్న అమ్మాయి గురించి వందసార్లు చనిపోవాలనుకుంటున్నావ్! మరి నిన్ను కావాలనుకుంటున్న మీ అమ్మానాన్న గురించి ఒక్కసారి కూడా బ్రతకాలనిపించలేదా?
నవ మాసాలు మోసి కన్నా మీ అమ్మేమైపోవాలి? చేతికందోస్తాడనుకున్న కొడుకు మరణ వార్త విని నాన్న ఏమైపోవాలి. ఒక్కసారైనా ఆలోచించావా?
అయినా నువ్విప్పుడు చనిపోవాలనుకుంటుంది నిన్ను అక్సేప్ట్ చేయని అమ్మాయి కోసమా? డబ్బు కోసం నిన్ను వదిలేసిన అమ్మాయి కోసమా? ఈ అమ్మాయి కంటే మంచి అమ్మాయి నీకు బార్యగా వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ బవిష్యత్తు గురించి ఆలోచించు, మీ అమ్మానాన్నల గురించుఇ ఆలోచించు. ఇలాంటి అమ్మాయిల కోసం ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు.
జయ్ " అవును బ్రదర్. నువ్వు చెప్పింది నిజమే. థాంక్ యు " అని వెళ్ళిపోయాడు.
విరోనిక ఆఫీసు నుండి  ఆర్గనైజేశన్  కు వెళ్లి లక్కీ ని తీసుకుని ఇంటికి వెళ్లి ఆర్ కె కోసం తనకిష్టమైన వంట చేసి పెట్టింది.
ఆర్ కె వచ్చి లక్కీ తో ఆడుకుంటున్నాడు. ఇంతలో విరు వచ్చి బోంచేధ్ధామ్ రండి అంది. ఆర్ కె ఎవర్ని పిలుస్తుందా అని పక్కకు చూసాడు. విరు  మిమ్మల్నే రండి అంది.
ఆర్ కె " నన్నా...?! ఏంటి కొత్త మర్యాద?" అన్నాడు
"గౌరవం ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఎందుకు అని అడగకూడదు."  అంది
ఆర్ కె " అంటే ఇప్పుడు నా మీద నమ్మకం, ప్రేమ కలిగిందా?"
" ప్రేమ కలిగింది. నమ్మాలంటే ఇంకొంచం టైం పడుతుంది."
"ఓకే. నాతో ఇలా ప్రేమగా మాట్లాడితే చాలు. నాకు ఇంకేం అవసరం లేదు అన్నాడు.
" మీకు ఆస్తి ఉందని నాకెందుకు చెప్పలేదు?"
"చెప్తే అబద్ధం చెప్పానని ఇంకా ద్వేశిస్తావేమో అని చెప్పలేదు"
అలా మాట్లాడుతూ ఇద్దరు కలిసి బోంచేస్తున్నారు.
ఆర్ కె విరు వంటను పొగడ్తలతో మునగ చెట్టేక్కించాడు.
విరోనిక "ఆర్ కె... ఒక డౌట్ అడగనా?"
"అడుగు"
"ఎందుకు అమ్మాయిలకే తాళి, మెట్టెలు? అబ్బాయిలకు ఏమీ ఉండవు? అమ్మాయికి తలి, మెట్టెలు చూస్తే పెల్లయ్యిందని తెలుస్తుంది. అబ్బాయిలకు పెళ్ళయ్యిందని తెలియదు కదా? అలాగే ఒకమ్మాయి భర్త చనిపోతే బొట్టు తీసి విధవ ను చేస్తారు దాంతో తన భర్త చనిపోయాడని తెలుస్తుంది. కానీ ఒకటని బార్య చనిపోతే అతను ఎప్పటిలానే ఉంటాడు కదా! ఎందుకీ తేడా? ఏది ఏమైనా మీ అబ్బాయిలు చాలా లక్కీ! మీకిలాంటివేమి ఉండవు" అంది విరోనిక.

" అబ్బాయిలు, ఉద్యోగం చేయాలి, ఇంట్లో వాళ్ళను పోషించాలి, ఇలా చాలా భాధ్యతలు ఉన్నాయి కదా!" అన్నాడు
" ఇప్పుడు ఆడవాళ్లు ఇల్లూ,పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగం కూడా  చేస్తున్నారు, మరీ తేడ ఏంటి?" అంది
" ఆడవాళ్లు అలా ఉండటమే మన సంస్కృతి, సంప్రదాయం కదా!" అన్నాడు
" అవి ఆడవారికేనా? మీకు లేవా?"
" నువ్వన్నది నిజమే ఇక వాదన ఆపేసి పడుకుందాం!"అని ఆర్కే అన్నాడు . ఇద్దరు లక్కీ ని  పడుకున్నారు.
  తెల్లారి ఆర్కే  విరోనిక కోసం వెయిటింగ్ చేస్తున్నాడు డ్రాప్ చేద్దామని విరు లక్కీ ని రెడీ చేయడం తో లేట్ అయ్యింది. ఆర్కే తొందరగ రండి మేడం అంటే నీకు అంత  తొందరగా వుంటే  వెళ్ళు అని అనుకుంటూ  తట్టు తాకి జారుతుంటే ఆర్కే కింద పడకుండా పట్టుకుని అలాగే చూస్తున్నాడు విరు కళ్ళని. విరోనిక లేచి నువ్వు వెళ్ళు నే ఎలాగో లక్కీ ని  ఆర్గనైజేషన్ లో ఇచ్చి ఆఫీసుకి వెళ్త నీకు లేట్ అయితది అంది .
నే మీ ఇద్దరినీ డ్రాప్ చేసి వెళ్త అని అన్నాడు ముగ్గురు ఆర్గనైజేషన్ కి వెళ్లారు . విరోనిక లోపలి రమ్మంటే ఆర్కే వచ్చాడు.ఆర్గనైజేషన్ లో వున్నా అందరు అమ్మాయిలు అక్క బావ కేక అని అరుస్తున్నారు విరోనిక నవ్వుతు ఇక ఆపండి అంటే ఆ అమ్మాయిలు బావ అక్కతో మీ లైఫ్ ఎలా వుంది అంటే ఆర్కే సూపర్ అని అన్నాడు . హుహు కేక అన్నమాట అని అన్నారు వాళ్ళందరు  విరోనిక ఆర్కే పద ఇక్కడ వుంటే ఇలాగే  ఏడిపిస్తారు అని   బైక్ ఫై వెళ్తున్నారు దారిలో ఆర్కే ఒక పార్క్‌లో ఆపి తను తెచ్చిన గిఫ్ట్‌ని ఇచ్చి ఇది ఎప్పుడు ప్రెస్ చేసిన న మనసులో మాట చెపుతుంది అని అంటే విరు థాంక్స్ అని చెప్పి తీసుకొని ప్రెస్ చేస్తే ఐ లవ్ యు అని చెప్తుంది విరు మనసులో  సంతోషంగా ఫీల్  అవుతూ ఈరోజు ఎం ప్రత్యేకత లేదు క మరి ఎందుకు ఏ బహుమతి అంటే ఈరోజు నా భార్య నా  గుండెల్ని తాకింది. విరోనిక ఆహా .......  సరే పద నాకు ఆఫీసుకి టైం అవుతుంది అంటే  ఆర్కే తనని తన ఆఫీసు దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు.

