మాటలు చాలని మది స్పందనకు,
నువ్వు పంచిన చిరునవ్వు మాత్రం తోడుగా ఉంది !
ఎందరికి పంచినా తరగని వరమిచ్చావు నేస్తం!!
కలలా మన స్నేహం చెదిరిపోయినా
కన్నుల్లో నీ రూపం కొలువై ఉంది!
కన్నీళ్ళలో నీ రూపం కరిగిపోనివ్వను నేస్తం !!
అందరాని జాబిలివై నువ్వు
అనంతాకాశంలో ఒదిగిపోయావు!
నీ చెలిమి చల్లని వెన్నెలై నన్ను చేరుకుంది నేస్తం!!
~భార్గవి కులకర్ణి

No comments:
Post a Comment