నిత్యకళ్యాణం - పచ్చతోరణం
16 /06/09
నువ్వుండాలని నాకళ్లలో
నువ్వు నిండాలని నాగుండెలో
ని కోసమే దాచే చిరునవ్వులు
ని రాకకై పరిచే మరుమల్లెలు
విశ్వమంతా నిదురించిన క్షణాన
కలవరింతతో తట్టిలేపు
నడిరేయి ఉషస్సు నీ తలపు!
ప్రణయమంతా ఆవిరవ్వగ
ప్రణవ నాదం మారుమ్రోగగ
మనువు నదిలో తేనెబొట్టై
నిను మురిపించు న వలపు
వేసవేసిన ఎండుటాకుల పల్లకిలో
ఎదురుచూస్తా ఎల్లకాలం
(నేల పెళ్లి పీటలు)
తోలి ఉషస్సు పసుపు పారని
పాదాలంటు ప్రతీ ఉదయం
(నింగి నేల ఒదిగిన పెళ్లి పందిరి)
మలి సంధ్య కుంకుమ రాశులు
పాపిట మెరిసిన అనురాగం
జన్మ తొలి అడుగుకు దిద్దిన శ్రీకారం
ఏకాంతాలే వాసంతాలై
పలికించేను నవీన రాగం
నీకోసం వేచిన క్షణాలకెపుడూ
నిత్యకళ్యాణం - పచ్చతోరణం
-భార్గవి కులకర్ణి
MANA JEEVITHAM NITHYA KALYANAM PACHCHA TORANAM
ReplyDelete