భార్గవి/ 22/07/13 - 11am/ పూర్తవ్వని పుస్తకం

ఎందుకాగిందో కలం...!
ఈ పదం దగ్గర...!
చేరువ లేని కాలాన
దూరదూరాన...
పూర్తవ్వని పుస్తకంలో
ఏకాకి ప్రేతాత్మలా
ఎందుకాగిందో కలం...!
ఈ పదం దగ్గర...!
అడిగిన ప్రశ్నే...
అడుగడుగూ
చెప్పిన బదులే
ప్రతి పథమూ...
ముసుగు తీసుకుని
ముళ్ళ కిరీటాలు ధరించి
లేని నవ్వులు పూయించి
రాని భాషనూ భరించి
కాలాన్ని గుప్పిట బిగించి
తడిసిన గుండెను పిండి
వర్షం కురిపించి
మది భారం తగ్గించి
ఎడారిలో ఏకాకిలా..
ఎందుకాగిందో కలం...!
ఈ పదం దగ్గర...!
పగలూ, రాత్రీ కలిసే తీరం
కాలంలోనే దాక్కుంది!
వెలుగూ, చీకటి కలిసే చోటు
చూపుల్లోనే చిక్కింది
వచ్చిందెపుడో, పోయిందెపుడో...
జన్మా, కర్మా గడిచిందెపుడో...
జీవిత పుస్తకం పూర్తవకుండా
ఎందుకాగిందో కలం...!
ఈ పదం దగ్గర...!
Thank u....
ReplyDeleteSuper Madam
ReplyDelete