నా జీవితానికి నే కారకురాలిని కానే!
నా రాతను మార్చిందీ నరకిరాతకులే!!
నే చేయనిదానికి నన్ను శిక్షించారే!?!
ప్రవళ్ళికా సంద్రంలో మునిగిపోయాయి కనులు!
ఈ ప్రళయ వికృతిలో నా పాదమెటు కదులు?!
ఎవరి మనసు రగిల్చి కన్నీటి లాల పోసిందో!?!
ఎవరి గుండె పగిలిన సడి నాకు జోల పాడిందో!?!
కలవరమై కళ్ళలోన 
కాటివైపు నడకలోన 
అక్షరమే వెక్కిరించిన 
నిబ్బరంగా గుండెనదిమి
నిప్పునంటి నిజాలన్నీ 
నివురునై నే ధాచివేస్తూ...
వేకువనై నే వేచిఉన్నా!!
కన్నెత్తి చూడలేక 
కనుమరుగు కాలేక 
నను వెక్కిరించే 
సమాజాన్ని నే 
వెలివేసుకుంటూ ...
చిరునవ్వుల తెర చాటున 
చిదిమిన గుండె దాచుకుని 
వేకువనై నే వేచిఉన్నా!!
వస్తావని - వసంతం 
తెస్తావని - వరాలు 
కురిపిస్తావని - వెన్నెల్లో 
ముంచేస్తావని - కన్నుల్లో 
కనిపిస్తావని - కలలు 
తీరుస్తావని - ఊహలు 
వేకువనై నే వేచిఉన్నా!!!
~భార్గవి  
17/07/2012
 
 
No comments:
Post a Comment