Friday 21 October 2011

Samethalu

సామెతలు 
౧. ఇల్లు అలకగానే పండుగ కాదు. 
౨. ముందుంది ముదుసల్ల పండుగ.
౩. కాకి ముక్కుకు దొండపండు.
౪. పిల్లను చంకన పెట్టుకుని ఊరంతా వెతికినట్లు.
౫. ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు.
౬. చెల్లని రూపాయికి గీతలెన్నో.
౭. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు.
౮. నిండు కుండ తోనకదు.
౯.అడగనిదే అమ్మైనా పెట్టదు.
౧౦.మెత్తనోళ్ళను చూస్తే మొట్టబుద్దియినట్లు.  
౧౧. ముందు వచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి.
౧౨. ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడతది. అన్ని ఉన్న విస్తరి అనిగిమనిగి ఉంటది.
౧౩. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరిచ్చినట్టు.
౧౪.మంది మాటలు విని మారుమనువుకు పోతే మల్లోచ్చేసరికి ఇల్లగామాయే.
౧౫. నేల విడిచి సాము చేసినట్టు.
౧౬. మింగ మెతుకు లేదుగాని మీసాలకు సంపెంగ నూనె రాసినట్టు.
౧౭. చెప్పేవాడికి వినేవాడు లోకువ.
౧౮. తను దూర సందు లేదు. మెడకో డోలు.
౧౯. నిప్పు లేనిదే పొగ రాదు.
౨౦. రెంటికి చెడ్డ రేవడి.
౨౧. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు.
౨౨. ఒల్లోంగ లేనోడు దొంగల్ల కలిసినట్టు.
౨౩. అత్త మీది కోపం దుత్త మిద చూపించినట్టు.
౨౪. మొగుడు కొట్టినందుకు కాదు. తోటికోడలు నవ్వినందుకు.
౨౫. పోట్టివానికి పుట్టెడు బుద్దులు.
౨౬. పైన పటారం. లోన లొటారం.
౨౭. ఊరంతటిది ఒక దారి. ఉలికి పిట్టది ఒక దారి.
౨౮. కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా.
౨౯. గుమ్మడికాయల దొంగ అంటే బుజాలు తడుముకున్నట్టు.
౩౦. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
౩౧.చిత్తం శివునిమీద. భక్తి చెప్పులమీద. 



No comments:

Post a Comment