Saturday 26 January 2013

 Republic day, Independence day వస్థున్నాయంటే చిన్నతనంలో వాటితోపాటూ నెల రోజుల సంతోషాన్ని, ఉల్లాసాన్ని తీసుకోచ్చేవి. ఆ రోజు ఆరోగ్యం బాలేకపోయినా ఏదో కంపెనీ బోర్డు మీటింగ్ కు వెల్లాలన్నట్టుగా  ఉదయం 5గంటలకే  తయారయి కూర్చునేవాళ్ళం. క్లాసుల నిండా రంగురంగుల కాగితాలు కట్టుకుని, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, దేశ భక్తుల గురించీ ఉపన్యాసాలిస్తూ, దేశబక్తి గీతాలు ఆలపిస్తూ, పండ్లూ, చాక్లెట్లు పంచుకుని జాతీయ పండుగ సంబరంగా జరుకునేవాల్లమ్.  ఆ పండుగకోసం ఏడాదంతా ఎదురు చూస్తూ మన దేశ భక్తిని ఆరకంగా అయినా చాటుకునేవాళ్ళం.

ఈరోజుల్లో... పెరిగి పెద్దయి బుధ్ధెరిగాక ఆగష్టు 15 వస్తుందంటే ఆందోళన, 26జనవరి  వస్తోందంటే జ్వరం వస్తున్నాయి. ఎటునుండి ఎవరు ఎలాంటి ఉద్యమాలు చేస్థారో , ఎవరు మతోన్మాదం రేపుతారోనని భయం. అసలు ఆరోజు కాలేజీ కి వెళ్ళం. ఆ సందర్భంగా బైక్ నిండా పెట్రోలు నింపుకుని ర్యాలీ తిరుగుతాం. సెలవిచ్చారని స్నేహితులతో సినిమాలకు, షికార్లకు వెళ్తాం!
పార్టి వాళ్ళు వాల్ల జెండాలు వీధుల  నిండా ఎగురవేస్తారు. పార్టి ప్రచారం కోసమైనా శుభాకంక్షల పేరుమీద ఊరంతా తిరుగుతారు.
 ఉద్యోగం చేసేవాళ్ళయితే ఆ ఒక్క రోజైనా సెలవు దొరుకుతుందని సంతోషిస్తారు కూడా...!!

ఇదీ మన దేశభక్తి!
ఇదే మనకు ఆసక్తి!!
ఇంతే మన యుక్తి!!
గణతంత్ర దినోత్సవ సందర్బంగా ఇక ఇప్పటినుండయినా  ఏదో  మంచి దేశానికి,  దేశమనే మనకు జరగాలని గుండెల మీద చేయి వేసుకుని కోరుకుందాం!

                                                                                -భార్గవి 

No comments:

Post a Comment