ఐ
భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్య గీతాన్ని నేను!
స్మరిస్తే పద్యం,
అరిస్తే వాద్యం,
అనల వేదిక ముందు ఆశ్ర నైవేద్యం!
లోకాలు, భవభూతి శ్లోకాలు,
పరమేష్టి జూకాలు న మహోద్రేకాలు!
నా ఊహ చాంపేయమాల!
రస రాజ్యడోల!
నా ఊళ కేదార గౌళ!
గిరులు సాగరులు, కంకేళికా మంజరులు,
ఝరులు నా సోదరులు!
నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం!
-శ్రీశ్రీ
మహా ప్రస్థానం
01-06-1934
No comments:
Post a Comment