                  ఇలా వీళ్ళిద్దరూ  సమస్యల్ని పరిష్కరించారు. విరుకు ఆర్కె మీద కొంచం కొంచం నమ్మకం పెరిగింది.  అలా సంవత్సరం గడిచింది. ఆరోజు రాత్రి 11:59 కి విరుకు కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే ఎవరూ మాట్లాడలేదు. ముందు ఒక cd ఉంది. ప్లే చేసింది. ఆర్కే మాట్లాడుతున్నాడు. ఇప్పటికి మన పెళ్ళయి సంవత్సరమైనా నాకు ఒకరోజులా ఉంది. ఇన్నిరోజులు ఎలా గడుచిపోయయో అనిపిస్తుంది. ఒక విధంగా నీతో గడిపిన జీవితం సంవత్సరం అయిపోయినందుకు బాధగా ఉంది. కానీ అంతలోనే నీతో గడపాల్సిన జీవితం చాలా ఉందని సంతోషం. విరు నీకు తెలియదు. మాటల్లో చెప్పలేను. నువ్వే నా ఊపిరి. విరు నా ఊపిరి ఆగిపోయెంత వరకు ప్రతీ కష్టం లోనూ, బాధలోనూ, సంతోషం లోనూ, చావులోనూ నీతోనే ఉంటాను. ఐ లవ్ యు విరూ అండ్ హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పాడు. అప్పటికి లక్కీ కి 2 సంవత్సరాలు, ఆర్గనైజేషన్ 3 సంవత్సరాల నుండి నడుస్తుంది. ఆర్గనైజేషన్ లో అందరూ లక్కీ తో కలిసి  హ్యాపీ మ్యారేజ్ డే అక్కా. ఆర్కే నిన్ను చాల ప్రేమిస్తున్నాడు. ప్లీజ్ ఆక్సెప్ట్ హిస్ లవ్ అని గట్టిగ అరిచారు. అమ్మ పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పి గుడికి వెళ్లి రమ్మంది. ఆతర్వాత ఆర్కె విరుతో నీకు న తరపున రెండు గిఫ్త్స్. ఒకటి నీకు సంతోషాన్నిచ్చేది. మరొకటి నాకు సంతోషాన్నిచ్చేది అని చెప్పాడు. విరు cd  ఆపేసింది.
ఆర్కే కాల్ చేసి పైకి రమ్మంటే వెళ్తుంది. మెట్ల నిండా గులాబీ రేకులు. తన పాదాలు గులాబీ రేకుల్ని తాకుతూ వస్తున్నాయి. పైన  లవ్ సింబల్ లో హ్యాపీ మ్యారేజ్ డే అని ఉంది. విరు చాల సంతోషించింది.  కలిసి  కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. విరుకు ఆర్కే మొదటి గిఫ్ట్ గా తను ఇంతవరకు కష్టపడి  జీతం 5 లక్షలు ఆర్గనైజేషన్‌కు చెక్ రాసిచ్చాడు. ఇంకో గిఫ్ట్ వంకాయ రంగు చీర ఇచ్చి ఇందులో నిన్ను చుదలనున్ధి. రేపు గుడికి ఈచీరలో వస్తున్నావ్ అని ఇచ్చాడు. విరు ఆర్కే తో ఇప్పటివరకు 80 % నచ్చావ్ అని చెప్పింది. ఆర్కే నా పరీక్షలో నేను 80% మార్కులు తెచ్చుకున్నాను, చాల సంతోషంగా ఉంది అన్నాడు.

                   తెల్లారి ఇద్దరూ కలిసి ఆర్గనైజేషన్‌కు వెళ్లి అటునుండి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆర్కే విరు ఏ చీరలో వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. విరు బయటకొచ్చింది. ఆర్కె యు ఆర్ లుకింగ్ గార్జియస్ టుడే అండ్ ఐ లైక్ యు విరుతో అన్నాడు. ఎన్నిసార్లు చెప్తావ్ అంది విరు. ఆర్ కె నువ్  ఐ టు లవ్ యూ చెప్పేదాకా విరు అన్నాడు ఆర్కె. పదపద మనకోసం అమ్మవాళ్ళు వెయిట్ చేస్తుంటారని బైక్ మీద ఇద్దరు ఆర్గనైజేషన్‌కి వెళ్లారు. అపుడు టైం 7అవుతుంది. వీళ్లిద్దరు బైక్ దిగి లోపలికివచ్చారు. అందరు బయటనే  వున్నారు. వీళ్ళు రాగానే అందరు గట్టిగ అరుస్తూ హాపీ మ్యారేజ్ డే అక్కా అని అరిచారు విరు చాలా సంతోషించింది. ఇద్దర్ని లోపలికి తీసుకెళ్లి కేక్ కట్ చేయించారు.
ఇక్కడ పిక్స్ అందులో అమ్మాయిలు తీస్తున్నారు. వాళ్ళకి తెలుసు విరుకి అన్ని  జ్ఞాపకాలని, ఫొటోల్లో బందించాలని చాలా పిక్స్  తీశారు అక్కడివాళ్లు. అందులోని అమ్మాయిలు బావా అక్క ఈరోజు నీజీవితంలోకి వచ్చిన రోజు మరి మాకు పార్టీ ఏది అని అపుడు ఆర్కే కంపల్సరీ అని పార్టీ ఇచ్చాడు వాళ్లందరికీ. ఇంతలో విరు డాడ్ వచ్చాడు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇద్దరు. ఇద్దరు టెంపుల్ కు  వెళ్ళడానికి బయల్దేరారు బైక్ పై అందరు బయటికి వచ్చి బై చెప్పారు.

