కళారవి
పోనీ, పోనీ!
పోతే పోనీ!
సతుల్, సుతుల్, హితుల్ పోనీ!
పోతే పోనీ!
రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లు , పాట్లు, రానీ!
రానీ, రానీ!
కానీ, కానీ!
గానం, ధ్యానం!
హాసం, లాసం!
కానీ, కానీ!
కళారవీ! పవీ! కవీ!
-శ్రీశ్రీ
మహా ప్రస్థానం
11-07-1934
No comments:
Post a Comment