- శ్రీశ్రీ మహాప్రస్థానం
- తిలక్ అమృతం కురిసిన రాత్రి
- దేవులపల్లి కృష్ణశాస్త్రి కృష్ణపక్షము
- భార్గవి తెలుగు కవితలు
- తెలుగు కథలు
- శ్రీశ్రీ ఖడ్గ సృష్టి
- రవీంద్రనాథ్ ఠగోర్ గీతాంజలి
Tuesday, 26 March 2013
Sunday, 24 March 2013
అమావాస్య నిశి
24/3/13
నట్ట నడి రాతిరి
నింగి నిండా...
నిండు చుక్కల కన్నుల్లో...
ఏమిటీ వింత కల అని
వెక్కిరించే వెన్నెలే...!
ఒకనాడు....
వెర్రి గుండెలో వెగటై
వేళ దాటి వేల
నవ్వుల సుడిగుండంలో
చందమామను తోసి
అమావాస్య నిశి
దాహం తీర్చుకుంటుంది!!
-భార్గవి కులకర్ణి
Thursday, 21 March 2013
Wednesday, 20 March 2013
శబ్బాష్ రా శంకరా!
భోళా బాలాగా....
-తనికెళ్ళ భరణి
శంకర అంటేనే నాకు
శక్కర లెక్కనె ఉంటధయ్య
శివునాగ్నైతది... సీమనైత...
శబ్బాష్ రా... శంకరా!
గణపతి దేవుడు నీకు బిడ్డ
ఖబరస్తానేమొ నీ అడ్డ..!
నీ తత్వాల్ పాడతా-కాళ్ళమీద బడ్డా
శబ్బాష్ రా... శంకరా!!
పుట్టించేదా బ్రెమ్మసామి
ఇష్ణుమూర్తేమో నడ్పిస్తడా !
నువ్వొకినివెర పండబెట్టేడిది
శబ్బాష్ రా... శంకరా!!
ఆదా చెంద్రమ నెత్తిమీద
నీలో ఆదానేమొ అమ్మాయే !
పూరా జ్ఞానివి నీకు సాటెవరురా
శబ్బాష్ రా... శంకరా!!
బొందల్ గడ్డల పంటవంట
నీ కన్నంత మంతంట !
నీ ఇల్లూ ఇల్లాల్ సల్లగుంటరట
శబ్బాష్ రా... శంకరా!!
నేనా ఎద్దును, ఒట్టి మొద్దును
నువ్వు డోల్గోడ్తె నేనాడ్త !
గందుకె పశుపతివంటరయ్య నిన్ను
శబ్బాష్ రా... శంకరా!!
నీ అంతేడనొ తెల్సుకోనీకి
కింద మీధైన్రు తోటోళ్ళు !
'అంతే' నీవని తెల్సుకోరేందిరా
శబ్బాష్ రా... శంకరా!!
చెంబెడు నీళ్ళు పోస్తే ఖుష్...!
చిటికెడు బూడ్దే పూస్తే బస్...!!
వొటి పుణ్యానికి మోక్షమిస్తవు గదా
శబ్బాష్ రా... శంకరా!!
Wednesday, 13 March 2013
Tuesday, 12 March 2013
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని!
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని!
మారదు లోకం! మారదు కాలమ్!
దేవుడు దిగి రానీ... ఎవ్వరు ఏమైపొనీ...
మారదు లోకం! మారదు కాలమ్!
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి?
గొర్రెదాటు మందకి మీ జ్ఞాన భోధ దేనికి?
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం?
ఏ క్షణాన మార్చుకుంది? జిత్తుల మార్గం!
రామబాణమాపిందా రావణ కాష్టం!
కృష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం!
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైన
అడవి నీతి మారిందా?ఎన్ని యుగాలైనా?
వేట అదే వేటు అదే! నాటి కథే అంతా !
నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింతా?
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ!
రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
సినిమా : గాయం
గానం : S.P.బాల సుబ్రహ్మణ్యం గారు
Subscribe to:
Posts (Atom)