Tuesday 4 September 2012

అనుభవించు

12/11/09
అనుభవించు...!
ఆనందాలు
అనుబంధాలు
ధు:ఖాలు
సుఖాలు
ఆప్యాయతను
శత్రుత్వాన్ని కూడా...!!
ఓ మనసా...
ఎందుకింత బెరుకు?
 నీకు నేను తోడు
నాకు అనంతకోటి మనసుల
ప్రేమ తోడు!!

కరిగించు స్వప్నాన్ని, దు:ఖాన్ని
జయించు జీవితాన్ని!
చేరుకో నీ తొలి గమ్యాన్ని!!

కరిగించు స్వప్నాన్ని...
జయించు దు:ఖాన్ని...
చేరుకో జీవిత గమ్యాన్ని...!!

భార్గవి కులకర్ణి 

భిక్షువర్షీయసి

భిక్షువర్షీయసి

 దారిపక్క చెట్టు క్రింద
ఆరిన కుంపటి విధాన
కూర్చున్నది ముసల్దోకతె
మూలుగుతూ ముసురుతున్న
ఈగలతో వేగలేక

ముగ్గుబుట్టవంటి తలా
ముడతలు తేరిన దేహం
కాంతిలేని గాజుకళ్ళు
తనకన్నా శవం నయం

పడిపోయెను జబ్బుచేసి
అడుక్కునే శక్తిలేదు
రానున్నది చలికాలం
దిక్కులేని దీనురాలు

ఏళ్ళు ముదిరి కీళ్ళు కదలి
బతుకంటే కోర్కె సడలి
పక్కనున్న బండరాతి
పగిదిగనే పడి ఉన్నది

ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరిదని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది

ఎముక ముక్క కొరుక్కుంటు
ఏమీ అనలేదు కుక్క

ఒక ఈగను పడవేసుకు
తొందరగా తొలగే తొండ

క్రమ్మే చిమ్మ చీకట్లు
దుమ్మురేగే నంతలోన

ఇది నా పాపం కాదనె
ఎగిరి వచ్చే ఎంగిలాకు

శ్రీ శ్రీ 
మహా ప్రస్థానం 

Monday 3 September 2012

Reply me!


 1st January 2009
ఏం కనిపిస్తోంది?
ఆకాశం క్రింద - పైన  తిరగబడి పోయిందా?

మంచి కోసం చూసి చూసి...
మంచి అన్నది చేసి చేసి...
విసిగిపోయున్నావా?
కష్టాల గట్టు నుండి కన్నీళ్ళ కాల్వలోకి
దుకాలనుకున్నావా?

"మంచి చేస్తే స్వర్గానికి, లేకపోతే నరకానికి"
అని చెప్పింది విని....
భయంతో మంచి చేసి
నరలోకంలోనే నరకం చూసే
మంచివాడివ నువ్వు?

అంతా నా  తలరాతని...
అదృష్టం ఆకసమని...
నాకెవరు లేరంటూ
వగచే వెర్రివాడివా?

జీవితమే చిన్నదని...
తప్పొప్పులు సహజమని...
సుఖం పొందు చేరుకుని...
"Don't care" అన్నావా?
నువ్వేమైనా take it
easy personవా?

జీవన గమ్యం దేవుడని...
బౌతికమే వ్యర్థమని...
బంధాలన్నీ త్యజించి...
బికారివై, పుకారువై...
సన్యాసివై, సన్నాసివై...
శూన్యం లో అన్వేషించే
పిచ్చివాడివా?

ఎవరయ్యా ఎవరు నువ్వు?
బదులు చెప్పు నాకు మొదలు

అసలు నీవెవరని అడిగావా? అడిగే సావా ?

నీ ఆత్మ సాక్షిని నేను!!



Sunday 2 September 2012

పట్టు కొమ్మ


ఒక సాయంసంధ్య

ఒక సాయంసంధ్య...!!

26/09/2008

ఏవో 
ఏవేవో భయాలు!
వికృతాలంకృతులు!!
ఆవిరులై, ఆహుతులై 
నిలువేత్తున కమ్మేస్తున్నాయి మానస భేతాలుని!
హిమ్సిస్తున్నాయి నవ హర్షావదులని!!

