Monday 24 October 2011

Bukkulu(maha prasthanam)

బుక్కులు
SrI Sri 
కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిల్లా-
                హీనంగా చూడకు దేన్నీ!
           కవిత మయమేనోయ్ అన్ని!
రొట్టెముక్కా, అరటి తొక్కా, బల్ల చెక్కా-
          నీ వేపే చూస్తూ ఉంటాయ్!
          తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుఱ్ఱపు కళ్ళెం-      
                           కాదేదీ కవితకనర్హం!
                           ఔనౌను శిల్పమనర్గం!
ఉండాలోయ్ కవితావేశం!
కానీవోయ్ రస నర్దేశం!
దొరకదటోయ్ శోభాలేశం!
కల్లంటు ఉంటె చూసి,
వాక్కుంటే వ్రాసి!
ప్రపంచమొక పద్మవ్యూహమ్!
కవిత్వమొక తీరని దాహం!
-14-4-1934
శ్రీరంగం  శ్రీనివాస రావు.

No comments:

Post a Comment