                 వెళ్తుంటే దారిలో  సౌండ్....  కాపాడండి అని చుట్టూ చెట్లు అటు  వైపో ఇటు వైపో ఎక్కడ్నుంచి వస్తుందో అర్థంకాలేదు. ఇద్దరు త్వరగా వెళ్తున్నారు ఇంతలో ఒక అమ్మాయి చిరిగిన బట్టలతో కనిపించింది. విరు బాధపడ్తు బయపడకు నేనున్నా అంది. ఆర్కే తన షర్ట్ ఇచ్చి విరు ఆ అమ్మాయికి వేసింది ఇద్దరు తనను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు.డాక్టర్స్ ని విరు బతిమిలాడ్తుంది తనని ఎలాగైనా కాపాడండి అని డాక్టర్లు తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి పెయిన్ కిల్లర్ ఇచ్చారు.ఇంతలో ఆర్కే బయటికి వెళ్ళాడు ఆ రాస్కెల్‌ని తీసుకరావడానికి. ఆర్కే కి ఆ అమ్మాయి కన్పించిన ప్రదేశములో పర్సు దొరికింది. అందులోని అడ్రెస్స్ సహాయంతో వాణ్ణి కొట్టి తీసుకొచ్చాడు.ఇంతలో ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది తన ముందు తీసుకొచ్చాడు తాను ఆ వెధవ మీద విరుచుకుపడింది. తూ... అని ఊసింది, బాగా తిట్టేసింది, కొట్టింది, కొడుతూ ఎందుకురా నా జీవితాన్ని నాశనం చేసావ్ అమ్మాయిలంటే బలిపశువులా? నీ కామానికి నేను బలి అవ్వాలా? ఎందుకురా అమ్మాయిని కామంతోనే చూస్తారు?
నువ్ ఒక ఆడదాని కడుపులో పుట్టి మరో ఆడదాని జీవితం నాశనము చేయడానికి సిగ్గులేదురా!? అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది ఏడుస్తూ నీలాంటివాళ్ళు అమ్మ రొమ్ము పాలు తాగి ఆ రొమ్ముని ఎగతాళి చేయడంతో సమానం అని బాగా కొట్టింది ఏడుస్తూనే.  ఇంతలో విరు సిగ్గులేదురా అసలు ఒక మగాడు అమ్మాయి ఇష్టంలేకుండా తనని బలవంతంగా అనుభవిస్తావా అని చెంప చెళ్లుమనిపించింది.నీలాంటివాళ్ళవల్ల  చివరికి ఈ భూమి మీద మగాళ్లను కనడానికి ఆడవాళ్లు వుండరురా అని అమ్మాయి కసి తీరేదాకా తిట్టింది. ఇపుడు తనమనసు కుదుట పడింది. ఆర్కె పోలీసువాళ్ళకి ఇన్ఫోర్మ్ చేసి అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుకొని అరెస్ట్ చేయించాడు. అమ్మాయి అన్నా... థాంక్స్ నీవల్లే ఇపుడు నేను సంతృప్తిగా చనిపోతున్నా...! అని కళ్లుమూసింది.

                           అమ్మాయి  ఏడుస్తుంది. ఆర్కె బయటికి  వచ్చి వీన్ని కఠినంగా శిక్షించండి అంటున్నాడు. విరు ఏడుస్తూ వచ్చి హాగ్ చేసుకొని చాలా థాంక్స్ చెప్పింది. నేను అమ్మాయి బతకదని తెలిసిన బతికించాలని ప్రయత్నిస్తున్న నువ్ తనని మనశాంతితో హాపీగా  వెళ్లన ప్రయత్నంచేసావ్. ఆ ప్రయత్నమే ఈరోజుల్లో నీలాంటి ఒక అబ్బాయిని చూడడం, నువ్వే నా భర్త గా రావడం ఆమ్ లక్కీ. ఆర్ కె. షాక్ లో అలాగే చూస్తూ వుండిపోయాడు. ఇంతలో ఆ అమ్మాయి వాళ్ళ  అమ్మవచ్చి మా అమ్మాయిని సంతృప్తితో పైకి పంపించినందుకు కృతజ్ఞతలు చెపింది సారీ అండి మీ అమ్మాయిని కాపాడుకోలేకపోయాం అని అన్నాడు. తను పర్లేదు బాబు అది దేవుడి నిర్ణయం, మీరేం చేస్తారు అని తన బాడీ ని తీసుకెళ్లారు. విరు, ఆర్ కె ఇద్దరు త్రిగోనోమెట్రీ బైక్ ఫై వెళ్తున్నారు ఆర్ కె విరు మనసు బాలేదని తనని ఆర్గనైజేషన్ కి తీసుకెళ్లాడు.

