Monday 4 June 2012

నా జీవితము - కృష్ణ పక్షము


వింతగా దోచు నాడు జీవితము నాకే! 
జిలుగు వెన్నెలలతో చిమ్మ చీకటులతో,
అమల మోహన సంగీత మందు హృదయ 
దళన దారుణ రోదన ద్వనులు విందు:
వక్రగతి  బోదు చక్కని పథము నందె ,
రాజ పథమునకై కుమార్గమున జూతు:
గరలమే తిందు కడుపార నెరిగి ఎరిగి:
ఆవల ద్రోతు చేతులార నమృతరసము :
విస మమృతమట్టు లమృతంబు విసము రీతి
చిత్ర చిత్ర గతుల మార్చు జీవితంబు!
 కృష్ణ శాస్త్రి  సాహిత్యం 
   కృష్ణ పక్షం   

No comments:

Post a Comment