Wednesday 31 July 2013

నన్ను జయించిన నన్ను
నిన్న ఓడించలేదిక...!!
నీ చేతలు నా చేతుల్లోంచి ఎపుడో జారిపోయాయ్!!

Monday 29 July 2013

బ్రతుకో చినుకు!!


మబ్బు నుండి జారి మట్టిలో
కలిసేవరకే...!బ్రతుకో చినుకు!!
-భార్గవి/ 29-07-13
పగటికి, రేయికి
రంగుల వంతెన బ్రతుకు
-భార్గవి/ 29/07/13

తప్పిపోయిన లోకం!



ప్రేమ రంగు మరచిపోయింది 
చీకటివెలుగుల్లో తప్పిపోయిన లోకం!


-భార్గవి/ 29-07-13

Saturday 27 July 2013

నీలో కనిపించని దూరాలు!

1
నీలో కనిపించని దూరాలు!
ముడేస్తూ నా చిరునవ్వు!!


2
నీలో కనిపించని దూరాలు!
చేరనివ్వని ప్రణయ సమీరాలు!!

3
నీలో కనిపించని దూరాలు!
చెరిపేస్తా నన్ను లోనికి రానివ్వు!!

4
నీలో కనిపించని దూరాలు!
యుగాల పయనంతోను దాటలేని నేను!!
5
నీలో కనిపించని దూరాలు!
ఒక్క ఉచ్చ్వాసతో కరిగిస్తా !!

6
నీలో కనిపించని దూరాలు!
అంటరానితనం, అంతరాలు లేవురా కన్నా!!


పదాలే కరువయ్యాయి నాకు!



పదాలే కరువయ్యాయి నాకు!
పెదాల్లో సుధా ఝరులు పొంగేవేళ!!

లెక్కలంటే.... చుక్కలే నా చిన్నప్పుడు!!



లెక్కలంటే.... 
చుక్కలే నా చిన్నప్పుడు!!

నీలో కనిపించని దూరాలు! నాలో వినిపించని ఆత్రాలు!!



నీలో కనిపించని దూరాలు!
నాలో వినిపించని ఆత్రాలు!!

భార్గవి  /  సిగ్గు

సిగ్గు...!
నీడల చాటున నిప్పు కణికలా
భుగ భుగమంటుంది, మదిని
తాండవిస్తోంది, కనుల
వెలికితీస్తోంది, కళల
కరిగిపోతోంది, శిశిర స్వప్నాల
ఆవరిస్తోంది, నిధ్రావతి నిశ్వాసల
పగిలిపోతోంది, ఎదర చిరునవ్వుల
తడిసిపోతోంది, విరహ తాపాల
తట్టిలేపింది, ఎదను పరవళ్ళు
శృతిని చేసింది, నుదుటి రాతల
పూలు పూసింది, నవ వసంతం
చేరుకుంటుంది, మధువుల పెదవుల
రాలిపోతుంది, హృదయపు మడుగుల
నిలిచిపోతుంది, మైత్రికి లిపిలా...
దాగి ఉంటుంది!

ఎద మధురిమల్లో స్వరమై అది!
గుండె గుడుళ్లో గంటై మ్రోగుతుంది!!
మది కోవెల్లో మంచుకొమ్మగా ఇది!!!

లెక్క

భార్గవి/ లెక్క / 27/07/13

నన్ను నాతో కూడేస్తా!
నన్ను నాతో తీసేస్తా!
నువ్వు థో నన్ను గుణించి
భావాల గుణింతాలు రాస్తా...!
బాధలను డివైడ్ చేస్తా...!
శేషం ఏం మిగిలింది?
నువ్వా... నేనా... ?!
ఏంటీ లెక్క ...

ఇంటిగ్రేషనా?
డిఫరెన్సియేషనా?
చెప్పకుండానే పంపావే...
అంకెలనో, సంఖ్యలనో
దిద్దుకుంటే సాగుతుందా?
గుర్తులు లేకుండా
లెక్కెలాసాగుతున్దోయ్
అడుగడుగునా
ఫార్ములాలు రాసుకుంటూ,
రేఖలు గీసుకుంటూ,
గుర్తులు వేసుకుంటూ పోవాలి లెక్క!
నిన్ను నువ్వు
గ్రాఫ్ గీసుకుని సరి చూసుకో!
ఆన్సరులొచ్చేవి కొన్ని!
అనంతమయ్యేవి ఇంకొన్ని!!