                       అక్కడ లకీతో ఆడుకుంటూ కొంచెం మర్చిపోగలిగింది. నైట్ ఇంటికివెళ్ళారు. ఇంటికొచ్చాక విరు ఆర్ కె తో ఎందుకు ఆర్ కె కొంతమంది మృగాలు ఆడది అంటే ఒకబోమ్మలా చూస్తారు? తన కోరిక తీర్చుకోవడం కోసం మృగంలా, కుక్కలా తన శరీరం మీద పడి హింసిస్తారు? వాళ్ళు ఒక క్షణం ఎందుకు ఆలోచించరు? తాను ఒక మనిషేనని తనకి మనసు ఉంటుందని ఎందుకు అనుకోరు?
ఆర్కె అందరూ  మగాళ్లు ఆలా వుండరుగా కొంతమంది అమ్మాయిల్ని చిత్రహింసలకి గురిచేస్తున్నారు.
అపుడు విరు అందరూ అలాగే ఉంటే అపుడు ఆడవాళ్లు కనడానికే  భయపడేవారు. ఇప్పటికి చలంనుండి తల్లులు తన బిడ్డలకి 16,17సంవత్సరాలకే పెళ్లి చేస్తున్నారు తన బిడ్డల అంబిషన్స్ ని  పక్కకుపడేసి ఇలాంటి మగవాళ్ల వల్ల ఏ క్షణాన ఏమైపోతుందో అని భయంతో.
ఆర్కె ఎం చేద్దాం కాలం ఆలా వుంది ఇక పడుకో... ఎక్కువ ఆలోచించకు. మంచి ఉన్నపుడు చెడు ఉంటుంది, ఎలాగంటే దేవుడున్నపుడు దయ్యం ఉంటుంది కదా అలాగే. కష్టాలు ఉంటూనే దేవుడు గుర్తిస్తాడు. లేకపోతే ఎవరు గుర్తుంచుకుంటారు దేవుడిని. కష్టసుఖాలు జీవితంలో భాగం విరు ఇక పడుకో... అని తనని పడుకోబెట్టి ఆర్కె పడకున్నాడు.

                    తెల్లారింది. ఇద్దరు రెడీ అవుతున్నారు ఆఫీస్కివెళ్లడానికి. ఇంతలో ఆర్గనైజేషన్ నుంచి కాల్ వచ్చింది. అక్క రా ఒకసారి అర్జెంట్‌గా అని. ఓకే అంది. ఆర్ కె పద నేను వస్తా అన్నాడు. ఇద్దరు ఆర్గనైజేషన్ కి వెళ్లారు.
                    ఒక అమ్మాయి. పేరు స్నేహిత. అపుడు వ్యభిచారం నుంచి బయటపడ్డ అమ్మాయిల్లో తిను ఒకామె.  స్నేహిత  పాకాన  ఒక  అబ్బాయి. తనపేరు  రాజు. ఇద్దరు  విరుకోసం వెయిట్ చేస్తున్నారు. విరు వచ్చి షాక్ అయింది. ఎవరితను? ఎందుకొచ్చాడు? అని. అక్కా తిను నన్ను లవ్ చేస్తున్నాడట. నన్ను పెళ్లి చేసుకుంటాడట. నాకు ఎం చెప్పాలో  అర్థంకాక  న  గతంగురించి  చెప్పా. అయినా పెళ్ళుచేసుకుంటా అన్నాడు. బావకి చెప్పా, బావ కూడా  పీలిచేసుకో అంటున్నాడు. విరు  దిక్కు తోచక ఆర్ కె ను చూసింది. ఆర్ కె "విరూ స్నేహిత నాకు కాల్ చేసి  బావ ఒకతను  నన్ను ప్రేమిస్తున్నా అని వెంటపడుతున్నాడు. గ్రీటింగ్స్ పంపుతున్నాడు. నువ్ అయినా  తనని కాంట్రల్ చేయి  తను మంచోడే కానీ నన్ను లవ్ చేసి తను లైఫ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని. నేను చెప్పా ఆల్రెడీ, నాది పాడైపోయిన జీవితం అయినా  పెళ్లిచేసుకుంటా అంటున్నాడు. నువ్ అయినా ఆర్డమయేలా చెప్పు అంది".

                ఆర్ కె  రాజుని  కలిసాడు ఆర్ కె రాజు  పంపిన  గ్రీటింగ్స్‌ని  చూసాడు.  అందులో కవితలు నైస్ కానీ అందాన్ని బట్టి  కారెక్టర్ని  డిసైడ్ చేయలేము అని  తనని  కలిసాడు.
ఆర్ కె రాజుతో  నీ చుట్టు కటిక చీకటి అనుక్షణం  స్పందించే  గోడల్లో  ప్రవహిస్తున్న  రక్తం  వున్నా  భయపడొద్దు  ఏమాత్రం. ఎందుకంటే  నీవి సురక్షితమైన  ప్రదేశంలో ఇంకో  కవిత  కదిలే  ప్రతిక్షణంలో  నువ్ వున్నావ్. వేసే ప్రతి అడుగులో నువ్ వున్నావ్. మెదిలే ప్రతి ఆలోచనలో నువ్ వున్నావ్.... మొత్తంగా  నాలో  నువ్వై వున్నావ్. ఇవి  చూసాక  ఆర్ కె కి  కొంచెం నమ్మకం  కలిగింది. ఎందుకంటే మన మనుసులో ఫీలయి మాటలే కవితల రూపంలో వస్తాయని. అందుకే తనతో మాట్లాడదామని వచ్చాడు ఆర్ కె. ఎందుకు  నీకు  స్నేహితుని  చూడగానే  పెళ్ళిచేసుకోవాలని  అనిఒయించింది?
                    అపుడు  రాజు  తనని చూడగానే  నా మనసు ఎగిరినట్టు అన్పించింది, తన హెల్పింగ్ నేచర్ ఇంకా అందర్నీ  ఒకేలా చూడడం నాకు  నచ్చింది. ఆర్ కె తన  మలినమైన  గతం తెలిసాక  కూడా  ఆ  ప్రేమ  అలాగే వుందా? ఒకసారి  కూడా  చేదుగా  అనిపించలేదా? అన్నాడు.
             
