జోల పాట కోసం నిద్దురయ్యే కళ్ళు
ఎదో సాయంకాలం స్తంభించిన మెదడులో
కదల లేని దేహాన్ని తాకే ఆవిరిలో
గతాల్లోంచి కొట్టుకొచ్చిన మాట
"నూరేళ్ళ సహవాసం"
తల విదిలించి కొట్టేసి తిరిగి పేర్చుతావ్
ఇప్పుడది "ఆరేళ్ళ సహవాసం"
నీకు తెలియని నిజమై
నా కళ్లలో మెస్సేజ్ లా బ్లింక్ అవుతుంది
తలుపు మూసేసి
నడుస్తున్న గడియారంలో బ్యాటరీ తీసేసి
రాయని కాగితం చివర పుల్ స్టాప్ పెట్టి
నిట్టూర్పు తో వాలిన కళ్ళు ఓ చూపు విసురుతాయ్
ఆ ప్రకంపనతో నీకు గ్రీన్ సిగ్నల్ పడుతుంది
చిరునవ్వుతో పుల్ స్టాప్ చెరిపేసి
తెల్ల కాగితం పై కవితలు చదవడానికి ముంగిట్లో వాలతావ్!
కానీ నీకు తెలియదు
ఆకాశం మెహేంది పెట్టుకుని పోయిందని
తప్పి పోయిన పగలుకు కాలం విరిగిందని
సీకటి తో మంతనాలు ఎన్నాళ్ళు చేస్తావో....
ఎడతెగని బంధమై ఎదురు చూస్తావో
ఎడబాటే బాటై సాగిపోతావో
బ్లాక్ హోల్ పడిపోయిన మనసుకు వెతుక్కుంటావ్
అప్పటిదాకా నీ పిలుపే మేలుకొలుపవ్వాలని
నీ రెప్పల్లో నిద్దరయ్యే నేను!!
-భార్గవి
01/11/18
ఎదో సాయంకాలం స్తంభించిన మెదడులో
కదల లేని దేహాన్ని తాకే ఆవిరిలో
గతాల్లోంచి కొట్టుకొచ్చిన మాట
"నూరేళ్ళ సహవాసం"
తల విదిలించి కొట్టేసి తిరిగి పేర్చుతావ్
ఇప్పుడది "ఆరేళ్ళ సహవాసం"
నీకు తెలియని నిజమై
నా కళ్లలో మెస్సేజ్ లా బ్లింక్ అవుతుంది
తలుపు మూసేసి
నడుస్తున్న గడియారంలో బ్యాటరీ తీసేసి
రాయని కాగితం చివర పుల్ స్టాప్ పెట్టి
నిట్టూర్పు తో వాలిన కళ్ళు ఓ చూపు విసురుతాయ్
ఆ ప్రకంపనతో నీకు గ్రీన్ సిగ్నల్ పడుతుంది
చిరునవ్వుతో పుల్ స్టాప్ చెరిపేసి
తెల్ల కాగితం పై కవితలు చదవడానికి ముంగిట్లో వాలతావ్!
కానీ నీకు తెలియదు
ఆకాశం మెహేంది పెట్టుకుని పోయిందని
తప్పి పోయిన పగలుకు కాలం విరిగిందని
సీకటి తో మంతనాలు ఎన్నాళ్ళు చేస్తావో....
ఎడతెగని బంధమై ఎదురు చూస్తావో
ఎడబాటే బాటై సాగిపోతావో
బ్లాక్ హోల్ పడిపోయిన మనసుకు వెతుక్కుంటావ్
అప్పటిదాకా నీ పిలుపే మేలుకొలుపవ్వాలని
నీ రెప్పల్లో నిద్దరయ్యే నేను!!
-భార్గవి
01/11/18
No comments:
Post a Comment