అరసగమో, అందులో సగమో చేసి
నీకు ఆన్సరు తెలుసునంటే ఎట్లా
ఎవరు పూర్తి చేస్తారు నీ లెక్క
తప్పైతే కొట్టేసి మళ్ళీ మొదలుపెట్టు
ఇన్ఫినిటి తో శూన్యాన్నేదో చేసెయ్
ఆకాశమంత అవుతుంది నీలెక్క!
ఆన్సరు దొరక్కపోతుందా
జామెట్రీ, ట్రిగనమేట్రీ
ఫార్ములాలన్ని వేసెయ్
అనేకానేక అభ్యాసాలు పూర్తవుతాయ్!
జవాబు నిరాశగా ఏం మిగలదులే!

ఎన్ని ఫార్ములాలు వేసినా
ఎన్ని పేజీలు చేసినా
అదే ఇన్ఫినిటీ గానే ముగింపంటుంది!!

27/07/13

Thursday 25 July 2013

తపాలా బంట్రోతు

తపాలా బంట్రోతు

మైడియర్‌ సుబ్బారావ్‌
కనిపించడం మానేశావ్
ఏ(విటీ... పోస్టుమాన్‌ మీద గేయం వ్రాయాలా!

అందమైన అమ్మాయి మీద కాని
చందమామ మీద కాని
వంద్యుడైన భగవంతుడి మీద కాని అ
వంద్యుడైన ధీరనాయకుడు మీద కాని
పద్యాలల్లమని మన పూర్వులు శాసిస్తే
ఎక్కడి పోస్ట్‌మానో యీ గోల
ఈ సాయంత్రం వేళ

ధనవంతుణ్ణి స్తుతి చేస్తే
పది డబ్బులు రాలుతాయి
సచివోత్తముణ్ణి స్మరిస్తే
పదికళ్ళు మనమీద వాలుతాయి
ఈ నీ ప్రార్థన కడుంగడు అసభ్యం సుబ్బారావ్
ఉత్త పోస్టుమేన్ మీద ఊహలు రానేరావు

మూడవ పంచవర్ష ప్రణాళిక
ఏడవ వన మహోత్సవ దినం

బిర్లా దాల్మియా
సినీమా దలైలామా
యుద్ధం పరమార్థం
రాజులూ, రాజ్యాలూ, తారుమార్లూ
ఇటువంటివి చెప్పు
మరి చూడు నా తడాఖా

మృదు మాధ్వీ పదలహరీ
తరంగ మృదంగ విలసద్భంగీ
మనోహరాలౌ కావ్యాల్ గేయాల్
కొల్లలుగా వ్రాస్తాను

కానీ, తపాలా బంట్రోతు మీదా
హవ్వ!
ఎండలో వానలో
ఎండిన చివికిన
ఒక చిన్నసైజు జీతగాడు
చెవిలో పెన్సిల్
చేతిలో సంచీ
కాకీ దుస్తులు
అరిగిన చెప్పులు
ఒక సాదాసీదా పేదవాడు
ఇంటింటికీ
వీధివీధికీ
ప్రతిరోజూ తిరిగేవాడు- ప్రైమ్మినిస్టరా ఏం

అయితే చూడు
ఆ కిటికీలో రెండు విచ్చిన కలువల్లాంటి కళ్ళు
ఆ వీధి మొగవైపే ప్రసరిస్తోన్న చూపుల ముళ్ళు
ఆ కళ్ళలో ఆతృత
ఆ గుండెల్లో గడచిన
దేశాంతర గతుడైన ప్రియుడి వార్త కోసం
అమ్మాయీ !
పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి
పళ్ళెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించాలనే
నీ ఆశ నాకు అర్ధమయింది.

అందుకే
చూపులు తుమ్మెద బారులు కట్టి
నీ కోర్కెలు గజ్జెలవలె ఘలంఘలించి
వీధి వీధినంతా మేల్కొలుపుతున్నాయి
వీధి వీధినంతా కలయజూస్తున్నాయి
అడుగో పోస్ట్ మాన్!
ఒక్క ఉదుటున వీధిలోకి నువ్వు
అతని మొహం మీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు
వెళ్ళిపోతున్న తపాలా బంట్రోతు వెనుక
విచ్చిన రెండు కల్హార సరస్సులు