                    ఆర్ కె తన సమాధానంకోసం చూస్తున్నాడు. రాజు మీకోటి చెప్పనా సర్? పెళ్లి, ప్రేమ అనేది రెండు మనసులకి సంబంధించింది. రెండు శరీరాలకి సంబంధించింది కాదు. అలాగే పవిత్రత అనేది మనసుకు  సమునఁబందించింది, శరీరానికి కాదు. నా విషయంలో  ఆలా  చుస్తే  నా స్నేహిత ఇప్పటికి  పవిత్రంగానే  వుంది. తనని  బలవంతంగా  అనుభవించిన  ఆమృగాల తప్పుకాని  నా స్నేహితాది తప్పుకాదు. మీరే చెప్పండి తనకి ఎంత  చెప్పిన  అర్థంచేసుకోవట్లే సర్. తాను  నాజీవితంలో సగ భాగం పంచుకోవాలి. మీరే ఎలాగైనా ఒప్పించాలి అని ఆర్ కెతో అన్నాడు. ఆర్ కె కి తన  మాటల్తో  నమ్మకంకలిగింది తను స్నేహితని బాగా చూసుకుంటాడని.
               
                   ఆర్ కె  ఆ  రోజు సాయంత్రం స్నేహితని  కలిసి  తాను  మంచోడు, పెళ్లిచేసుకో, అన్నాడు. మీరే ఆలా అంటారే బావా? తాను  మంచోడు. నాకు తెల్సు, తాను మంచోడే కానీ నేను ఎలా పెళ్లి చేసుకోగలను నా జీవితం మాలినమైపోయింది బావ. నేను పూజకి పనికిరాని పువ్వు అంది స్నేహిత. అపుడు ఆర్ కె నువ్ ఎందుకు ఆలా అనుకోని  నీ  జీవితాన్ని  నువ్వే  శిక్షించుకుంటున్నావ్. స్నేహిత నీ గతంలో నీ తప్పు లేదు. దానికి నీకెందుకు శిక్ష. తప్పు చేసినవాళ్ళే దర్జాగా బతుకుతున్నారు ని జీవితాన్ని నువ్వెందుకు నరకప్రాయం చేసుకుంటున్నవ్. అయినా  నామనసు  ఒపుకోట్లేదు  బావా. అపుడు ఆర్ కె  చూడూ మిలో విషయంచెప్తా మనసుని చూసే వాడు శరీరాన్ని చూడడు. శరీరాన్ని చూసేవాడు మనసుని చూడడు  నాకు అన్పించింది రాజు కేవలం నీమనుసు చూసి  నిన్ను ఇష్టపడ్డాడు. తాను నీ నుంచి ఆశించేది  నీ మనసు మాత్రమే. ఓకే  బావ తనని  రేపు ఆర్గనైజేషన్‌కి రమ్మను. అందరూ ఒప్పుకుంటే  పెళ్లి చేసుకుంటాను అంది. ఇదంతా విన్న విరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఆర్ కె అంది. ముందు తన ప్రేమ నిజమో కాదో తెలుసుకొని తర్వాత నీకు చెప్దామని ఆగాను. విరు ఓకే అంది.

                     విరు రాజు తో స్నేహిత అంటే ఎందుకు ఇష్టమో ఎంత ఇష్టమో రెండు మాటల్లో చెప్పమంది. అపుడు రాజు  తాను నా శ్వాస, నా ప్రాణం ఎందుకు అంటే తన మనసు మంచిది. అందరు మంచిగా ఉండాలనే కోరుకుంటుంది. ఆమంచి మనసులో నాకు స్థానం కావాలి అని చెప్పాడు. విరు తన కళ్ళలో నిజాయితీని చూసింది. విరు స్నేహితని నీకు  ఇష్టమా అంది. అక్కా నీకు ఇష్టమైతే నాకు  ఇష్టమే నా  జీవితం గురించి  ఆలోచించే  వ్యక్తివి, నా జీవితం  గురించి  నిర్ణయం  తీసుకునే  హక్కు నీకు  మాత్రమే  వుంది. నాకు నచ్చాడు బట్ స్నేహిత నీకు ఇష్టమైతే నే  పెళ్లి అంది విరు. స్నేహిత  ఇది నా అదృష్టం అక్కా నా జీవితంలో సంతోషం ఉంటుందని నేనెపుడు ఊహించలేదు. గతంలో అందరు తన సుఖం కోసం నన్ను హింసించేవారు. సుఖం అనేది శరీరానికి సంబంధించింది, సంతోషం అనేది మనసుకి సంబంధించింది. ఇపుడు ఆ సంతోషం నాకు దక్కుతుందంటే ఆమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ.... రాజులాంటి  తాను పెళ్లి  చేసుకుతునందుకు  అని విరుని హాగ్ చేసుకుంది. ఒక  మంచిరోజు చూసి వీళ్లిద్దరికీ పెళ్ళిచేసారు.

                     ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు విమల బ్రదర్ కాల్ చేసాడు. విరు కి అక్కా నాకు భయంగా వుంది అక్కా నా గోల్ సాదించగలనో లేదో అని అన్నాడు. విరు ఒకసారి ఆర్గనైజేషన్‌కి రమ్మంది. విరు అర్జున్‌ని లోపలికి రండి ఇందులో  వున్నా నీతివాక్యాల్లో నిన్ను బాగా ఇంప్రెస్ చేసినవి రాసుకొని పేపర్ నీకు  కానిఒయించే విదంగా పేస్ట్ చేయి. ఇంకెప్పుడు నీకా భయం కలగదు,
అందులోని  3 నీతివాక్యాలు  బాగా  ఇంప్రెస్స్ చేసాయి  అవి  రాసుకున్నాడు.
"జీవితానికి ఒక ద్యేయన్ని  ఎన్నుకో, వున్న అవకాశాలని  గమనించు, సాధ్యాసాధ్యాల్ని పరిశీలించు, నీకున్న బలాలని  గుర్తించి మరింత  అబివృద్ది చేసుకో, అవసరమైన  కొత్త  బలాలను సమీకరించుకో, బలహీనతల్ని అదుపు చేసుకో, భయాన్ని వీడు  ప్రణాళిక  బద్దంగా  ముందు  అడుగువేయి  మిత్రమా....!"

"ప్రపంచంలోని  చీకటి  అంతా ఏకమైనా  ఒక  అగ్గిపుల్ల  వెలుగుని  దాచలేదు. లక్స్యసాధనకు  పట్టుదల  తోడైతే  నీ విజయాన్ని  ఎవరూ ఆపలేరు."

