Monday 25 June 2012

మమకారం చూపాల్సిన వాళ్ళు
కనీసం మానవత్వం కూడా మరచిపోతే......?
హృదయం ధ్రవించింది!

వేలుపట్టి నడక నేర్పిన వాళ్ళే
ముళ్ళకంచేలోకి తోస్తే......?
కళ్ళలో పొంగే నీరుకూడా యింకిపోయి
మనసు శిల  అయ్యింది!

కంటిపాపలా కాపాడాల్సిన వాళ్ళు
మూడో కంటికి వదిలేస్తే......?:
ఏమీ  చేయలేని అసహాయతతో
గుండెలో విరిగిన ముళ్ళు తీసి నెత్తురొడ్డి  నిలుచున్నాను!

అప్పుడప్పుడే  లోకం చూసే పసికూనకు
జీవితం ఓ పూలవనం అని చెప్పాల్సిన వాళ్ళే...
చూసే ఆ కళ్ళకు కుడా గంతలు కట్టి
అమావాస్య నిశి స్మశానంలో వదిలేస్తే ....
ప్రేతాత్మల ఘోష కన్నా,
పీడించే ధయ్యలకన్నా,
బతికున్న ఈ శవాలను చూసి...
అక్కడే కరిగి ఆవిరైపోవాలనిపించింది!


ఆవేదన నిండిన గుండె పగిలినా...
ప్రతిముక్కలో ఇంకా ప్రేమే నిండి ఉంది!
నా  పగిలిన గుండెలో ప్రేమను
స్వీకరించి, ఆదరించే వాళ్ళే కరువయ్యారు!

కష్టాల ఆహుతిలో కాలిపోయిన నా మనసుకు ...
గాయం మాన్పే ప్రియమైన చూపులు కూడా కరువయ్యాయి!

సంధిగ్ధత సంకెళ్ళు వేసుకుని, నిప్పులపై అడుగులు వేస్తూ...
విడుదలకై చూస్తున్న కాలాన్ని మోస్తూ

ఎవరికోసమో ఎదురుచూపుల
ప్రశ్నలు కళ్ళలో నింపుకుని
సాగుతున్న నా జీవన గమనమిది!!

                                                                 -భార్గవి కులకర్ణి 

Friday 22 June 2012

నేస్తమా! నీలో....


నేస్తం!

మాటలు చాలని మది స్పందనకు,
నువ్వు పంచిన చిరునవ్వు మాత్రం తోడుగా ఉంది !
ఎందరికి పంచినా తరగని వరమిచ్చావు నేస్తం!!

కలలా  మన స్నేహం చెదిరిపోయినా
కన్నుల్లో నీ రూపం కొలువై ఉంది!
కన్నీళ్ళలో నీ  రూపం కరిగిపోనివ్వను నేస్తం !!

అందరాని జాబిలివై నువ్వు
అనంతాకాశంలో ఒదిగిపోయావు!
నీ చెలిమి చల్లని వెన్నెలై నన్ను చేరుకుంది నేస్తం!!
                                                 
                                                                     ~భార్గవి కులకర్ణి 

నేస్తం లేని జీవితం


ఇది ప్రణయం కాదంటావా!?!



వేచి ఉన్నా!



Promise me




ఆకాశం వైపు చూసి  పిలుస్తూనే ఉంటా!!
ఆఖరి పిలుపైన నువ్వు వింటావనే  ఆశతో!!

చిరుగాలితో కబుర్లు చెబుతూనే ఉంటా!
ఏదో స్వరంతో చేరి నీ చెవి సోకుతుందని!!

సంద్రానికెపుడు విన్నవించుకుంటా!
నా కన్నీటిని తనలో కలుపుకుని నిన్ను అభిషేకించమని!!

నిదురకు సెలవిచ్చి కలలను స్వాగతిస్తా!
కళ్లారా చూడలేని నిను కలలో అయినా చేరనివ్వమని!!

-భార్గవి  కులకర్ణి 

Friday 15 June 2012

నాలో నేను


Kaalikaamba Shathakam

అన్న మయములైన వన్ని జీవమ్ములు!
కూడు లేక జీవ కోటి లేదు.
కూడు తినెడి కాడ కులబేధ మేలకో!
కాళికాంబ! హంస కాళికాంబ!

                                                        -పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

Monday 4 June 2012

నా జీవితము - కృష్ణ పక్షము


వింతగా దోచు నాడు జీవితము నాకే! 
జిలుగు వెన్నెలలతో చిమ్మ చీకటులతో,
అమల మోహన సంగీత మందు హృదయ 
దళన దారుణ రోదన ద్వనులు విందు:
వక్రగతి  బోదు చక్కని పథము నందె ,
రాజ పథమునకై కుమార్గమున జూతు:
గరలమే తిందు కడుపార నెరిగి ఎరిగి:
ఆవల ద్రోతు చేతులార నమృతరసము :
విస మమృతమట్టు లమృతంబు విసము రీతి
చిత్ర చిత్ర గతుల మార్చు జీవితంబు!
 కృష్ణ శాస్త్రి  సాహిత్యం 
   కృష్ణ పక్షం   

మహా ప్రస్థానం ( పరాజితులు )