Thursday, 30 May 2013

నా తెనుగు భాష!

ఆకాశమంత అందమైనది
                       నా తెనుగు భాష!
అందులో నా ఆకాంక్షలు కాంక్షలై మెరిస్తే...
అది చూసే ప్రతి నయనం
                       ఓ కవితై పొంగుతుంది!
పులకించిన ప్రతి హృదయం
                      కవి కలమై వర్షిస్తుంది!!
                                            
                                         30/05/13
                                      భార్గవి కులకర్ణి
                          

Wednesday, 29 May 2013

24/3/2013

దేనికీ తృప్తి పడనివ్వదు!

ఎందులోనూ సర్ధుకుపోనివ్వధు!

కడతేరని ఆశల మేఘం 

కురిపించే కన్నీటి వర్షం 

నిను  తడపక మానదు!

Wednesday, 3 April 2013

స్నేహితులతో గానీ, బంధువులతో గానీ...

అనుబంధం పెంచుకోడానికి అబద్ధాలు చెప్తూ, రాని నవ్వులు నటిస్తూ ఉండటం మంచితనమా??
నిజాయితీగా, నిజాలు చెప్తూ వారి మేలుకోసం లేదా మన మేలుకోసం బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడటం మంచితనమా?

Sunday, 24 March 2013

అమావాస్య నిశి



                                                                                              24/3/13   

నట్ట నడి రాతిరి 
నింగి నిండా... 

నిండు చుక్కల కన్నుల్లో... 
ఏమిటీ వింత కల అని 

వెక్కిరించే వెన్నెలే...!
ఒకనాడు.... 


వెర్రి గుండెలో వెగటై
వేళ దాటి వేల 
నవ్వుల సుడిగుండంలో 
చందమామను తోసి 
అమావాస్య నిశి 
దాహం తీర్చుకుంటుంది!!

                                                            -భార్గవి కులకర్ణి