"ఓడిపోయానని  నిరాశ  చెందకు  ఆ  ఓటమినుంచే  గుణపాఠం  నేర్చుకో  విజయానికి  దాన్నే  మార్గంలా చేసుకో!"
ఇవి  తనని చాలా ప్రభావితం  చేసాయి. ఇంకెపుడైన  ఇలా  సాదించలేను అని భయం కలిగితే  ఇవి  చూసి  ధైర్యం  తెచ్చుకుంటా అక్కా అని చెప్పి వెళ్ళిపోయాడు.

                            ఇంతలో  విరు కోసం ఆర్ కె  ఆర్గనైజేషన్‌కి వచ్చి బైక్ మీద తీసుకెళ్తున్నాడు. "ఎక్కడికి?" అంటే చెప్పలేదు సర్ప్రైస్ అన్నాడు రామోజీ ఫిలిం సిటీ కి తీసుకొచ్చాడు.
ఇపుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు అని విరు షాక్. విరుని ఆర్ కె  ఒక సెట్ చేసిన రూంలోకి తీసుకెళ్లాడు. విరుకి అర్థంకాలేదు.  ఇద్దరు లోపలికెళ్లారు.  ఎందుకంటే  విరు లోపలికి వెళ్లగానే మహేష్ ఉన్నాడండీ విరుకి మహేష్ అంటే పిచ్చి. చూడగానే ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
అప్పుడు మహేష్ hii విరుజీ అన్నాడు. విరు ఫుల్ హ్యాపీ. సంతోషం , ఆశ్చర్యం, భయం అన్ని ఫీలింగ్స్ తో హాయ్ మహేష్ అంది. మీరు స్పెషల్గ నన్ను కలవడం హోయ్.... అంది. మహేశ్ "that credits goes to ur husband"అన్నాడు .
                           తనే నన్ను షూటింగ్ లో కలిసి సార్ మీరంటే నా వైఫ్ కు ఇష్టం, చాల అభిమానం అని చెప్పాడు బట్ నేనెప్పుడూ ఫాన్స్ ను పర్సనల్ గా కలవటం జరగలేదు, నాకు అలవాటు కూడా లేదు అన్నాడు మహేష్. మీ హస్బెండ్ ఆలా అనకండి సర్... తాను మీకు చాల పెద్ద ఫ్యాన్ మీకోసం ఒక ఆల్బం చేసి పెట్టుకుంది. మీ చిన్నప్పటి పిక్స్ నుండి మీ వెడ్డింగ్ కార్డ్, మ్యారేజ్ పిక్స్, గౌతమ్ తో మీ మొదటి పిక్ అలా అన్నీ చేసి ఎప్పటికైనా మీకు చూపించాలని చెప్పి మీ ఆర్ కె ఒప్పించారు.
                          మహేష్ ఆ ఆల్బం చూసిన వెంటనే "wow.. soo nice... వెంటనే కలుద్దాం పదండి" అన్నారు.
విరు వెంటనే ఆర్ కె ను చూసి తన కళ్ళతోనే థాంక్ యు సో మచ్ అని చెప్తున్నట్టుగా కళ్ళు మూసుకుంది. మహేష్ ను చూసి ఆనందం తో మాటలు రావటం లేదు తనకు అంతలో మహేష్ తానే కల్పించుకుని మీరు చేసిన ఆల్బం చాలా బావుంది విరు... నా మ్యారేజ్ సెట్ అంతా కార్డు మోడల్ లో ఎలా చేసారు గౌతమ్ తో న ఫస్ట్ మెమోరీస్ అన్ని ఎలా కాలేచ్ట్ చేసారు. యూ ఆర్ సో నైస్ అని చెప్పాడు. అప్పుడు విరు మీపై ఉన్న అభిమానం ఎదో కొంచం అయినా ఇలా చూపించగలిగాను. ఐ ఆమ్ సో గ్లాడ్ టు మీట్ యూ అండ్ ఐ అం వెరీ లక్కీ... మీ విలువైన టైంలో నన్ను కలవడానికి ఒప్పుకున్నందుకు చాల హ్యాపీ గాఉంది మహి చాలా థాంక్స్ అని చెప్పింది. 
మీరు చేసిన ఆల్బం నాతో తీసుకెళ్తాను అన్నారు మహేష్. అది మీకోసమే చేశా మహి తీసుకెళ్లండి అని చెప్పింది. ఇంకా షూటింగ్ టైం అవుతుంది నేను వెళ్లాలని చెప్పాడు మహేష్. ముగ్గురు కలిసి సేల్ఫీ తీసాడు ఆర్ కె. మీతో తీసుకున్న పిక్ కూడా ఆల్బం లో ఉంటుంది అని చెప్పి వెళ్పోయాడు మహేష్.
విరు ఆర్ కె ని గట్టిగ హాగ్\చేస్కుని థాంక్ యూ ఆర్ కె... లవ్ యూ రా నువ్ నాకు 100% కాదు 200% నచ్చావ్. మహేష్ తో కలిసే అవకాశం ఇచ్చినందుకు కాదు. నాపరాతి ఇష్టాన్ని ని ఇష్టం గా , నా  ప్రతి బాధను నీ బాధగా భావిస్తున్నందుకు అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల అభిప్రాయాలను గౌరవిస్తున్నావ్ అది చాలా నచ్చింది. ఏ అమ్మాయికైనా ఇంతగా అర్ధం చేస్కునే హస్బెండ్ దొరకడు. ఐ ఆమ్ సో లక్కీ టు హావ్ యూ అని చెంప మీద కిస్ ఇచ్చింది. ఆర్ కె "ఐ టూ లవ్ యూ రా ఇప్పుడు నిజంగా షాక్ అవ్వాల్సింది నేను. ఏంటి ఇంట ప్రేమ ఒకేసారి... నీకు అన్ని ఎక్కువే కదా కోపంగా ప్రేమైన ఏది దాచుకోలేవు వెంటనే చుపిస్తావ్"
                          ఇంతలో ఎవరో టెక్నిషన్స్ వచ్చారు. అప్పటి వరకు ఇద్దరు షూటింగ్ స్పాట్ లో ఉన్న విషయమే మర్చిపోయారు. వెంటనే బైక్ పై పార్క్ కు వెళ్లారు. అక్కడ గార్డెన్ లో కూర్చున్నాడు ఆర్ కె తన ఒళ్ళో విరు పడుకుని చేతిలో చేయి వేసి చూస్తూ ఉంది. ఆర్ కె నాకు చాల హ్యాపీగా ఉందిరా నేను ఎప్పటికి నిన్ను లవ్ చేస్తూనే ఉంటా నువ్వు నేను ముసలివాళ్ళమైపోయినా ఇలానే ఉంటా నేను నీతో అంటూ 2, 3 గంటల పాటు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తర్వాత ఐస్ క్రీం పార్లోర్ వెళ్లి ఒకరికొకరు ఐస్ క్రీం తినిపించుకున్నారు అటునుండి ఆర్గనైజషన్ కు వెళ్లారు. అలా వాళ్ళను చూసాక అందరికీ అర్ధమైంది ఇప్పుడు వీళ్ళు నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ల ఉన్నారని అనుకున్నారు. అమ్మ, అందరూ సంతోషించారు. లక్కీ కి ఇప్పుడు 2 సంవత్సరాలు అక్కా అంటూ వచ్చి విరును పట్టుకుంది. విరు ఎత్తుకుని తన ముద్దు ముద్దు మాటలు వింటూ ఆడుతోంది. అమ్మ విరు తో చాల సంతోషం రా ఇప్పటికైనా నీ భర్తను అర్ధం చేసుకున్నావ్. తాను నీకు తగినవాడు ఎప్పుడు ఇలానే ఉండాలి మీరు అని చెప్పింది. అపుడు ఆర్ కె వచ్చి నాకు కొంచం పని ఉంది వెళ్ళొస్తా అని విరు నువ్వు నాతో వస్తావా లేదా రాత్రికి వస్తావా నేను వెళ్తున్న అని చెప్పాడు.

