Sunday, 25 November 2012

సంధ్య - దేవరకొండ బాల గంగాధర తిలక్

గగనమొక రేకు
కన్నుగవ సోకు
ఎరుపెరుపు చెక్కిళ్ళ విరిసినది చెంగల్వ
సంజె వన్నెల బాల రంగు పరికిణి చెంగు
చీకటిని తాకినది అంచుగా
చిరుచుక్క ప్రాకినది

వాలు నీడలా దారి నీలి జండాలెత్తి
చుక్క దీపపువత్తి సొగయు బాటలనల్ల
నిదుర తూలెడి నడక గదుము మైకపు  కోర్కె
వచ్చు నిశిలో కరిఇగి నవ్వు శశిలో కలిసి
సంజె వన్నెల బాల రంగు రంగు రుమాల
విరిసింది కలలల్లు
వెండి తోటల మధ్య
వ్రాలినది వ్రాలినది తావిగా
సోకినది సోకినది

సంజె పెదవుల  కడలి అంచుల విరిగి
సంజె పరికిణి చెరగు ఎడద లోతుల మెరసి
ఏటి కొంగల నిదుర ఎర్రగా ప్రాకింది
బాతు రెక్కల నీడ బరువుగా సోలింది
సంజె వన్నెల చాలు స్వర్ణ స్వర్ణది ధార
వయసు మైకపు జీర కరగు మబ్బుల తేల


గగనమొక రేకు
కన్నుగవ సోకు



1941
 - దేవరకొండ బాల గంగాధర తిలక్ 
అమృతం కురిసిన రాత్రి 

నా కవిత్వం - దేవరకొండ బాల గంగాధర తిలక్

నా కవిత్వం కాదొక తత్వం 
మరికాదు మీరనే మనస్తత్వం 
కాదు ధనికవాదం, సామ్యవాదం 
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ 
జాజిపువ్వుల అత్తరు దీపాలూ 
మంత్ర లోకపు మణి స్తంభాలూ 
నా  కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ 
ధర్మ వీరుల కృత రక్త నాళాలూ 
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి 
నా కళా కరవాల ధగద్ధగ రవాలు 

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు 
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు 
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

~1941
దేవరకొండ బాల గంగాధర తిలక్

అమృతం కురిసిన రాత్రి  


Thursday, 18 October 2012

గుండె గొంతుదాటి వచ్చి ప్రేమను పంచాలనుకుంటోంది!
పెంచుకోలేని మౌనం గుటకలువేస్తూ దాచుకుంటోంది!
ప్రాణం పరితపిస్తూ తనను పలకరించుకుంటోంది!
మరణం పరితపిస్తూ చేరే తరుణం చెరువౌతోంది!
తనలోని ప్రాణం విలవిలలాడుతోంది!
తల్లి తన పేగు ముడివేసుకు దాచుకుంటోంది!

ఆశ



రాతిగుండె కరిగి కన్నీరై పోయినా...
పగిలిపోయి ముక్కలై మాట నెగ్గనివ్వదు!
ఏ కథకేన్ని మలుపులిచ్చినా ...
ఏ కదలిక పెనుతుఫాను తెచ్చినా...
ఆశొకటే మిగిలి పోస్తుంది ఊపిరిని...!!

నవ్వులు కురిపించాలని