Saturday, 29 October 2011

Nesthamaa!

నేస్తమా!


కంటిపాప వెనుక కోటి కన్నీటి పొరల చాటు
కలత చెందిన కలవై మిగిలావా నేస్తమా!
చెమ్మగిల్లెను గుండె ఎందుకని తడిమితే
తిరిగి రాలేని నిన్ను చేరుకోవాలంది.
ఇంత నిజం తెలిసినా జ్ఞాపకాల నీడల్లో
ఆ చింతచెట్టు ఊయల్లో 
బొమ్మల్లో, చెరగని చిరునవ్వుల్లో
ఇంకా మన స్నేహం ఆనందంగానే ఉంది.
కాలం ఆగలేదు కానీ పయనం సాగలేదు.
చీకటి వెలుగుల చాటున దాగిన నీరూపం
కనరాని తీరం చేరలేదని తెలుసుకొని
గాలి పల్లకిలో మౌనాన్ని వెతుకుతూ
మన స్నేహాన్ని తోడుగా పంపుతున్నా!
అది నిన్ను వెతికి నన్ను కలుపుతుందని ఆశిస్తూ...!
-భార్గవి కులకర్ణి.

1 comment: