Sunday, 8 January 2012

nee rakakai


నీ రాకకై!
నీ రాకకై 
వేనవేల ఆకాంక్షలు
ఎదురుచూస్తున్నాయి
నీ అడుగుకై పృథ్వి
తన తనువులోని అణువణువూ
పొంగుతోంది.

నీ రాకకై 
ఒంటరి నిశాచారిగా
ప్రాణం కాపుకాస్తోంది.

నిను చూడలేని ఇన్ని యుగాల
దీర్ఘ చూపులు నిను గుచ్చలేదా!
గాలిలో నిట్టూర్పులు నిను తాకలేదా!

ఉహకయినా అందని వేగంతో
నా మౌనరాగానికి గుండెసడులు
లయ వేస్తున్నాయి.



ప్రియతమా...
నీ కౌగిలికై 
ఎద రగులుకుంటుంది.
నీ పదములకై 
మది మేలుకుంటుంది.
రెండక్షరాల నీ ప్రేమ లాలనకై
లక్ష అక్షరాలు జారి
నీ హృదయ పత్రంపై పూజ చేస్తున్నాయి.
గుప్పిట్లో ఆలోచన 
ఒదగనంటోంది. 
మునిపంటి కింద పెదవి
నలిగిపోతోంది.
పెదవి గడపదాటి చిరునవ్వు
బయట పడకుంది. 
-భార్గవి

No comments:

Post a Comment