Saturday 29 October 2011

Hamsa lekha

హంసలేఖ!

జగమంతా దీపాల వెలుగు నిండగ
వేణుగోపాలుడు ఆనంద పరవశుడై ఉండగా
చమురు ఇంకిపోయిన కనులు బారేడంత చేసి
నాదుని రాక కోసం, అతని జాబు కోసం
ఎదురు చూస్తోంది శమంతక మణి ధారిని!!

తన పదహారేళ్ళ పడుచుదనపు నివాళి సిద్దం
వేలవేల ఆశాజ్యోతులు ఆ హంసలేఖ
నీ చూపు తాకి పరిమళిస్తే గాని
ఆ మగువ కంట ఆనందపు చమురు నిండదు
నిచ్చెలి జాంబవతి విరహం
నీ చిగురు పెదవుల జారి శ్రావ్యమైతేగాని
ఆ ప్రాణదీపం వెలగదు.

ఓ గోవర్ధన గిరిధారీ! నీ వేళ్ళతో
చిలిపి చిరునవ్వుల పదాలునింపి
రాసలీలల రాయబారమంపి
కలవరింతల కన్నె మనస్సులో
దీపావళి జిలుగులు చూడరాదా....?!
రాధా మనోహరా! 
 -భార్గవి కులకర్ణి 

No comments:

Post a Comment