Monday 26 November 2012

Street children

27/11/12

చిరిగిన కాగితం బతుకులు...
కల్లల లోకపు కలం విదిలించిన
కన్నీటి సిరా చుక్కలు...
చిరునవ్వుల పట్టుదారాలు!

కర్మలు తెలియని 
కల్మషమెరుగని
కారు మబ్బులను
కనుదోయి దాచిన...

కాటుకలంటని
చీకటి చూపులు!

పాలపుంతలు,
పన్నీటి చినుకులు,
పలకరింపుతో
ఒలికిస్తారు!

కీచక కరవాలంతో
అరాచకమింక ఆపండి!
కలం పట్టుకు, పదం వద్దకు
పథం చూపుతు నడపండి!

ఎగిరిపోయే సీతాకోక
చిలుక రెక్కలు వదలండి!

మెరిసే చుక్కలనంటే
విరిసే నవ్వుల పువ్వులు
కోసిరిన ఆనందాలను
ఆస్వాదించండి!
-భార్గవి కులకర్ణి 
లలితద్రితి.బ్లాగ్స్పాట్.కాం 

No comments:

Post a Comment