ఈవేళ 
నాలో, లోలో 
విలయమైన ఆశలు నిలయమై 
ఉసిగొల్పుతున్న ఉరికొయ్యల ఊపిరులు...

అదిగో 
అదిగదిగో! అలా...
రెక్కలొచ్చి హిమ శిఖరమరుగుచూ...
వెక్కిరిస్తున్నాయి నన్ను 
వేలివేస్తున్నామంటూ...

పైకి చూస్తే 
చలువ చంద్రుని వెన్నెలధారలు
తడుపుతూ, నను తడుముతూ 

పక్కకొస్తే...
కడలికెరటపు తరగలేమో ఎదుట 
కసురుతూ నను విసురుతూ 

ఎదుట చూస్తే 
ఎదలు కాలిన ఏముక గూళ్ళు 
పచ్చి నెత్తుట స్నానమాడిన 
పన్నిటి ముళ్ళూ... ఓ ఒళ్లు

కథలన్నీ కన్నీటి మడులే!
వ్యధ\లన్నీ చెప్పలేని ముడులే!!

అయ్యయ్యో ఆ కాటికాపరి 
తోక్కేసాడు జీవితాన్ని 
అణిచేసాడు ఆరిపోయిన అనురాగాన్ని!

ఆ ఉది ఎవరిది?
అక్కడే ఓ అనాథ శవం ఆగ్రహంగా చూస్తోంది!
ఆ ఉది తన నాధుడిదని మౌనంగా ఆక్రోశిస్తోంది!
నా చెవిలో గుసగుసల సడి చేస్తోంది.
దీనికి కారణం ఏ రాజకీయ తొక్కిసలాటో?!
ఏ కుల మతాల వెంపర్లాటో ?!
మరే స్వార్ధపు బాంబులపాటో ?!

అవేవీ కావంటూ...
నలిగిన ప్రతి నరాన్ని సవరించుకుంటూ...
చిరుగాలిలో చిందులేసుకుంటూ... 
చివరికి మిగిలేది నేనేనంటూ...
చెప్పింది గర్వంగా...!
విప్పింది లోకం గుట్టు చిత్రంగా!

ఎవరికేం మిగిలింది?              అంతా బూడిదేగా...!!! 

భార్గవి కులకర్ణి 

lalithadhrithiblogspotcom 


ఆగలేక సాగుతున్నా...



nenu


Saturday 1 September 2012

వేకువనై నే వేచిఉన్నా !!

నా జీవితానికి నే కారకురాలిని కానే!
నా రాతను మార్చిందీ నరకిరాతకులే!!
నే చేయనిదానికి నన్ను శిక్షించారే!?!

ప్రవళ్ళికా సంద్రంలో మునిగిపోయాయి కనులు!
ఈ ప్రళయ వికృతిలో నా పాదమెటు కదులు?!

ఎవరి మనసు రగిల్చి కన్నీటి లాల పోసిందో!?!
ఎవరి గుండె పగిలిన సడి నాకు జోల పాడిందో!?!

కలవరమై కళ్ళలోన 
కాటివైపు నడకలోన 
అక్షరమే వెక్కిరించిన 
నిబ్బరంగా గుండెనదిమి
నిప్పునంటి నిజాలన్నీ 
నివురునై నే ధాచివేస్తూ...
వేకువనై నే వేచిఉన్నా!!
కన్నెత్తి చూడలేక 
కనుమరుగు కాలేక 
నను వెక్కిరించే 
సమాజాన్ని నే 
వెలివేసుకుంటూ ...

చిరునవ్వుల తెర చాటున 
చిదిమిన గుండె దాచుకుని 
వేకువనై నే వేచిఉన్నా!!

వస్తావని - వసంతం 
తెస్తావని - వరాలు 
కురిపిస్తావని - వెన్నెల్లో 
ముంచేస్తావని - కన్నుల్లో 
కనిపిస్తావని - కలలు 
తీరుస్తావని - ఊహలు 
వేకువనై నే వేచిఉన్నా!!!


~భార్గవి  
17/07/2012