Saturday 26 January 2013

 Republic day, Independence day వస్థున్నాయంటే చిన్నతనంలో వాటితోపాటూ నెల రోజుల సంతోషాన్ని, ఉల్లాసాన్ని తీసుకోచ్చేవి. ఆ రోజు ఆరోగ్యం బాలేకపోయినా ఏదో కంపెనీ బోర్డు మీటింగ్ కు వెల్లాలన్నట్టుగా  ఉదయం 5గంటలకే  తయారయి కూర్చునేవాళ్ళం. క్లాసుల నిండా రంగురంగుల కాగితాలు కట్టుకుని, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, దేశ భక్తుల గురించీ ఉపన్యాసాలిస్తూ, దేశబక్తి గీతాలు ఆలపిస్తూ, పండ్లూ, చాక్లెట్లు పంచుకుని జాతీయ పండుగ సంబరంగా జరుకునేవాల్లమ్.  ఆ పండుగకోసం ఏడాదంతా ఎదురు చూస్తూ మన దేశ భక్తిని ఆరకంగా అయినా చాటుకునేవాళ్ళం.

ఈరోజుల్లో... పెరిగి పెద్దయి బుధ్ధెరిగాక ఆగష్టు 15 వస్తుందంటే ఆందోళన, 26జనవరి  వస్తోందంటే జ్వరం వస్తున్నాయి. ఎటునుండి ఎవరు ఎలాంటి ఉద్యమాలు చేస్థారో , ఎవరు మతోన్మాదం రేపుతారోనని భయం. అసలు ఆరోజు కాలేజీ కి వెళ్ళం. ఆ సందర్భంగా బైక్ నిండా పెట్రోలు నింపుకుని ర్యాలీ తిరుగుతాం. సెలవిచ్చారని స్నేహితులతో సినిమాలకు, షికార్లకు వెళ్తాం!
పార్టి వాళ్ళు వాల్ల జెండాలు వీధుల  నిండా ఎగురవేస్తారు. పార్టి ప్రచారం కోసమైనా శుభాకంక్షల పేరుమీద ఊరంతా తిరుగుతారు.
 ఉద్యోగం చేసేవాళ్ళయితే ఆ ఒక్క రోజైనా సెలవు దొరుకుతుందని సంతోషిస్తారు కూడా...!!

ఇదీ మన దేశభక్తి!
ఇదే మనకు ఆసక్తి!!
ఇంతే మన యుక్తి!!
గణతంత్ర దినోత్సవ సందర్బంగా ఇక ఇప్పటినుండయినా  ఏదో  మంచి దేశానికి,  దేశమనే మనకు జరగాలని గుండెల మీద చేయి వేసుకుని కోరుకుందాం!

                                                                                -భార్గవి 

Wednesday 9 January 2013

రాయి అయిన నా గుండె చాటున
ప్రేమ కరిగిన సెలయేటిలో
కలువపువ్వులా నువ్వు నవ్వగ
కళలు పండు వెన్నెల కాసి
కరిగి తిరిగి నీ చెంత చేరెను.

చెప్పు ప్రియా... ఈ చెమరింత ఏమిటి?
నా ప్రేమ వెన్నెల కౌగిలింతల
 తపన రాసిన విరహమా?

నను చేరలేవని గాలి నవ్వగ
రిక్క రాల్చిన చిహ్నమా?

చెప్పు ప్రియా ఈ చినుకు మాటున
గాయపడినది నీ హృదయమేనా?
కలలు రాసిన ప్రణయమౌనా ?

Saturday 5 January 2013

ఒంటరినై ఈ ఏకాంతంలో ...
విందుకు పిలిచిన సంగతులతో
వింత చర్చలను విహంగాలతో
వేల కాగితపు మణులు, నిధులతో
నేనిచ్చటనే  నాకోసం చూసి
వెతికిన గుండెకు వేదన మిగిల్చి
వెలగని దీపపు వెర్రి ఆశనై
వెలివేయకనే తోచని దారుల
చేరిన గమ్యం చెరిపివేసుకుని
 సాగని బాటల ముళ్ళు పెట్టుకుని
నవ్వుల పువ్వులనదిమి చిదుముకుని
సాగనివ్వని స్వాగతాలతో
సంధె మళ్ళిన నిట్టూర్పులతో
నాతో రానను అడిఆశలను
గొంతు నులిమి నేనిటు లాక్కుంటూ
పరిగెడుతున్నా పంజరంలోనే
పయనమే లేని గమ్యం కోసం!
తెలియగరాని తొలివేకువకై...!!
బాధకు జ్ఞాపకాలంటే  చాలా ఇష్టం.
సంతోషానికి మరచిపోవడం అంటే ఇష్టం!
అందుకే బాధ ఎప్పుడూ జ్ఞాపకాలను జారిపోనివ్వదు.
ఆనందానికి ఎంత గర్వం లేకపోతే బాధలను మరచిపోయి మల్లీ వెతుక్కుంటుంది?!!
నేను ప్రేమించే సంతోషం నాతో ప్రేమ పంచుకుని సంతోషించదు.
సంతోషం తను ఉంది కూడా బాధకు నన్ను చేరువ చేస్తుంది. ఎందుకంటే బాధకు నేనంటే చాలా ప్రేమ. అది నేను అర్థం చేసుకోకపోయినా ...
నా సంతోషం బాధ ప్రేమను బాగా అర్థంచేసుకుని థనివ్వలేని బాధను కూడా బాధకే అప్పగించింది. బాధ్యతగా
 నన్ను బాధపెట్టమని...
ప్రేమతోనా...!?!
 లేదా
సంతోషాన్ని కూడా ప్రేమించి కల్తీచేసానని కక్ష్యతోనా...?!!
ఎందుకైనా...
ఏమిటైనా...
నేను ప్రేమించిన సంతోషం నాతో నాలుగునాళ్ళు కూడా ఉండలేదు.
నన్ను ప్రేమించిన బాధ వద్దన్నా నాతో జీవితాంతం ఉంటానంది.