Thursday, 18 October 2012

గుండె గొంతుదాటి వచ్చి ప్రేమను పంచాలనుకుంటోంది!
పెంచుకోలేని మౌనం గుటకలువేస్తూ దాచుకుంటోంది!
ప్రాణం పరితపిస్తూ తనను పలకరించుకుంటోంది!
మరణం పరితపిస్తూ చేరే తరుణం చెరువౌతోంది!
తనలోని ప్రాణం విలవిలలాడుతోంది!
తల్లి తన పేగు ముడివేసుకు దాచుకుంటోంది!

ఆశ



రాతిగుండె కరిగి కన్నీరై పోయినా...
పగిలిపోయి ముక్కలై మాట నెగ్గనివ్వదు!
ఏ కథకేన్ని మలుపులిచ్చినా ...
ఏ కదలిక పెనుతుఫాను తెచ్చినా...
ఆశొకటే మిగిలి పోస్తుంది ఊపిరిని...!!

నవ్వులు కురిపించాలని



Tuesday, 4 September 2012

అనుభవించు

12/11/09
అనుభవించు...!
ఆనందాలు
అనుబంధాలు
ధు:ఖాలు
సుఖాలు
ఆప్యాయతను
శత్రుత్వాన్ని కూడా...!!
ఓ మనసా...
ఎందుకింత బెరుకు?
 నీకు నేను తోడు
నాకు అనంతకోటి మనసుల
ప్రేమ తోడు!!

కరిగించు స్వప్నాన్ని, దు:ఖాన్ని
జయించు జీవితాన్ని!
చేరుకో నీ తొలి గమ్యాన్ని!!

కరిగించు స్వప్నాన్ని...
జయించు దు:ఖాన్ని...
చేరుకో జీవిత గమ్యాన్ని...!!

భార్గవి కులకర్ణి 

భిక్షువర్షీయసి

భిక్షువర్షీయసి

 దారిపక్క చెట్టు క్రింద
ఆరిన కుంపటి విధాన
కూర్చున్నది ముసల్దోకతె
మూలుగుతూ ముసురుతున్న
ఈగలతో వేగలేక

ముగ్గుబుట్టవంటి తలా
ముడతలు తేరిన దేహం
కాంతిలేని గాజుకళ్ళు
తనకన్నా శవం నయం

పడిపోయెను జబ్బుచేసి
అడుక్కునే శక్తిలేదు
రానున్నది చలికాలం
దిక్కులేని దీనురాలు

ఏళ్ళు ముదిరి కీళ్ళు కదలి
బతుకంటే కోర్కె సడలి
పక్కనున్న బండరాతి
పగిదిగనే పడి ఉన్నది

ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరిదని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది

ఎముక ముక్క కొరుక్కుంటు
ఏమీ అనలేదు కుక్క

ఒక ఈగను పడవేసుకు
తొందరగా తొలగే తొండ

క్రమ్మే చిమ్మ చీకట్లు
దుమ్మురేగే నంతలోన

ఇది నా పాపం కాదనె
ఎగిరి వచ్చే ఎంగిలాకు

శ్రీ శ్రీ 
మహా ప్రస్థానం