ఒకరిపై మనకున్న అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఏ పని చేసినా తప్పే అనుకోవడం, దాన్ని ఎత్తిచూపడం, ఏ ప్రయత్నం చేసినా పనికిమాలిన వాళ్ళ కింద జమకట్టడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.
నీ లోని మంచి నువ్వు తెలుసుకోలేకపోయావు.
కానీ ఎదుటివారిలోని మంచితనాన్ని చూడు.
నీలో నీకె తెలియని చెడ్డవాన్ని వెతికి సంహరించు.
లేదంటే నీలోని చెడ్డతనం నిన్ను చేతకాని వాడిగా చేసి నీ అహానికి నిన్నే బలిస్తుంది.
వాళ్ళు గతం లో ఏంటి?, చిన్నా?పెద్దా?, చదువరేనా?, కాదా?, డబ్బుందా?, లేదా? అనేది ప్రశ్నే కాదు.
వర్తమానం చూడు. భవిష్యత్తు గురించి ఆలోచించు.
గడవాల్సిన కాలం చాలా ఉంది మన కళ్ళ ముందు!
No comments:
Post a Comment