Thursday 26 July 2012

ఎటునుండో

ఈ ధునిలో 
మనసులు కాలిన  ఉదిలో!
ఈ వనిలో 
గుండెల సవ్వడిలో!

అశ్రు పాన్పుపై అలసిన 
మరుపుల చాటున విరిసిన
 హర్షపు ప్రమిదల వెలుగులు ఎటునుండో!?!

అదిగో!
అటునుండే!!
వగచిన కన్నుల్లో సఖుని నీడలెరిగినపుడు...
హృది గదుల్లో ఉషోదయాలు పల్లవించినపుడు...
ఏకాంతంలో సాంత్వనమైనపుడు...  
నిట్టుర్పులో ఒధార్పైనపుడు... 
భార్గవి కులకర్ణి 
1/3/08
నువ్వు నువ్వుగా కనబడితే
నేను నేనుగా ఉండగలనా
మరి నీకెందుకీ బడాయి
నాలో కనపడలేదా నీకు లడాయి
మన బ్రతుకే  సన్నాయి

భార్గవి కులకర్ణి 
2007

Wednesday 25 July 2012

ఇదిగో! ఈ వలపే!


1/3/08
ఇదిగో!
ఈ వలపే!
హేమంతపు తలపై
పెదవులపై
హిమపు పలకరింపై
ఇంపై
కనుసొంపై
నాలో ఒదిగిన ఆశల మబ్బై
తబ్బిబ్బై
మాటలు రానివేళ మౌనమై
మమకారమై
పురి విప్పిన కల్లై
హరివిల్లై

ఉషస్సులెన్ని హృదయాన మేలుకోలిపిందో!!

~భార్గవి కులకర్ణి 

నాలో నువ్వుండాలి!


                                           
నాలో నువ్వుండాలి!
నీలో నేనిండాలి!!
యదే సగమవ్వాలి!
కథే మనమవ్వాలి!!
 ~భార్గవి కులకర్ణి 
21/08/07

మరువనని..

మనువుతో ఒకటైన 
                మన మనసుల సాక్షిగా...!
మనం అన్నది మరువనని 
                మరుజన్మకయినా...!!

Tuesday 24 July 2012

ఎవరు నీవు



కాలానికి ఒక వంతెన వేసి...
కన్నులకున్న పరదా తీసి...
ఎవరూ లేని ఏకాంతంలో...
నను పలకరిస్తావు!
                 ఎవరు నీవు?!!



నాకోసం వస్తావని...


ఓ జాబిలీ...!
నిన్నటి నిజాలు మరచి 
రేపటి కలలకై వేచివున్న 
నాకోసం వస్తావని...




సంధ్య మబ్బుల దారిచేసి,
చల్లని వెన్నెల కప్పి,
నీ  ఒడిలో నిదుర పుచ్చుతావని 
ఎదురు చూస్తూ...
          నీ నింగిని!!








వరద గూడు ఊయల  కట్టి 
            నీకు జోల పాడాలని....

పాలవెల్లులు జారిపడి 
నీ వెన్నెల్లో మునిగి
             పారిజాతాలవ్వాలని....

పౌర్ణమి నాటికి 
నాజల్లో అలంకరిస్తావని....

నా నుదుటున
తిలకమై మెరుస్తావని....

నాకోసం వస్తావని...

ఎదురుచూసే...
            నీ నింగిని !!

నీకూ తెలుసు



Wednesday 4 July 2012

ఏం చెప్పాలి ఓ లోకం?

lalithadhrithi.blogspot.com

ఏం చెప్పాలి ఓ లోకం ?
ఎవరిని అడగాలి ?
ఏ బంధం ఎవరినెలా కలుపుతుంది?
ఏ ముడులు ఎలా విప్పి మున్నేట ముంచుతుంది?

ఎవరికోసమో వేచి ఉన్న 
                కనులనడగాలి బదులు!
ఏ కబురు కోసం చూస్తున్న 
                మనసుకేందుకో దిగులు!
ఏ మాటల నీడలోన 
                ఏ నిప్పు దాగి ఉందో!
ఏ నిజం నిదురలేచి 
                ఎవర్ని కాల్చివేసిందో!
ఏ అనుబంధం చాటున 
                ఎన్నివేల నిట్టూరుపులో!
ఏ మూగ కనుల మాటు 
                దాచుకున్న వెన్ని ఓదార్పులో!
ఏ మౌనం గుండెలోన 
                ఎన్ని నిగూడమైన ఆశలో!

ఏం చెప్పాలి ఓ లోకం?!!
ఎవరిని అడగాలి??

ఎవరికీ చెప్పాలి?
నీవే లోకమనీ....
నీలాంటిదే లోకమనీ...

నువ్వు చూసే చూపులోన
                 ఆనందం విరజిమ్ము!
నువ్వు గుచచిన గుండెలోన
                కన్నీరై నిను కమ్ము!!
ఎందరున్నారు ?

మనసుకు, మాటకు 
కట్టుబడే మనుషులు మెసలే 
                                అసలే
                               మసలే
                               కొసరే లేరు ఈ రేయిల్లో!!!

                                                                                                        ~భార్గవి కులకర్ణి