Wednesday 20 March 2013

శబ్బాష్ రా శంకరా!

భోళా బాలాగా.... 

-తనికెళ్ళ భరణి 
శంకర అంటేనే నాకు 
శక్కర లెక్కనె ఉంటధయ్య 
శివునాగ్నైతది... సీమనైత... 
శబ్బాష్ రా... శంకరా!

గణపతి దేవుడు నీకు బిడ్డ
ఖబరస్తానేమొ నీ అడ్డ..!
నీ తత్వాల్ పాడతా-కాళ్ళమీద బడ్డా 
శబ్బాష్ రా... శంకరా!!

పుట్టించేదా బ్రెమ్మసామి
ఇష్ణుమూర్తేమో నడ్పిస్తడా !
నువ్వొకినివెర పండబెట్టేడిది 
శబ్బాష్ రా... శంకరా!!


ఆదా చెంద్రమ నెత్తిమీద 
నీలో ఆదానేమొ అమ్మాయే !
పూరా జ్ఞానివి నీకు సాటెవరురా 
శబ్బాష్ రా... శంకరా!!


బొందల్ గడ్డల పంటవంట 
నీ కన్నంత మంతంట !
నీ ఇల్లూ ఇల్లాల్ సల్లగుంటరట
శబ్బాష్ రా... శంకరా!!


నేనా ఎద్దును, ఒట్టి మొద్దును 
నువ్వు డోల్గోడ్తె నేనాడ్త !
గందుకె పశుపతివంటరయ్య నిన్ను 
శబ్బాష్ రా... శంకరా!!


నీ అంతేడనొ తెల్సుకోనీకి 
కింద మీధైన్రు తోటోళ్ళు !
'అంతే' నీవని తెల్సుకోరేందిరా 
శబ్బాష్ రా... శంకరా!!


చెంబెడు నీళ్ళు పోస్తే ఖుష్...!
చిటికెడు బూడ్దే పూస్తే బస్...!!
వొటి పుణ్యానికి మోక్షమిస్తవు గదా 
శబ్బాష్ రా... శంకరా!!

No comments:

Post a Comment