Monday 25 June 2012

మమకారం చూపాల్సిన వాళ్ళు
కనీసం మానవత్వం కూడా మరచిపోతే......?
హృదయం ధ్రవించింది!

వేలుపట్టి నడక నేర్పిన వాళ్ళే
ముళ్ళకంచేలోకి తోస్తే......?
కళ్ళలో పొంగే నీరుకూడా యింకిపోయి
మనసు శిల  అయ్యింది!

కంటిపాపలా కాపాడాల్సిన వాళ్ళు
మూడో కంటికి వదిలేస్తే......?:
ఏమీ  చేయలేని అసహాయతతో
గుండెలో విరిగిన ముళ్ళు తీసి నెత్తురొడ్డి  నిలుచున్నాను!

అప్పుడప్పుడే  లోకం చూసే పసికూనకు
జీవితం ఓ పూలవనం అని చెప్పాల్సిన వాళ్ళే...
చూసే ఆ కళ్ళకు కుడా గంతలు కట్టి
అమావాస్య నిశి స్మశానంలో వదిలేస్తే ....
ప్రేతాత్మల ఘోష కన్నా,
పీడించే ధయ్యలకన్నా,
బతికున్న ఈ శవాలను చూసి...
అక్కడే కరిగి ఆవిరైపోవాలనిపించింది!


ఆవేదన నిండిన గుండె పగిలినా...
ప్రతిముక్కలో ఇంకా ప్రేమే నిండి ఉంది!
నా  పగిలిన గుండెలో ప్రేమను
స్వీకరించి, ఆదరించే వాళ్ళే కరువయ్యారు!

కష్టాల ఆహుతిలో కాలిపోయిన నా మనసుకు ...
గాయం మాన్పే ప్రియమైన చూపులు కూడా కరువయ్యాయి!

సంధిగ్ధత సంకెళ్ళు వేసుకుని, నిప్పులపై అడుగులు వేస్తూ...
విడుదలకై చూస్తున్న కాలాన్ని మోస్తూ

ఎవరికోసమో ఎదురుచూపుల
ప్రశ్నలు కళ్ళలో నింపుకుని
సాగుతున్న నా జీవన గమనమిది!!

                                                                 -భార్గవి కులకర్ణి 

No comments:

Post a Comment