Rk vellagane org lo vunna ammilu he he ipudu nachadannamata ma bava akkaki ani edpistunaru
Apuudu viru amma venakki caching dakkundi amma chalet enduku biddani edioistunaru ika padandi evarroomki vallu
Ammma viru ikanunchini life kottaga modalvutundi baryabartala madya etuvanti daparikalu vundoddu evishayamina barthatho chepukovaliani andi
Bartjanu gouravinchali ani pedda cls tisukyndi apudu viru sare amma tine ayindi vanta cheyali ika veltha andi apudu amma hpoy tanki nenu chepindi ardamindi ani santhoshinchindi
Viru scootypi intiki caching doorooenxhesi lopaklki adugu pettagane rose pula vasrshm viru piki chustu navtu oka adugu vesindi chuste redcaroet vesindi
Dani mida nadustu vastundi inthalo tablepi viru smile pic pakkana lovshapelo gift adi opencheste andulo oka letter andulo i want to see u r smile always nd i wil do that to make u smile in our life thats y i put tjatphoto here so plz smile daimond 


Friday 30 November 2012

ఆ:!

ఆ:!

నిప్పులు చిమ్ముకుంటూ 
నింగికి నేనెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-

నెత్తురు క్రక్కుకుంటూ 
నేలకు నే రాలిపోతే,
నిర్ధాక్షిణ్యంగా వీరే...

-శ్రీశ్రీ 
మహాప్రస్థానం 
2-2-1935

అవతలి గట్టు

అవతలి గట్టు 


ఇవేమిటీ వింత భయాలు?
ఇంట్లో చీకటి!

ఇవేమిటీ అపస్వరాలు?
తెగింది తీగ!

అవేమిటా రంగుల నీడలు?
చావు, బ్రదుకూ!

ఎచటికి పోతా వీ రాత్రి?
అవతలి గట్టుకు!
-శ్రీశ్రీ
మహాప్రస్థానం 
16-06-1934 

 

భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, 
వైప్లవ్య గీతాన్ని నేను!
స్మరిస్తే పద్యం,
అరిస్తే వాద్యం,
అనల వేదిక ముందు ఆశ్ర నైవేద్యం!

లోకాలు, భవభూతి శ్లోకాలు,
పరమేష్టి జూకాలు న మహోద్రేకాలు!
నా ఊహ చాంపేయమాల!
రస రాజ్యడోల!
నా ఊళ కేదార గౌళ!

గిరులు సాగరులు, కంకేళికా మంజరులు,
ఝరులు నా సోదరులు!
నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం!
                                                         
                                                                        -శ్రీశ్రీ 
                                                                 మహా ప్రస్థానం 
                                                                  01-06-1934 



కళారవి

కళారవి 

    పోనీ, పోనీ!
    పోతే పోనీ!
    సతుల్, సుతుల్, హితుల్ పోనీ!
    పోతే పోనీ!

    రానీ, రానీ,
    వస్తే రానీ!
    కష్టాల్, నష్టాల్,
    కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
    వస్తే రానీ!
    తిట్లూ, రాట్లు , పాట్లు, రానీ!
    రానీ, రానీ!

    కానీ, కానీ!
    గానం, ధ్యానం!
    హాసం, లాసం!
    కానీ, కానీ!
    కళారవీ! పవీ! కవీ!

                                                 -శ్రీశ్రీ 
                                              మహా ప్రస్థానం 
                                              11-07-1934 



మహా ప్రస్థానం

మహా ప్రస్థానం 

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంతరాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా 
మరో ప్రపంచపు జలపాతం?

దారి పొడగునా గుండె నెత్తురులు 
తర్పణచేస్తూ పదండి ముందుకు!
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి!
నదీ నదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మనకడ్డంకి?

పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!

ఎముకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన,
సోమరులారా చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా! రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!

మరో ప్రపంచం,
మహా ప్రపంచం,
ధరిత్రి నిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
ప్రభంజనం వలె హోరేత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షకాభ్రముల ప్రళయ ఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనబడలేదా మరో ప్రపంచపు 
కణకణ మండే త్రేతాగ్ని?

ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్ 
జల ప్రళయ నాట్యం చేస్తున్నవి!

