Monday, 26 November 2012

అతడు ఆమె


13/12/08
అతడు.....!!
గుట్టు తెలిసిన వాడు!
కనికట్టు చేసేవాడు!!
గుండె చాటున నక్కేవాడు!
గుండె కోసిచ్చేవాడు!!
గుండెను గుచ్చేవాడు!
గుడి గంటలు మ్రోగించేవాడు!!

ఆమె....!!
చూపు గారడీ చేసేసేది!
చూపులకే దొరకనిది!!
పరుల సిగ్గులే పలికేది!
పాప పుణ్యాలు లేక్కేసేది!!
మౌనంగా రోధించేది!
మురిపాలు పండించేది!!

-భార్గవి కులకర్ణి 

No comments:

Post a Comment