భార్గవి/ 01/06/16
నిద్రలేవగానే పక్కబట్టల్లో పడిపోయిన
కలలు వెతుక్కోవడానికే అరగంట పడుతుంది.
ఆలోచనలెంత దులిపినా ఒక్క కలా దొరకదే!?
ఫ్రిజ్ లో కూరగాయలు తీస్తుంటే
చల్లగా నీ ఊపిరి తగిలింది
నువ్వెప్పుడు దురావబ్బా ఫ్రిజ్ లో...?!
డీప్ ఫ్రిజ్ లో కూడా లేవే?
నీ బుగ్గలు చూస్తూ టమాటాలు కట్ చేస్తున్నా
నొప్పి పుట్టాక కానీ తెలీలేదు అది వేలని
నువ్ ముద్దాడిన వేలేనని బుజ్జగిస్తున్నా వినదే
నెత్తురెంత కార్చినా ఊరడించడానికిలేవని చెప్పా
అయినా వినదే
కూరలో కరివేపాకులా తీసిపడేస్తానంటావ్
బేసిక్ గా హైట్ కైనా, హెల్త్ కైనా
మంచిదని పెట్టుకుంటే
పెరట్లో కరివేపాకు చెట్టులా నిల్చునే ఉంటావ్ ఎప్పుడూ
చెట్టుగాలి తాకినప్పుడల్లా నువ్వొచ్చావని
పెరటి తలుపు తీసి వెతుకుతున్నా
ఒంట్లో ప్రాణం లేనట్టు ఏంటా ఉతకటం అంటావేగాని
నీ బట్టలక్కూడా గాయం కావద్దని
ఆ సుకుమారం అని తెలీదు నీకు
నీరెండలో మంచమేస్కుని పనసతొనలు
తింటూ కూర్చున్నా నీ పల్లే గుర్తొస్తాయి
అవును మరి అందమైన పలువరసా అది?
పడుకుంటే పగలంతా నీతో గడిపిన
నిమిషాలే కలలవుతాయ్
చక్కిలిగింతలు పెట్టిలేపుతాయ్
చెప్పులేసుకుంటే నీతో నడుస్తున్నట్టు
స్నానం చేస్తే నీళ్ళై తడుపుతున్నట్టూ
జడవేస్కుంటే నీకోసం ఎదురు చూస్తున్నట్టూ
తింటే నువ్ నాలో బ్రతుకుతున్నట్టూ
ఎవరితో ఏం మాట్లాడినా పక్కనే ఉండి వింటున్నట్టూ
కొంటెపనులు చేస్తే నెత్తిమీద మొట్టుతున్నట్టు
అంతా నువ్వైపోయాక
నాలో నువ్ నిండిపోయాక, నాపేరునే మర్చిపోయాక
నువ్వు నిజమై ఒకరోజు కళ్ళముందు చేరినా
వచ్చానని చెప్పి బుగ్గ గిల్లినా భ్రమే అనుకుంటాను
గిలిగింత పెట్టినట్టు వెర్రినవ్వు నవ్వుతాను!

No comments:
Post a Comment