సలసల క్రాగే చమురా? కాదిది
ఉష్ణ రక్త కాసారం!
శివ సముద్రమూ,
నయాగరా వలె 
ఉరకండీ, ఉరకండీ ముందుకు!
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామమెరుగక మ్రోగింది!

త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడలేదా మరో ప్రపంచపు 
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగభుగలు?

                                                   -శ్రీశ్రీ
                                            మహా ప్రస్థానం
                                             12-04-1934




మౌనం

          మౌనం...!
          విహంగం!
          తరంగం!
          మృదంగం!

                        మౌనం...!
                        కారణం!
                        దారుణం!
                        మరణం!

                                    మౌనం...!
                                    చూసే వేళ!
                                    నవ్వే హేళ!
                                    సాగే లీల!
                                                                                                                                               
                                                    మౌనం...!                
                                                    యోచన!
                                                    లోచన!
                                                    వంచన!

    మౌనం...!
    సంధ్య తెమ్మెర!
    నవ్వుల దొంతర!
    మధుర కిన్నెర!
                                                                                                                                                                                                                                            
                     మౌనం...!
                     హృదయాన ఉదయం!
                     పయనాన గమనం!                                                                                                       
                                                                                      
                                              మౌనం...!                                                                                           
                                              ప్రాణానికి ముందు వెనుక!                                                                                         
                                              శూన్యానికి వెనుక ముందు!                                      
  
                                                                     మౌనం...!
                                                                     ఆదిలో అంతం! 
                                                                     అంతంలో ఆద్యం!


-భార్గవి 
29/11/12

Wednesday 28 November 2012

నేనేమిటో...!

29/11/12
నిధ్దురలేని కనులకు తెలుసు!
మెలకువ లేని కాలాలకు తెలుసు!
మౌనం చాటున మనసుకు తెలుసు!
నేనేమిటో...!

తడుముకుంటున్న గుండెను అడుగు!
శూన్యం వెనుక కాలాన్ని అడుగు !
సాగలేని ప్రతి అడుగును అడుగు!
నేనేమిటో...!

~ భార్గవి కులకర్ణి 

Monday 26 November 2012

అతడు ఆమె


13/12/08
అతడు.....!!
గుట్టు తెలిసిన వాడు!
కనికట్టు చేసేవాడు!!
గుండె చాటున నక్కేవాడు!
గుండె కోసిచ్చేవాడు!!
గుండెను గుచ్చేవాడు!
గుడి గంటలు మ్రోగించేవాడు!!

ఆమె....!!
చూపు గారడీ చేసేసేది!
చూపులకే దొరకనిది!!
పరుల సిగ్గులే పలికేది!
పాప పుణ్యాలు లేక్కేసేది!!
మౌనంగా రోధించేది!
మురిపాలు పండించేది!!

-భార్గవి కులకర్ణి 

Street children

27/11/12

చిరిగిన కాగితం బతుకులు...
కల్లల లోకపు కలం విదిలించిన
కన్నీటి సిరా చుక్కలు...
చిరునవ్వుల పట్టుదారాలు!

కర్మలు తెలియని 
కల్మషమెరుగని
కారు మబ్బులను
కనుదోయి దాచిన...

కాటుకలంటని
చీకటి చూపులు!

పాలపుంతలు,
పన్నీటి చినుకులు,
పలకరింపుతో
ఒలికిస్తారు!

కీచక కరవాలంతో
అరాచకమింక ఆపండి!
కలం పట్టుకు, పదం వద్దకు
పథం చూపుతు నడపండి!

ఎగిరిపోయే సీతాకోక
చిలుక రెక్కలు వదలండి!

మెరిసే చుక్కలనంటే
విరిసే నవ్వుల పువ్వులు
కోసిరిన ఆనందాలను
ఆస్వాదించండి!
-భార్గవి కులకర్ణి 
లలితద్రితి.బ్లాగ్స్పాట్.కాం 

Sunday 25 November 2012

సంధ్య - దేవరకొండ బాల గంగాధర తిలక్

గగనమొక రేకు
కన్నుగవ సోకు
ఎరుపెరుపు చెక్కిళ్ళ విరిసినది చెంగల్వ
సంజె వన్నెల బాల రంగు పరికిణి చెంగు
చీకటిని తాకినది అంచుగా
చిరుచుక్క ప్రాకినది

వాలు నీడలా దారి నీలి జండాలెత్తి
చుక్క దీపపువత్తి సొగయు బాటలనల్ల
నిదుర తూలెడి నడక గదుము మైకపు  కోర్కె
వచ్చు నిశిలో కరిఇగి నవ్వు శశిలో కలిసి
సంజె వన్నెల బాల రంగు రంగు రుమాల
విరిసింది కలలల్లు
వెండి తోటల మధ్య
వ్రాలినది వ్రాలినది తావిగా
సోకినది సోకినది

సంజె పెదవుల  కడలి అంచుల విరిగి
సంజె పరికిణి చెరగు ఎడద లోతుల మెరసి
ఏటి కొంగల నిదుర ఎర్రగా ప్రాకింది
బాతు రెక్కల నీడ బరువుగా సోలింది
సంజె వన్నెల చాలు స్వర్ణ స్వర్ణది ధార
వయసు మైకపు జీర కరగు మబ్బుల తేల


గగనమొక రేకు
కన్నుగవ సోకు



1941
 - దేవరకొండ బాల గంగాధర తిలక్ 
అమృతం కురిసిన రాత్రి 

నా కవిత్వం - దేవరకొండ బాల గంగాధర తిలక్

నా కవిత్వం కాదొక తత్వం 
మరికాదు మీరనే మనస్తత్వం 
కాదు ధనికవాదం, సామ్యవాదం 
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ 
జాజిపువ్వుల అత్తరు దీపాలూ 
మంత్ర లోకపు మణి స్తంభాలూ 
నా  కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ 
ధర్మ వీరుల కృత రక్త నాళాలూ 
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి 
నా కళా కరవాల ధగద్ధగ రవాలు 

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు 
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు 
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

~1941
దేవరకొండ బాల గంగాధర తిలక్

అమృతం కురిసిన రాత్రి