మరు మల్లెల వెన్నెలలు...
పిల్లగాలి తెమ్మెరలు....
చిరుజల్లుల తోలకరులు...
మదిని మధించే మదనులు...
కనుగీటి కవ్వించే కన్నెలు..
దరహాసపు దొంతరలు..
సెలయేటి గలగలలు...
ఉప్పొంగిపోయే మదుల నదులు...
విరహాల తపనలు....
విలాసాల సౌధాలు....
ఏవీ ఎరుగని పదాల గమనం!
ఏదో చెప్పే పెదాల కవనం!
కరువులేని కలలు తప్ప ,
కదలలేని కలం తప్ప,
ఏమీతెలియని కగితమిది!
నా కవితకు ప్రాణమిది!!
-భార్గవి కులకర్ణి
23/12/12
No comments:
Post a Comment