గుడిసె ముందు కూర్చున్న పండుముసలి అవ్వ
గడచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలవ
కనపడీ కనపడని కళ్ళల్లో
కొడిగట్టిన ప్రాణపు దీపంతో
తాను కనిన తన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం
తన బాబు తన ఊపిరి
అస్సాం రైఫిల్సులో సోల్జర్ సిమ్మాచలం
కోసం నిరీక్షణ
క్షణ క్షణ ప్రతీక్షణ
ఒక కార్డు ముక్క వ్రాశాడా
బంట్రోతూ వెళ్ళు వెళ్ళు త్వరగా
ముసలిదానికి మంచివార్త నందించు
ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని పరికించు
దూరభారాన ఉన్న కుమారుని కోసం
వగచే తల్లికి
చేరువ చేరువౌతూన్న నువ్వొక ఊరట
దగ్గర దగ్గరౌతున్న మిత్రుని లేఖ కోసం
నిలిచిన తరుణుడికి నీ రాక ఒక బాసట
వర్తకుడికి నర్తకుడికి ఖైదులో దొంగకి హంతకుడికి
ఉద్యోగశప్తుడైన నవీన యక్షునికి
మనిషికి రాక్షసునికి
నువ్వు
దూరాల దారాల్ని విచిత్రంగా
ఒకే నిముషము
అనే కంచె చుట్టూ త్రిప్పగల నేర్పరవి .. కూర్పరివి...
అదృష్టాధ్వం మీద నీ గమనం
శుభాశుభాలకి నువ్వు వర్తమానం
నీ మాజిక్ సంచిలో
నిట్టూర్పులు నవ్వులు పువ్వులు
ఆనందాలు అభినందనలు ఏడుపులు
ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో
ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!

కొందరికి పరిచయమైన నవ్వు
కొందరికి తలపంకించిన నవ్వు
కొన్నివైపులకి చూడనే చూడవు
అందరికీ నువు ఆప్త బంధువుని
అందరికీ నువు వార్త నందిస్తావు
కానీ నీ కథనం మాత్రం నీటిలోనే మథనం
అవుతూంటుంది


ఇన్ని యిళ్ళు తిరిగినా
నీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపలేదు
ఇన్ని కళ్ళు పిలిచినా
ఒక్క నయనం నీ కోటుదాటి లోపలకు చూడదు
ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు

- 1959

Sunday 21 July 2013

పూర్తవ్వని పుస్తకం

భార్గవి/ 22/07/13 - 11am/ పూర్తవ్వని పుస్తకం  



ఎందుకాగిందో కలం...!

ఈ పదం దగ్గర...!
చేరువ లేని కాలాన
దూరదూరాన...
పూర్తవ్వని పుస్తకంలో
ఏకాకి ప్రేతాత్మలా

ఎందుకాగిందో కలం...!
ఈ పదం దగ్గర...!
అడిగిన ప్రశ్నే...
అడుగడుగూ
చెప్పిన బదులే
ప్రతి పథమూ...

ముసుగు తీసుకుని
ముళ్ళ కిరీటాలు ధరించి
లేని నవ్వులు పూయించి
రాని భాషనూ భరించి
కాలాన్ని గుప్పిట బిగించి
తడిసిన గుండెను పిండి
వర్షం కురిపించి
మది భారం తగ్గించి
ఎడారిలో ఏకాకిలా..
ఎందుకాగిందో కలం...!
ఈ పదం దగ్గర...!

పగలూ, రాత్రీ కలిసే తీరం
కాలంలోనే దాక్కుంది!
వెలుగూ, చీకటి కలిసే చోటు
చూపుల్లోనే చిక్కింది
వచ్చిందెపుడో, పోయిందెపుడో...
జన్మా, కర్మా గడిచిందెపుడో...

జీవిత పుస్తకం పూర్తవకుండా
ఎందుకాగిందో కలం...!
ఈ పదం దగ్గర...!

నేను కాగితం! నువ్ కలం!!
నీ ప్రేమతో నా జీవితం కావ్యమవ్వాలని...
                          22/07/13

Friday 19 July 2013

నిశి కి శశి! బుగ్గ కు సొట్ట!!




నిశి కి శశి!
బుగ్గ కు సొట్ట!!

మంచికి, చెడుకు మధ్య తేడా నమ్మకం!!


మంచికి, చెడుకు మధ్య తేడా నమ్మకం!!
1(బ్రతికు) ఉన్న వారికి దండాలు!
           పోయినవారికి  దండలు!!

2(డబ్బు)ఉన్న వారికి దండాలు!
             లేని వారికి  దండలు!!
19/07/2013

Monday 15 July 2013

ఏమౌతావని?


ఏమౌతావని? నీకోసం వేచి... 
ఎదురుచూపుల సంకెళ్ళు వేసుకున్నా నేను!?!

Sunday 14 July 2013

నేను కాను దాసోహం!!




పరీక్షిస్తున్న దైవం!
పరిహసిస్తున్న లోకం... నేను కాను దాసోహం!!
13/07/13

నా లోపల నన్నెవరో బంధించేసారు!



నా లోపల నన్నెవరో బంధించేసారు!

నీ గుప్పిట్లో ఊయలలూగే... నా మౌనం సవ్వడి నీ మొబైల్లో...!!




నీ గుప్పిట్లో ఊయలలూగే...
నా మౌనం సవ్వడి నీ మొబైల్లో...!!

Friday 12 July 2013





నమ్మకం ఎపుడో నవ్వులపాలైపోయింది!!
-by భార్గవి 
13/07/2013