Sunday, 25 December 2011

nenunna!

నేనున్నా!
03-10-2008

శిధిలమైన జ్ఞాపకాలు 
చిగురిస్తున్నట్లున్నాయి
ఈ తీరికలో
తికమకలన్ని తీరాన్ని చేరుతున్నాయి
జరిగిపోయిన జీవిత కాలపు 
జాతకమంతా గుర్తుకొస్తోంది
మదిని మురిపిస్తోంది
హృదిని మైమరపిస్తోంది.

దొరికింది ఓనిజం!
చెరిగిపోని నీ సంతకం
చెదిరిపోయిన నాకు సంకేతం!

ఊరడిల్లిన నీమదిలో నేనున్నానో లేనో? 
ఉపిరికాలపు మౌనాన మాత్రం మిగిలిపోయాను.
కలల తీరపు వాకిట్లో నిల్చుని
కలలా అయినా కనిపించానో లేదో?
 నీ మెదడులో మెదిలే ఆలోచనై క్షణ క్షణం పుడుతున్నాను.
ఉన్నపాటుగా నీ ఆశల మొగ్గలన్నీ 
తుంచేసానో ఏమో!
వాడిన "సుమలత"ల రూపం ముద్రైపోయింది నాలో! 
పిలుపైనా వినకుండా గొంతు నొక్కి పారేసావ్!
ఎడారిలో ఏకాకిలా నువు మిగిలున్నా...
చేయుతనిస్తూ కడలిలా కలలో అయినా నీవెంటుంటా!

-భార్గవి కులకర్ణి 

Wednesday, 21 December 2011

eyes

కళ్ళు
08/10/2007

ఓ కన్ను ఆనందపు తడి!
ఓ కన్ను బాధల సుడి!
ఆనందపు తడిలో ఆశల పులు పూస్తే
నిను పూజిస్తాను.
బాధల సుడిలో బందాలు కలిసిపోతే
 బండనైపోతాను .

thavika!!!

ఎండని ఏరు
ఆగని సెలయేరు
నాకంటి నీరు
నీ పాదాల చేరు! 

Evaru veeru

ఎవరు వీరు?
22-12-2006
ఎవరు వీరు?
దేశమాత పెదవిపై మాసిన చిరునవ్వులు
మనసు రేయి పిడికిలిలో నలిగిన పువ్వులు
ఆకలి దేవత ఒడిలో కనుమూసిన దివ్వెలు
ఆర్తికోసమల్లాడే అనురాగపు సమిధలు
కల్మశమెరుగని బోసినవ్వుల పాలవెల్లులు వీరు
ఎవరంటారా వీరు?
ఎవరో కారు వీరు - ఎవరికీ కారు వీరు.













ఏడుపు తెలియని కంట కన్నీరు వీరు!
బాధ తెలియని గుండెకు భాద్యత వీరు!

బ్రహ్మ దేవుని కలం నుండి 
జాలువారిన సిరా చుక్కలు,
వాణీ నాదంలోన వినిపించిన అపస్వరాలు.
-భార్గవి కులకర్ణి 

Tuesday, 20 December 2011

Street childern

గెలుపు 


గుండె గుండెలో నింపు జాతీయ భావం!
గుండె తట్టి నిదురలేపు భారతీయ స్వభావం!!
మనసులోని ఆశలన్ని మన్నులోన గలుపు!
బాల కార్మికులను భావి పౌరులుగా నిలుపు!
అదే ని జీవితానికి ఓ పెద్ద గెలుపు!!
-భార్గవి కులకర్ణి